అన్వేషించండి

Ambernath Suicide Case:బెడ్‌ రూమ్‌లో సీసీ కెమెరాలు పెట్టిన డాక్టర్ బాబు! పెళ్లయిన 48 రోజుల్లోనే నవ వధువు సూసైడ్!

Ambernath Suicide Case: డాక్టర్ భర్త తన భార్యపై నిరంతర నిఘా ఉంచేందుకు ఇంట్లో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసిన వికృత చేష్టకు ఒక నిండు ప్రాణం బలైపోయింది.  

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • నూతన వధువు విశాఖ, భర్త నిఘా, వేధింపులతో ఆత్మహత్య.
  • ఇళ్లంతా సీసీ కెమెరాలు పెట్టి, డిజిటల్ జైలులా మార్చేశాడు.
  • పొరుగువారితో మాట్లాడినందుకు కొట్టి, కట్నం కోసం వేధించారు.
  • నిందితుడైన డాక్టర్ భర్త అరెస్ట్, ఇతరుల కోసం గాలింపు.

Ambernath Suicide Case:పెళ్లంటే నూరేళ్ల పంట అంటారు. కానీ నవ వధువుకు అది నూరేళ్ల మంటగా మారింది. కట్టుకున్నవాడే కాలయముడైతే , కాపాడాల్సిన డాక్టరే ప్రాణాలు తీసేలా వేధిస్తే ఆ నరకం ఎలా ఉంటుందో అంబర్‌నాథ్‌లో జరిగిన ఘటన కళ్లకు కడుతోంది. కేవలం 48 రోజులు అంటే రెండు నెలలు కూడా గడవక ముందే 26 ఏళ్ల విశాఖ తిలక్ అనే యువతి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన సంచలనంగా మారింది. 

సాధారణంగా దొంగల భయం కోసం కెమెరాలు పెడతారు. కానీ ఇక్కడ ఒక డాక్టర్‌ తన భార్య ప్రతి కదలికను, ఆమె ఎవరితో మాట్లాడుతుందో, ఏం చేస్తుందో వాచ్ చేయడానికి ఏకంగా ఇళ్లంతా సీసీటీవీ కెమెరాలు పెట్టాడు. చివరకు బెడ్‌రూమ్‌లో కూడా పెట్టాడు. ఇంటిని ఒక డిజిటల్ జైలుగా మార్చేశాడు. ఈ మానసిక హింసను భరించలేకే ఆ యువతి తనువు చాలించిందని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

పడక నుంచి గడప వరకు కెమెరాలే 

ముంబైకి సమీపంలోని థానే జిల్లా అంబర్‌నాథ్‌లో నివసించే డాక్టర్ నితిన్ తిలకర్‌తో విశాఖకు ఏప్రిల్‌ 30న ఘనంగా వివాహం జరిగింది. పెళ్లికి ముందు అంతా సవ్యంగానే ఉన్నా, మెట్టిన ఇంట్లో అడుగు పెట్టిన కొద్ది రోజులకే అసలు రంగు బయటపడింది. భార్య ఎవరితోనూ మాట్లాడకూడదు, బయటకు వెళ్లకూడదు అనే ఉన్మాదంతో నితిన ఇంటి లోపల, బట అనేక సీసీటీవీ కెమెరాలు అమర్చాడు. ఆమె ఇంట్లో ఎక్కడ ఉన్నా ఏం చేస్తున్నా తన ఫోన్ ద్వారా నిరంతరం నిఘా ఉంచేవాడు. ఇది ఆమె ప్రైవేసిని పూర్తిగా హరించడమే కాకుండా, ఆమెను ఒక ఖైదీలా మార్చేసింది. 

పొరుగింటి వారితో మాట్లాడితే దాడులు 

ఈ కేసులో అత్యంత కిరాతకమైన విషయం ఏంటంటే, విశాఖ పొరుగింటి మహిళలతో మాట్లాడిందని తెలిసి నితిన్ ఆమెను దారుణంగా కొట్టాడు. చదువుకున్న డాక్ట్ అయి ఉండి, భార్య కనీసం ఇరుగుపొరుగుతో మాట్లాడటానికి కూడా సంహిచలేకపోయాడు. ఆత్మహత్యకు రెండు రోజుల ముందు కూడా ఇదే విషయంపై ఆమెపై చేయిచేసుకున్నాడని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

మర్యాదల పేరుతో వేధింపులు

కేవలం నిఘా మాత్రమే కాదు, ఈ కేసులో వరకట్న వేధింపులు కూడా ఉన్నాయని బాధితురాలి కుటుంబం ఆరోపిస్తోంది. పెళ్లి సమయంలో తమకు ఆశించిన స్థాయిలో బహుమతులు రాలేదని, తమకు దక్కాల్సిన మర్యాద దక్కలేదని నితిన్ తల్లి ఛాయా, సోదరుడు నినాద్‌ కలిసి విశాఖను నిరంతరం వేధించేవారు. పుట్టింటి నుంచి నగలు, డబ్బు తీసుకురావాలని ఆమెపై తీవ్రమైన ఒత్తిడి తెచ్చేవారు. 

కాపాడాలనుకునే లోపే కడతేరిన ప్రాణం

తనపై జరుగుతున్న ఈ దారుణాల గురించి విశాఖ తన తల్లికి ఫోన్ చేసి కన్నీరు పెట్టుకుంది. కూతురి పరిస్థితి చూసి కలత చెందిన తల్లిదండ్రులు, అమెను ఇంటికి తీసుకువచ్చేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. కానీ వారు ఆమెను రక్షించేలోపే జరగరాని ఘోరం జరిగిపోయింది. విశాఖ తన నివాసంలో ఉరి వేసుకొని ప్రాణాలు విడిచింది. 

డాక్టర్ అరెస్టు 

ఈ ఘటనపై అంబర్‌నాథ్‌లోని శివాజీనగర్‌ పోలీస్ స్టేషన్‌లో కేసు నమాదైంది. నితిన్ తిలక్, అతని తల్లి ఛాయా, సోదరుడు నినాద్‌లపై సెక్షన్ల కింద వేధింపులు, ఆత్మహత్యకు ప్రేరేపించినందుకు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం డాక్టర్ నితిన్‌ను పోలీసులు అరెస్టు చేయగా, మిగిలిన నిందితుల కోసం గాలిస్తున్నారు. 

Frequently Asked Questions

ఈ సంఘటనలో ఆత్మహత్య చేసుకున్న యువతి ఎవరు?

విశాఖ తిలక్ అనే 26 ఏళ్ల యువతి పెళ్లైన 48 రోజులకే ఆత్మహత్య చేసుకుంది. ఆమె అంబర్‌నాథ్‌లో డాక్టర్ నితిన్ తిలకర్‌ను వివాహం చేసుకుంది.

విశాఖ ఆత్మహత్యకు గల ప్రధాన కారణాలు ఏమిటి?

భర్త నితిన్ తిలకర్ ఇంట్లో సీసీటీవీ కెమెరాలు అమర్చి, ఆమె కదలికలను నిరంతరం పర్యవేక్షించడం ద్వారా మానసికంగా హింసించాడు. అదనంగా, వరకట్న వేధింపులు కూడా ఈ ఆత్మహత్యకు దారితీశాయి.

భర్త నితిన్ ఆమెను ఎలా వేధించాడు?

నితిన్ ఇల్లంతా సీసీటీవీ కెమెరాలు అమర్చి, ఆమె ఎక్కడున్నా, ఏం చేస్తున్నా ఫోన్ ద్వారా నిఘా పెట్టాడు. పొరుగింటి వారితో మాట్లాడినందుకు ఆమెను దారుణంగా కొట్టాడు.

ఈ ఘటనపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకున్నారు?

డాక్టర్ నితిన్ తిలక్, అతని తల్లి ఛాయా, సోదరుడు నినాద్‌లపై వేధింపులు, ఆత్మహత్యకు ప్రేరేపించినందుకు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం నితిన్‌ను అరెస్టు చేయగా, మిగిలిన నిందితుల కోసం గాలిస్తున్నారు.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Kondagattu Accident: కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
Jana Sena Leader Murder Attempt: గుంటూరులో జనసేన నేత శ్రీనివాస యాదవ్ హత్యకు వైసీపీ నేత కుట్ర భగ్నం!
గుంటూరులో జనసేన నేత శ్రీనివాస యాదవ్ హత్యకు వైసీపీ నేత కుట్ర భగ్నం!
మైనర్ కొడుకును కిల్లర్‌గా మార్చిన తల్లి.. సిద్ధిపేటలో దారుణం - క్రైమ్ థ్రిల్లర్ సినిమాను మించేలా
మైనర్ కొడుకును కిల్లర్‌గా మార్చిన తల్లి.. సిద్ధిపేటలో దారుణం - క్రైమ్ థ్రిల్లర్ సినిమాను మించేలా
Addanki Ganja News: అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
Advertisement

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP DSC Notification 2026: ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
Telangana Political War: డిజిటల్ వర్సెస్ డెమోక్రటిక్ మాస్ - బీఆర్ఎస్ స్క్రీన్ ప్రచారం పై రేవంత్ రెడ్డి స్ట్రీట్ వార్ ప్రభావమెంత?
డిజిటల్ వర్సెస్ డెమోక్రటిక్ మాస్ - బీఆర్ఎస్ స్క్రీన్ ప్రచారం పై రేవంత్ రెడ్డి స్ట్రీట్ వార్ ప్రభావమెంత?
Shiva Srishti Vyakaranam: మోడలింగ్ నుంచి బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్ష వరకు.. శివ సృష్టి వ్యాకరణం గురించి ఆసక్తికర విషయాలు
మోడలింగ్ నుంచి బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్ష వరకు.. శివ సృష్టి వ్యాకరణం గురించి ఆసక్తికర విషయాలు
Ram Charan Irumudi: రవితేజ 'ఇరుముడి'లో అతిథిగా రామ్ చరణ్... అసలు నిజం ఏమిటంటే?
రవితేజ 'ఇరుముడి'లో అతిథిగా రామ్ చరణ్... అసలు నిజం ఏమిటంటే?
Donald Trump: అమెరికా ఎన్నికలకు భారతే పాఠం! ఓటర్ ఐడీ విధానంపై ట్రంప్ ప్రశంసలు! సేవ్ అమెరికా యాక్ట్ కోసం పట్టు!
అమెరికా ఎన్నికలకు భారతే పాఠం! ఓటర్ ఐడీ విధానంపై ట్రంప్ ప్రశంసలు! సేవ్ అమెరికా యాక్ట్ కోసం పట్టు!
చాణక్య నీతి: వైవాహిక జీవితంలో ఈ 5 తప్పులు ఇంటి శాంతి, సంతోషం, ఐశ్వర్యాన్ని దూరం చేస్తాయి!
చాణక్య నీతి: వైవాహిక జీవితంలో ఈ 5 తప్పులు ఇంటి శాంతి, సంతోషం, ఐశ్వర్యాన్ని దూరం చేస్తాయి!
Maruti Fronx చౌకైన మోడల్ రూ.1 లక్ష చెల్లించాక నెలవారీ EMI ఎంత కట్టాలి
Maruti Fronx చౌకైన మోడల్ రూ.1 లక్ష చెల్లించాక నెలవారీ EMI ఎంత కట్టాలి
Hyderabad Traffic Diversion: నేటి నుంచి కేబీఆర్ పార్క్ చుట్టూ వన్-వే అమలు.. 7 ఫ్లైఓవర్లు, 7 అండర్‌పాస్‌లతో ట్రాఫిక్ సమస్యకు చెక్
నేటి నుంచి కేబీఆర్ పార్క్ చుట్టూ వన్-వే అమలు.. 7 ఫ్లైఓవర్లు, 7 అండర్‌పాస్‌లతో ట్రాఫిక్ సమస్యకు చెక్
Embed widget