Hyderabad News: ఫ్యామిలీ ప్లానింగ్ సర్జరీకి వెళ్లిన మహిళ, శవంగా బయటికి!
Telangana News: సిద్దిపేట జిల్లాకు చెందిన మహిళ హైదరాబాద్ జగద్గిరి గుట్టలో నివాసం ఉంటోంది. ఆమె ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేయించుకోవడం కోసం ఓ ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లగా ఈ ఘటన జరిగింది.
Woman Death in Hyderabad: ఫ్యామిలీ ప్లానింగ్ కోసం హాస్పిటల్‌కి వెళ్లిన ఒక మహిళ వైద్యం వికటించి మృతి చెందిన ఘటన జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సిద్దిపేట జిల్లాకు చెందిన మహిళ జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధి అంజయ్య నగర్ ప్రాంతంలో నివాసం ఉంటూ పుష్పలత (29) ఫ్యామిలీ ప్లానింగ్ కొరకు చైతన్య నర్సింగ్ హోమ్ లో ఆపరేషన్ పూర్తి చేసుకున్నారు. అయితే రెండవ తేదీన మహిళ అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో దగ్గరలో ఉన్న పద్మజ హాస్పిటల్ తీసుకువెళ్లగా పరీక్షించిన వైద్యులు అప్పటికి మృతి చెందినట్లు నిర్ధారించారు.
విషయం తెలుసుకున్న బంధువులు చైతన్య నర్సింగ్ హోమ్ మందు ఆందోళన చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని బాధితులకు అండగా నిలిచారు. ఈ విషయంపై ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు.