అన్వేషించండి

Instagram Live In Partner Killed: ప్రేమ గుడ్డిది - సోషల్ మీడియా ప్రేమ పిచ్చిది కూడా - ఇరవై ఏళ్లకే ఇన్‌స్టాగ్రామ్ లవ్.. లైవ్-ఇన్ రిలేషన్‌షిప్.. చివరకు హత్య!

Bengaluru Murder Case: ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పరిచయమై సహజీవనం చేస్తున్న 20 ఏళ్ల అనుషను అత్యంత దారుణంగా హత్య చేశాడు ప్రియుడు శరత్. లాయర్ ఇచ్చిన సమాచారంతో హంతకుడ్ని అరెస్ట్ చేశారు.

Anusha Sharath Bengaluru Crime:  సోషల్ మీడియా పరిచయాలు, క్షణికావేశాలు యువత జీవితాలను ఎలా బలితీసుకుంటున్నాయో చెప్పడానికి బెంగళూరులో జరిగిన ఈ ఘోరమే ఒక నిదర్శనం. ఇన్‌స్టాగ్రామ్‌లో మొదలైన ఓ ప్రేమకథ, సహజీవనం  వరకు వెళ్లి.. చివరకు మల్లేశ్వరం ఏరియాలోని ఒక అద్దె ఇంట్లో అత్యంత దారుణమైన హత్యతో ముగిసింది. కేవలం 20 ఏళ్ల వయసున్న అనుష అనే యువతిని, ఆమెతో కలిసి ఉంటున్న శరత్ అనే యువకుడు గొంతు నులిమి చంపేశాడు.  

రీల్స్ పరిచయం.. రియల్ లైఫ్ మర్డర్ 

కర్ణాటకలోని హాసన్ జిల్లా సకలేశపురానికి చెందిన అనుష, శరత్ లకు దాదాపు ఏడాది క్రితం  సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్  ద్వారా పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా కామెంట్లు, చాటింగ్‌లతో ప్రేమికులుగా మార్చింది. ఒకరినొకరు విడిచి ఉండలేమనుకున్న ఈ జంట, పెద్దలను ఎదిరించి బెంగళూరుకు చేరింది. మల్లేశ్వరం 7వ క్రాస్ ఏరియాలోని ఒక బెడ్‌రూమ్ ఉన్న ఇంట్లో గత ఆరు నెలలుగా ఈ జంట సహజీవనం సాగిస్తోంది. శరత్ నగరంలో వాటర్ ట్యాంకర్ డ్రైవర్‌గా పనిచేస్తూ జీవనం సాగించేవాడు.

 ఆల్కహాల్ మత్తులో ఆ రాత్రి ఏం జరిగింది? 

మల్లేశ్వరంలోని శేషాద్రిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘాతుకం జూన్ 14  రాత్రి  జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆ రాత్రి ఇద్దరూ కలిసి గదిలో మద్యం సేవించారు. ఆ సమయంలో ఇద్దరి మధ్య కొన్ని వ్యక్తిగత విషయాలపై తీవ్రమైన వాగ్వాదం చోటుచేసుకుంది. చిన్న విషయానికే మొదలైన గొడవ కాస్తా పెద్దదైంది. మద్యం మత్తులో ఉన్న శరత్ విచక్షణ కోల్పోయి, క్షణికావేశంలో అనుషపై దాడి చేసి, ఆమె గొంతును గట్టిగా నులిమి ఊపిరాడకుండా చేసి కిచెన్ ఫ్లోర్‌పైనే ప్రాణాలు తీశాడు.

 లాయర్‌కు ఫోన్ కాల్.. హత్య బయటపడిందిలా! 

అనుష చనిపోయిందని నిర్ధారించుకున్న శరత్ భయంతో వణికిపోయాడు. శవాన్ని గదిలోనే వదిలేసి, ఇంటికి తాళం వేసి కీని కిటికీ పక్కన దాచి అక్కడి నుంచి పారిపోయాడు. అయితే, చట్టం నుండి తప్పించుకోలేనని భావించిన శరత్.. సోమవారం ఒక ప్రముఖ న్యాయవాది కి ఫోన్ చేసి, తాను చేసిన ఘోరాన్ని ఒప్పుకున్నాడు. లాయర్ సలహా కోరగా, ఆ లాయర్ ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే శేషాద్రిపురం పోలీసులకు సమాచారం అందించాడు. లాయర్ ఇచ్చిన అడ్రస్ ఆధారంగా పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.

  కిచెన్ ఫ్లోర్‌పై శవం.. యజమాని స్టేట్‌మెంట్ 

పోలీసులు తాళం పగులగొట్టి లోపలికి వెళ్లి చూసేసరికి అనుష మృతదేహం వంటగది ఫ్లోర్‌పై పడి ఉంది. కాగా, ఇంటి యజమాని రమేష్ బాబు పోలీసులకు ఇచ్చిన స్టేట్‌మెంట్‌లో కీలక విషయాలు వెల్లడించారు. ఈ జంట నిరంతరం చిన్న చిన్న కారణాలకే ఇంట్లో గొడవ పడుతూ ఉండేదని, చుట్టుపక్కల వారు కూడా చాలాసార్లు వారిని మందలించారని తెలిపారు. ఈ నిరంతర గృహ కలహాలే చివరకు హత్యకు దారితీశాయని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.

 హంతకుడు అరెస్ట్.. దర్యాప్తు ముమ్మరం 

పోలీసులు నిందితుడు శరత్ కోసం గాలింపు చర్యలు చేపట్టి, 24 గంటల్లోనే అతడిని అరెస్ట్ చేసి కటకటాల వెనక్కి నెట్టారు. అనుష మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం మల్లేశ్వరంలోని కేసీ జనరల్ ఆసుపత్రికి తరలించారు. అనంతరం మృతదేహాన్ని సకలేశపురంలోని ఆమె తల్లిదండ్రులకు అప్పగించారు. ఇన్‌స్టాగ్రామ్ పరిచయాలు, గుడ్డి నమ్మకాలతో ఇల్లు వదిలి వచ్చే యువతులు ఎలా మోసపోతున్నారో, ఎలాంటి ప్రమాదాల్లో పడుతున్నారో ఈ ఘటన మరోసారి హెచ్చరిస్తోందని బెంగళూరు పోలీసులు ఆందోళన వ్యక్తం చేశారు.  


 

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Anakapalle Mines Surveyor ACB: ఒక్క సారే రూ.5 లక్షల క్యాష్ లంచం - రెడ్ హ్యాండెడ్‌గా చిక్కిన అనకాపల్లి మైన్స్ సర్వేయర్
ఒక్క సారే రూ.5 లక్షల క్యాష్ లంచం - రెడ్ హ్యాండెడ్‌గా చిక్కిన అనకాపల్లి మైన్స్ సర్వేయర్
Prudhvishwar Reddy POCSO Case: తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
Hyderabad Crime News: కొబ్బరి బోండాలు నరికే కత్తితో దాడిచేసి వ్యక్తి దారుణ హత్య.. హైదరాబాద్‌లో దారుణం
కొబ్బరి బోండాలు నరికే కత్తితో దాడిచేసి వ్యక్తి దారుణ హత్య.. హైదరాబాద్‌లో దారుణం
Adulterated Spices: హైదరాబాద్‌లో భారీ కల్తీ దందా రట్టు - 25 టన్నుల నకిలీ మసాలాలు స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్!
హైదరాబాద్‌లో భారీ కల్తీ దందా రట్టు - 25 టన్నుల నకిలీ మసాలాలు స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్!
Advertisement

వీడియోలు

Prediction For World Cup 2027 India Squad | వరల్డ్ కప్ 2027 టీమ్ ప్రిడిక్షన్స్ చెప్పిన గవాస్కర్
Rahane Comments On Indian Test Team | టీమిండియా టెస్ట్ టీమ్ పై రహానే కామెంట్స్
Mike Hussey & Eric Simons Leaving CSK | CSKకు గుడ్‌బై చెప్పనున్న మరో కోచ్
BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CBI On NEET Paper Leak: నీట్ పేపర్‌ లీక్ చేసింది ఎన్‌టీఏ నిపుణులే! సీబీఐ ఛార్జ్ షీట్‌లో దిగ్భ్రాంతికర విషయాలు!
నీట్ పేపర్‌ లీక్ చేసింది ఎన్‌టీఏ నిపుణులే! సీబీఐ ఛార్జ్ షీట్‌లో దిగ్భ్రాంతికర విషయాలు!
YSRCP Protest On DSC Irregularities: డీఎస్సీ అక్రమాలపై వైసీపీ ఆందోళనలు!సీబీఐ విచారణకు జగన్ డిమాండ్!
డీఎస్సీ అక్రమాలపై వైసీపీ ఆందోళనలు!సీబీఐ విచారణకు జగన్ డిమాండ్!
Korean Kanakaraju Review - కొరియన్ కనకరాజు రివ్యూ: హారర్ కామెడీ నవ్వించిందా? వరుణ్ తేజ్ సినిమా హిట్టా? ఫట్టా?
కొరియన్ కనకరాజు రివ్యూ: హారర్ కామెడీ నవ్వించిందా? వరుణ్ తేజ్ సినిమా హిట్టా? ఫట్టా?
Vishwanath And Sons Story : సరోగేట్ తల్లితో హీరో ఎమోషనల్ లవ్? - సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ స్టోరీ అదేనా?
సరోగేట్ తల్లితో హీరో ఎమోషనల్ లవ్? - సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ స్టోరీ అదేనా?
AP NEET MBBS Cutoff Ranks:నీట్‌లో ఏ ర్యాంకు వస్తే ఏపీలో ఎంబిబిఎస్ సీటు గ్యారంటీ? టాప్‌ కాలేజీల కటాఫ్‌ సంగతేంటీ?
నీట్‌లో ఏ ర్యాంకు వస్తే ఏపీలో ఎంబిబిఎస్ సీటు గ్యారంటీ? టాప్‌ కాలేజీల కటాఫ్‌ సంగతేంటీ?
మారుతి గ్రాండ్ విటారా నుంచి బలెనో వరకు సూపర్‌ ఆఫర్లు - రూ.1.55 లక్షల వరకు డిస్కౌంట్
ఇప్పుడు మారుతి కారు కొనేవాళ్లు నక్క తోక తొక్కినట్లే, రూ.లక్షల్లో డిస్కౌంట్లు!
Mohan Bhagwat on Gen-Z: జెన్‌జీ ఆందోళనలకు మద్దతుగా మోహన్ భగవత్ కీలక ప్రకటన! వ్యవస్థాగత దిద్దుబాటు కోసం ఉద్యమం జరగాలని కామెంట్ 
జెన్‌జీ ఆందోళనలకు మద్దతుగా మోహన్ భగవత్ కీలక ప్రకటన! వ్యవస్థాగత దిద్దుబాటు కోసం ఉద్యమం జరగాలని కామెంట్ 
CJP Kya Bolti Public campaign: నిరుద్యోగంపై కాక్రోచ్‌ జనతా పార్టీ సమరశంఖం! దేశవ్యాప్తంగా క్యా బోల్తీ పబ్లిక్‌ పేరుతో ప్రచారం!
నిరుద్యోగంపై కాక్రోచ్‌ జనతా పార్టీ సమరశంఖం! దేశవ్యాప్తంగా క్యా బోల్తీ పబ్లిక్‌ పేరుతో ప్రచారం!
Embed widget