అన్వేషించండి

Hyderabad Techie Suicide: హైదరాబాద్‌లో ఆరో అంతస్తు నుంచి పసికందుతో దూకేసిన తల్లి! నిద్రలేమి సమస్యే ప్రాణం తీసిందా?

Hyderabad Techie Suicide: హైదరాబాద్‌ మియాపూర్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌ ఇషా సాహు పసిబిడ్డతో భవనంపై నుంచి దూకారు. నిద్రలేమి సమస్యే కారణమని అనుమానం.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • మియాపూర్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఆత్మహత్య, ఆరు నెలల చిన్నారి క్షేమం.
  • కొన్ని నెలలుగా నిద్రలేమితో తీవ్ర ఒత్తిడి ఆత్మహత్యకు దారితీసింది.
  • చిన్నారి ఆసుపత్రిలో కోలుకుంటుండగా, పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
  • మియాపూర్‌లోని లక్ష్మీ ప్రెస్టీజ్ అపార్టమెంట్‌లో ఆరో అంతస్తు నుంచి దూకిన 37 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఆత్మహత్య చేసుకుంది. 
  • తల్లి చేతుల్లోంచి జారిపడటంతో ఆరు నెలల చిన్నారి గాయాలతో బయటపడింది. 
  • కొన్ని నెలలుగా ఆమె తీవ్రమైన నిద్రలేమి సమస్యతో ఒత్తిడికి గురైనట్టు ప్రాథమిక విచారణలో తేలింది. 

హైదరాబాద్‌లో ఘోరమైన ఘటన జరిగింది. ఐటీ రంగంలో స్థిరపడిన ఒక మహిళ తన పసిపాపతో భవనంపై నుంచి దూకేసింది ప్రాణాలు తీసుకుంది. మియాపూర్‌లోని మయూరినగర్‌లో గల లక్ష్మీప్రెస్టీజ్ అపార్ట్‌మెంట్‌ శనివారం ఉదయం ఈదుర్ఘటన జరిగింది. 

క్షేమంగా బయటపడ్డ చిన్నారి

మృతురాలు 37 ఏళ్ల ఇషా సాహుగా గుర్తించారు. ఆమె వృత్తిరీత్యా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పని చేస్తున్నారు. అపార్ట్‌మెంట్‌లోని ఆరో అంతస్తు నుంచి ఇషా తన ఆరు నెలల పసికందును చేతుల్లో పట్టుకొని కిందకు దూకారు. అయితే కిందకపడుతున్న సమయంలో చిన్నారి ఆమె చేతుల్లోంచి జారి పక్కకు పడిపోయింది దీని వల్ల ఆ బిడ్డకు ప్రాణాపాయం తప్పింది. 

ఆసుపత్రిలో కోలుకుంటున్న పసిబిడ్డ

తీవ్ర గాయాలైన ఇషా సాహు స్పాట్‌లోనే చనిపోయింది. చిన్నారి మాత్రం స్వల్ప గాయాలతో క్షేమంగా బయటపడింది. స్థానికులు వెంటనే స్పందించి చిన్నారిని కేబీహెచ్‌బీలోని లోటస్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆ బిడ్డ ప్రాణాపాయం నుంచి బయటపడిందని వైద్యులు తెలిపారు. 

నిద్రలేమి అసలు సమస్యా?

పోలీసులు అందించిన ప్రాథమిక సమాచారం ప్రకారం, ఇషా సాహు గత కొంతకాలంగా తీవ్రమైన ఆరోగ్యం సమస్యలతో బాధపడుతోంది. ముఖ్యంగా నిద్రలేమి సమస్య ఆమెను గత కొన్ని నెలలుగా వేధిస్తున్నట్టు పోలీసు గుర్తించారు. సరైన నిద్ర లేకపోవడంతో ఆమె తీవ్ర మానసిక ఒత్తిడికి లోనై ఉండవచ్చని దర్యాప్తు అధికారులు అనుమానిస్తున్నారు. 

నిద్రలేమి సమస్య మనిషి మెదడుపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. ఇది నిర్ణయాలు తీసుకునే సామర్థ్యాన్ని దెబ్బ తీస్తుందని వైద్యులు చెబుతున్నారు. అయితే ఇషా సాహు ఆత్మహత్యకు గల కచ్చితమైన కారణాలు ఇంకా తెలియాల్సి ఉందని పోలీసులు స్పష్టం చేశారు. 

అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్న అధికారులు

మియాపూర్‌ పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి లోతైన దర్యాప్తు ప్రారంభించారు. ఘటనా  స్థలాన్ని పరిశీలించి, కుటుంబ సభ్యుల నుంచి, పొరుగువారి నుంచి సమాచారాన్ని సేకరిస్తున్నారు. కేసు దర్యాప్తు పూర్తి కాక ముందే సోషల్ మీడియాలో ఎలాంటి పుకార్లు వ్యాప్తి చేయొద్దని అధికారులు విజ్ఞప్తి చేశారు. కుటుంబ కలహాలు ఉన్నాయా లేదా వ్యక్తిగత కారణాలు ఏమైనా ఉన్నాయా అన్న కోణంలో కూడా విచారణ సాగుతోంది. 

నిద్రలేమి నిశ్శబ్ధ శత్రువు

పెరుగుతున్న మానసిక ఆరోగ్య సమస్యలను ఈ ఘటన గుర్తు చేస్తోంది. సాఫ్ట్‌వేర్ రంగంలో ఉండే పని ఒత్తిడి, మారిన జీవనశైలి వల్ల చాలా మంది నిద్రలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. వైద్య నిపుణుల ప్రకారం నిద్రలేమి అనేది కేవలం శారీరక అలసట మాత్రమే కాదు. అది తీవ్రమైన డిప్రెషన్‌కు దారి తీస్తుంది. ఇషా సాహు విషయంలో కూడా ఇదే జరిగి ఉంటుందనే కోణంలో విచారణాధికారులు విశ్లేషిస్తున్నారు.            

Frequently Asked Questions

మియాపూర్‌లో జరిగిన దుర్ఘటన ఏమిటి?

మియాపూర్‌లోని లక్ష్మీ ప్రెస్టీజ్ అపార్టమెంట్‌లో 37 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఇషా సాహు ఆరో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఆమెతో పాటు ఉన్న ఆరు నెలల చిన్నారి క్షేమంగా బయటపడింది.

ఇషా సాహు ఆత్మహత్యకు గల ప్రాథమిక కారణం ఏమిటి?

ప్రాథమిక విచారణలో, ఆమె కొన్ని నెలలుగా తీవ్రమైన నిద్రలేమి సమస్యతో బాధపడుతూ ఒత్తిడికి లోనైనట్లు తేలింది. దీని వల్లే ఆమె ఈ నిర్ణయం తీసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

ఆ ఘటనలో చిన్నారి పరిస్థితి ఏమిటి?

ఆరు నెలల చిన్నారి తల్లి చేతుల్లోంచి జారి, స్వల్ప గాయాలతో క్షేమంగా బయటపడింది. ప్రస్తుతం కేబీహెచ్‌బీలోని లోటస్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కోలుకుంటున్నది.

ఈ ఘటనలో ఆత్మహత్య చేసుకున్న మహిళ ఎవరు?

ఆత్మహత్య చేసుకున్న మహిళ 37 ఏళ్ల ఇషా సాహు. ఆమె వృత్తిరీత్యా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పని చేస్తున్నారు.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Hyderabad Bonalu Traffic Diversions: బోనాల పండుగ సందర్భంగా హైదరాబాద్‌లో 2 రోజులపాటు ట్రాఫిక్‌ మళ్లింపు ఇలా
బోనాల పండుగ సందర్భంగా హైదరాబాద్‌లో 2 రోజులపాటు ట్రాఫిక్‌ మళ్లింపు ఇలా
Aid for Peddi Sudarshan Reddy Family: పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
Breaking News: పోక్సో కేసులో తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శి పృధ్వీశ్వర్ రెడ్డిపై బీఫ్ఐ సస్పెన్షన్!
పోక్సో కేసులో తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శి పృధ్వీశ్వర్ రెడ్డిపై బీఫ్ఐ సస్పెన్షన్!
Medical Student Incident: మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
Advertisement

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Aid for Peddi Sudarshan Reddy Family: పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
Viveka Murder Case: వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
Medical Student Incident: మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
Sai Sudharsan Ruled Out: శ్రీలంక టెస్ట్ సిరీస్ కు ముందు ఇండియాకు బిగ్ షాక్.. గాయంతో స్టార్ బ్యాటర్ అవుట్, పడిక్కల్ కి లక్కీ ఛాన్స్!
శ్రీలంక టెస్ట్ సిరీస్ కు ముందు ఇండియాకు బిగ్ షాక్.. గాయంతో స్టార్ బ్యాటర్ అవుట్, పడిక్కల్ కి లక్కీ ఛాన్స్!
Pruthvishwar Reddy: లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
Gedela Raju OTT : టాప్ ట్రెండింగ్‌లో పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్ - రెండు ఓటీటీల్లో రఘు కుంచె మూవీ సూపర్ రెస్పాన్స్... డోంట్ మిస్
టాప్ ట్రెండింగ్‌లో పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్ - రెండు ఓటీటీల్లో రఘు కుంచె మూవీ సూపర్ రెస్పాన్స్... డోంట్ మిస్
Telangana High Court: హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
యూత్‌కు నచ్చేలా Pulsar N160 S, N160 SS వేరియంట్లు.. ఇంజిన్ నుంచి డిస్‌ప్లే వరకు సరికొత్త మార్పులు
Pulsar N160 కొత్త వేరియంట్లు.. మరింత పవర్‌, మరిన్ని మోడ్స్‌ - రూ.1.34 లక్షలకే!
Embed widget