By: ABP Desam | Updated at : 24 Sep 2021 12:28 PM (IST)
Edited By: Venkateshk
ప్రతీకాత్మక చిత్రం (Picture Credit: pixabay.com)
హైదరాబాద్ శివారు హయత్ నగర్‌లో దారుణం వెలుగు చూసింది. ఓ మహిళ మృతదేహాన్ని ఇద్దరు తరలిస్తుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. అంతేకాక, చనిపోయిన ఆమె నగ్నంగా దుప్పట్లో చుట్టి ఉండడం మరింత అనుమానాలకు తావిస్తోంది. దుండగులు ఆమె శవాన్ని నగ్నంగా దుప్పట్లో చుట్టి గుట్టుచప్పుడు కాకుండా తరలిస్తున్నారని స్థానికులు తెలిపారు. హయత్ నగర్‌లోని బాతుల చెరువు సమీపంలో ఈ వ్యవహారం వెలుగు చూసింది.
ఇద్దరు యువకులు కలిసి గురువారం రాత్రి బాతుల చెరువు సమీపంలో యువతి మృతదేహాన్ని దప్పట్లో చుట్టి గుట్టుగా తరలిండగా బాతుల చెరువు సమీపంలో వారిని స్థానికులు అడ్డుకున్నారు. అనుమానం వచ్చి ఇద్దరినీ నిలదీశారు. దీంతో వారు పొంతన లేని సమాధానాలు చెప్పారు. అక్కడికక్కడే దేహశుద్ధి చేశారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు అక్కడికి చేరుకుని, ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరు దుండగులను స్టేషన్‌కు తరలించి విచారణ జరిపారు.
Also Read: Mushroom Veg or Non veg: పుట్టగొడుగులు శాకాహారమా? మాంసాహారమా? శాస్త్రవేత్తలు ఏం చెబుతున్నారు?
పోలీసులు వారిని ప్రశ్నించడంతో ఆ యువతి తన భార్య అని, తమది ప్రేమ వివాహమని ఇద్దరు దుండగుల్లో ఒకడైన వినోద్ అనే వ్యక్తి చెప్పుకొచ్చాడు. గత కొన్ని రోజుల నుంచి ఆమెకు అనారోగ్యంగా ఉందని, రాత్రి చనిపోయిందని చెప్పుకొచ్చాడు. అంత్యక్రియలు చేసేందుకు తన వద్ద డబ్బులు లేకపోవడంతో బయటికి తీసుకెళ్లి ఖననం చేయాలని ఇలా తీసుకెళ్తున్నట్లుగా విచారణలో చెప్పాడు. అయితే, మహిళను నగ్నంగా తరలించడంపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీంతో వారిని మరింతగా విచారణ చేస్తున్నారు. నగ్నంగా దుప్పట్లో చుట్టి మహిళను తరలించడం చూస్తే వారిద్దరు కలిసి ఆమెను హత్య చేసినట్లుగా ఉందని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
పోలీసుల కథనం మేరకు హయత్ నగర్ పాత రోడ్డుకు సమీపానే ఉన్న హనుమాన్ మందిరం పక్కనే ఉన్న గల్లీలో డేగ శ్రీను, భార్య లక్ష్మీ(30), కుమార్తె, కుమారుడితో కలిసి అద్దె ఇంట్లో నివాసముంటున్నాడు. గురువారం రాత్రి సుమారు 10.45 గంటలకు శ్రీను అతని స్నేహితుడు కోడూరి వినోద్ అనే వ్యక్తితో కలిసి లక్ష్మీ మృత దేహాన్ని దుప్పట్లో చుట్టి బాతుల చెరువు అలుగువద్ద పడేస్తుండగా స్థానికులు గమనించారు. అయితే, ఈమె అనారోగ్యంతో చనిపోయిందా లేక మరేదైనా కారణమా అన్న కోణంలో విచారణ జరుపుతున్నట్లుగా పోలీసులు తెలిపారు.
Watch: Watch: అసలు పిడుగులు ఎందుకు పడతాయి.? పిడుగుపాటుకు కారణమయ్యే సైన్స్ ఏంటి?
Also Read: RGV : కొండా మురళి, సురేఖల బయోపిక్‌పై ఆర్జీవీ గురి ! మళ్లీ వివాదం తప్పదా ?
Asaram Bapu: అత్యాచార కేసులో ఆశారాం బాపూనకు జీవిత ఖైదు విధించిన గుజరాత్ కోర్ట్
Warangal: చైన్ స్నాచింగ్ కేసులో ముగ్గురు నిందితుల అరెస్టు - బైక్, క్యాష్, బంగారం స్వాధీనం
Amar Raja Fire Accident: చిత్తూరులోని అమర్ రాజా ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం, ఎగసిపడుతున్న మంటలు
Gujarat: ఆశారాం బాపూకి షాక్ ఇచ్చిన గుజరాత్ కోర్టు, అత్యాచార కేసులో దోషిగా తేల్చిన న్యాయస్థానం
Kothhagudem Crime News: వ్యభిచార గృహాలపై పోలీసుల దాడి - 15 మంది బాలికలకు విముక్తి!
పెళ్లి కాకపోయినా పర్వాలేదు, పిల్లలను కనండి - పాలకులు షాకింగ్ నిర్ణయం, ఎక్కడో తెలుసా?
Nellore Anam : నెల్లూరు వైఎస్ఆర్సీపీలో మరోసారి ఆనం బాంబ్ - ఫోన్లు ట్యాప్ చేస్తున్నారు - ప్రాణ హానీ ఉందని ఆందోళన !
Agent Release Date : 'ఏజెంట్' రిలీజ్ డేట్ ఫిక్స్ - థియేటర్లలో అఖిల్ వైల్డ్ యాక్షన్ రైడ్ ఆ రోజు నుంచి షురూ!
Stock Market News: బడ్జెట్ ముందు పాజిటివ్‌గా స్టాక్ మార్కెట్ల ముగింపు - రేపు డబ్బుల వర్షమేనా!!