Hyderabad: సెల్‌ఫోన్ రిపేర్ చేయించుకున్న భర్త, వెంటనే ఎలుకల మందు తిని భార్య సూసైడ్! అసలేం జరిగిందంటే
Wife Suicide: తనకు తెలియకుండా తన భర్త రూ.3 వేలు ఖర్చు పెట్టి సెల్ ఫోన్ రిపేర్ చేయించుకున్నాడని భార్య ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో భార్య ఆత్మహత్య చేసుకుంది.
భార్యాభర్తల మధ్య ఏర్పడే చిన్న చిన్న గొడవలకే కొంత మంది ప్రాణాలు తీసుకుంటున్నారు. తాజాగా హైదరాబాద్‌లో ఇలాంటి ఘటన జరిగింది. భర్త ఫోన్ రిపేర్ చేయించుకున్నాడని, ఆ విషయం తనకు చెప్పలేదనే మనస్తాపంతో భార్య ఆత్మహత్య చేసుకుంది. అయితే, అంతకుముందు చాలా కాలం నుంచే వీరి మధ్య మనస్పర్థలు ఉన్నాయని పోలీసులు చెబుతున్నారు. తాజాగా జరిగిన ఘటనతో వివాదం చెలరేగి ఆమె ఆత్మహత్య చేసుకుందని పోలీసులు చెబుతున్నారు.
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. తనకు తెలియకుండా తన భర్త రూ.3 వేలు ఖర్చు పెట్టి సెల్ ఫోన్ రిపేర్ చేయించుకున్నాడని భార్య ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో భార్య ఆత్మహత్య చేసుకుంది. నార్సింగ్ పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. మధ్యప్రదేశ్‌కు చెందిన రాజు భవన నిర్మాణ కార్మికుడిగా పని చేస్తున్నాడు. నిర్మాణ సమయంలో సెంట్రింగ్ మేస్త్రీ చేసే నిపుణుడిగా పని చేస్తున్నాడు. హైదరాబాద్ లోని నెక్నాంపూర్‌లో ఉంటున్నాడు. ఇతడికి భార్య రాగిణి (30) తో పాటు ఇద్దరు పిల్లలు ఉన్నారు. గత నెల 28న స్వగ్రామానికి వెళ్లిన రాజు ఒక కూతురు, భార్యతో ఇటీవలే తిరిగి ఇంటికి వచ్చాడు.
ఈ నెల 11న ఫోన్ చెడిపోవడంతో దాన్ని రిపేర్ చేయించేందుకు షాపులో ఇచ్చాడు. అందుకు రూ.3 వేలు ఖర్చు అయింది. అయితే, మొబైల్ ఫోన్ రిపేర్ కు రూ.3 వేలు ఎందుకు ఖర్చు చేశావంటూ భార్య తన భర్తతో గొడవ పెట్టుకొని ఇంటి నుంచి వెళ్లిపోయింది. కొద్ది రోజులకు తిరిగి వచ్చి తనకు ఆరోగ్యం బాగోలేదని చెప్పింది. 14న తనకు కడుపు నొప్పిగా ఉందని, కాసేపటి క్రితం ఎలుకల మందు తిన్నానని భర్తకు చెప్పింది.
దీంతో వెంటనే భర్త ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లాడు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె శుక్రవారం సాయంత్రం చనిపోయింది. శనివారం ఫిర్యాదు రావడంతో నార్సింగ్ పోలీసులు కేసు నమోదు చేసివిచారణ చేస్తున్నారు.
భార్యను చంపిన భర్త
హైదరాబాద్‌లో తెల్లవారు జామున మరో కిరాతకమైన ఘటన జరిగింది. భార్యను భర్త అత్యంత దారుణంగా హత్య చేశాడు. నగరంలోని కులుసుం పుర పోలీస్ స్టేషన్ పరిధిలోని సంజయ్ నగర్ జియాగూడలో ఈ దారుణం చోటు చేసుకుంది. చనిపోయిన వివాహితను సరిత యాదవ్ (26) అనే వ్యక్తిగా పోలీసులు గుర్తించారు.
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. స్థానికంగా ఉన్న ఓ టిఫిన్ సెంటర్‌లో ఆమె భర్త సంతోష్ పని చేస్తున్నాడు. కొన్నాళ్లుగా తన భార్యపై సంతోష్ అనుమానాన్ని పెంచుకున్నట్లుగా పోలీసులు తెలిపారు. దీంతో కోపం పట్టలేని అతను తన ఇంట్లో సరితను ప్రైవేట్ పార్ట్‌లో కత్తితో పొడిచి హత్య చేశాడు. ఈ హత్యకు కారణం భార్యపై అనుమానమే అయి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. హత్య చేసే సమయంలో దాన్ని ఆపేందుకు మృతురాలి బంధువు అడ్డు రాగా, ఆ వ్యక్తిపై కూడా కత్తితో దాడి చేశాడు.