Mujra Party: ముజ్రాపార్టీని భగ్నం చేసిన టాస్క్ ఫోర్స్, హైదరాబాద్ పాతబస్తీలో గలీజు పనులు
Mujra party In Hyderabad | హైదరాబాద్ పాతబస్తీలో ముజ్రా పార్టీని టాస్క్ ఫోర్స్ పోలీసులు భగ్నం చేశారు. నలుగురు ట్రాన్స్ జెండర్లు, ఎనిమిది మంది యువకులను అరెస్ట్ చేశారు.
Hyderabad task force police busted Mujra party | హైదరాబాద్: టాస్క్ ఫోర్స్ పోలీసులు హైదరాబాద్ నగరంలో ముజ్రా పార్టీని భగ్నం చేశారు. మొత్తం 12 మందిని టాస్క్ ఫోర్స్ ఫోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిలో నలుగురు ట్రాన్స్‌జెండర్ యువతులు, 8 మంది యువకులు ఉన్నారని తెలిపారు.
పాతబస్తీ బండ్లగూడలో ముజ్రా పార్టీ జరుగుతుందని సౌత్ జోన్ కమిషనర్ టాస్క్ ఫోర్స్ టీమ్ కు సమాచారం అందింది. బండ్లగూడ గౌస్‌నగర్‌లోని లేక్‌వ్యూ హిల్స్‌లో ఓ ఫ్లాట్ లో గుట్టు చప్పుడు కాకుండా అసాంఘిక కార్యకలాపాలకు ప్లాన్ చేశారు నిర్వాహకులు. ముజ్రా పార్టీ నిర్వహించి, అందులో అశ్లీల నృత్యాలు చేపిస్తున్నారు. సాధారణంగా ఇతర రాష్ట్రాల నుంచి యువతలను రప్పించి ఇలాంటివి చేస్తుంటారు. లేకపోతే డబ్బు కోసం ఆశచూపి స్థానిక యువతులను, జిల్లాల నుంచి సిటీకి వచ్చే యువతులతో ఇలాంటివి చేపిస్తారు. కానీ ఇక్కడ జరిగింది వెరైటీ. ట్రాన్స్ జెండర్లతో అసభ్యకరమైన నృత్యాలు వేపిస్తుండగా, యువకులు వారితో కలిసి చిందులు వేస్తూ ఎంజాయ్ చేయసాగారు.
పెద్దగా సౌండ్ పెట్టుకుని, తమకు ఇష్టంవచ్చినట్లుగా నిర్వాహకులు ముజ్రా పార్టీకి ప్లాన్ చేశారు. సరిగ్గా అదే సమయంలో టాస్క్ ఫోర్స్ అక్కడికి వెళ్లి అసభ్యకరంగా ఉండి, చిందులు వేస్తున్న వారిని అరెస్ట్ చేసి ముజ్రా పార్టీని భగ్నం చేశారు. నలుగురు ట్రాన్స్ జెండర్లు, ఎనిమిది మంది యువకులను అరెస్ట్ చేసి పీఎస్ కు తరలించారు. ఎప్పటినుంచి ఇది జరుగుతోంది, గతంలోనూ నిర్వహించారా అనే వివరాలపై ఆరా తీస్తున్నారు. పార్టీలో డ్రగ్స్, గంజాయి లాంటి మత్తు పదార్థాలు తీసుకున్నారా అనే కోణంలోనూ విచారణ చేపట్టారు.