Mushroom Veg or Non veg: పుట్టగొడుగులు శాకాహారమా? మాంసాహారమా? శాస్త్రవేత్తలు ఏం చెబుతున్నారు?
పుట్టగొడుగుల విషయంలో అందరినీ వేధిస్తున్న ప్రశ్న ఒక్కటే... అవి శాకాహారమా లేక మాంసాహారమా?
పుట్టగొడుగులు చాల ఏళ్లుగా మన ఆహారంలో భాగమై ఉన్నాయి. వాటితో వండే అనేక రకాల వంటకాలకు అభిమానులున్నారు. కానీ చాలా మంది శాఖాహరుల్లో పుట్టగొడుగులు అనేవి మాంసాహారానికి చెందినవనే అభిప్రాయం ఉంది. కొంతమంది నాన్ వెజిటేరియన్లు కూడా అది నిజమనే అనుకుంటున్నారు. అసలు నిజం ఏంటి? శాస్త్రవేత్తలు, పరిశోధకులు ఈ విషయంలో ఏం చెబుతున్నారు?
కెనడాకు చెందిన నెబ్రస్కా-లింకన్ యూనివర్సిటీలో న్యూట్రిషన్, ఫుడ్ సేఫ్టీ విభాగంలో ప్రొఫెసర్ ఆలిస్ హెన్నెమాన్ పుట్టగొడుగులపై పరిశోధన చేశారు. ఆ పరిశోధన తాలూకు ఫలితాలను ఆయన పంచుకున్నారు. ఆయన చెప్పిన వివరాల ప్రకారం పుట్టగొడుగులు మొక్కజాతికి చెందినవి కాదు. వాటికి ఆకులు, వేళ్లు, విత్తనాలు లేవు, పెరగడానికి కాంతి కూడా అవసరం లేదు కాబట్టి అది కూరగాయ వర్గానికి రాదు. వీటిని వృక్షశాస్త్రపరంగా (బొటానికల్లీ) శిలీంధ్రాలుగా (ఫంగి) వర్గీకరించారు. అలాగే ఇవి జంతువర్గానికి చెందవు. ఇవి పెరిగేందుకు జంతువులకు చెందినది ఏదీ వీటికి అసవరం లేదు. అందుకే వీగన్లు కూడా వీటిని తినేందుకు ఇష్టపడతారు. వీటిని దాదాపు ప్రపంచంలో చాలా మంది శాకాహారంగానే చూస్తున్నారు.
కూరగాయగానే గుర్తింపు...
అమెరికా వ్యవసాయ శాఖ మాత్రం పుట్టగొడుగులు అందించే పోషకాలను దృష్టిలో ఉంచుకుని వాటిని కూరగాయగానే పరిగణిస్తోంది. యుఎస్ నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ మ్యాగజైన్ లో ప్రచురించిన అధ్యయనం ప్రకారం మాంసం, ధాన్యాలు రెండింటిలో ఉన్న పోషకాలు పుట్టగొడుగుల ద్వారా కూడా లభిస్తాయి. అయితే వీటిలో కొన్ని రకాలు మాత్రమే తినేందుకు వీలైనవి. కొన్ని విషపూరితమైనవి కూడా ఉన్నాయి.
ఎన్నిలాభాలో...
క్యాన్సర్ నివారణలో పుట్టగొడుగులు బాగా పనిచేస్తాయి. ముఖ్యంగా మహిళలు వీటిని తింటే రొమ్ము క్యాన్సర్ బారి నుంచి తప్పించుకోవచ్చు. వీటిల్లో ఉండే లెంటినాన్ అనే మాలిక్యూల్ క్యాన్సర్ పై పోరాడుతుంది. వ్యాధినిరోధక శక్తిని కూడా పెంచుతుంది. ఇందులో ఉండే బీటా గ్లూకాన్ కూడా ఇమ్యూనిటీని పెంచుతుంది. బరువు తగ్గాలనుకునేవారు వీటిని తింటే ఎంతో మేలు. ఇవి చెడు కొలెస్ట్రాల్ తగ్గిస్తాయి. బటన్ పుట్టగొడుగుల్లో విటమిన్ డి లభిస్తుంది. వారంలో ఒకసారైన పుట్టగొడుగులను ఆహారంగా తీసుకోమని అధ్యయనాలు సూచిస్తున్నాయి.
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి.
Also read: గుండె జబ్బుకు గురికాకుండా ఉండాలంటే తినాల్సినవి ఇవే... తేల్చిన హార్వర్డ్ అధ్యయనం
Also read: గుడ్డులోని పచ్చసొన తింటే బరువు పెరుగుతారని తినకుండా పడేస్తున్నారా? ఆరోగ్యనిపుణులు ఏమంటున్నారు?
Also read: Leafy Green Vegetables: ఆకుకూరల గురించి అపోహలు వీడమంటున్న ఆయుర్వేదం