News
News
X

Nayeem case: నయీమ్ ప్రధాన అనుచరుడు శేషన్న ఇన్నాళ్లూ అక్కడే తలదాచుకున్నాడు

Nayeem case: గ్యాంగ్ స్టర్ నయీమ్ ప్రధాన అనుచరుడు శేషన్నను హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి వద్ద నుంచి 9 ఎంఎం పిస్టల్ స్వాధీనం చేసుకున్నారు. 

FOLLOW US: 

Nayeem case: పోలీసుల ఎన్ కౌంటర్ లో హతం అయిన గ్యాంగ్ స్టర్ నయీమ్ ప్రధాన అనుచరుడు శేషన్నను హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పక్కా సమాచారంతో అరెస్ట్ చేసి.. అతడి వద్ద నుంచి 9 ఎంఎం పిస్టల్ స్వాధీనం చేసుకున్నారు. నయీమ్ మృతి తర్వాత శేషన్న ల్యాండ్ సెటిల్మెంట్లు, దందాలు చేస్తున్నాడు. అయితే ఈ విషయం తెలుసుకున్న పోలీసులు కొంత కాలంగా అతని కోసం గాలిస్తున్నారు. ఈ క్రమంలోనే కొత్తపేట్ లోని ఓ హోటల్ లో ల్యాండ్ సెటిల్మెంట్ చేస్తున్నారన్న విషయం తెలుసుకున్న పోలీసులు.. అక్కడకు చేరుకొని అతడిని అరెస్ట్ చేశారు. అన్ని కోణాల్లో విచారిస్తున్నట్లు వివరించారు. అయితే శేషన్నను నాంపల్లి కోర్టులో హాజరు పరిచి రిమాండ్ కు తరలిస్తామని పోలీసులు వివరించారు. 

నయీమ్ ఎన్ కౌంటర్ తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లిన శేషన్న..

గ్యాంగ్ స్టర్ నయీమ్ ఎన్ కౌంటర్ తర్వాత.. అతని ప్రధాన అనుచరుడు శేషన్న అజ్ఞాతంలోకి వెళ్లాడు. అప్పటి నుంచి పోలీసుల కళ్లుకప్పి తిరుగుతున్నాడు. అతని దగ్గర నుంచి 9 ఎంఎం పిస్టల్ దొరకడం పలు అనుమానాలకు తావిస్తోంది. పోలీసుల దగ్గర ఉండే హిస్టల్ ఆయన దగ్గరకు ఎలా వెళ్లింది, ఇప్పటి వరకు ఆయన నిర్వహించిన సెటిల్మెంట్ లు, ఆయనకు ఆశ్రయం కల్పించింది ఎవరనే కోణంలో పోలీసులు విచారిస్తున్నాడు. ఇంకా నయీమ్ ఆస్తులు, డంప్ లకు సంబంధించి కూడా శేషన్నకు పూర్తిగా తెలుసని పోలీసులు అనుమానిస్తున్నారు. ఎన్ కౌంటర్ సమయంలో నయీం దగ్గర దొరికిన ఏకే-47తో పాటు అతడి డెన్ల నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్న ఆయుధాలు, పేలుడు పదార్థాలకు సంబంధించి కూడా శేషన్న నుంచి పలు వివరాలు సేకరించనున్నారు. 

ఇన్నాళ్లూ శేషన్న అక్కడే తలదాచుకున్నాడు..

News Reels

నయీం ఎన్‌కౌంటర్‌ తర్వాత శేషన్న అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడరు. 2018లో శేషన్నను పట్టుకుని తీరుతామని డీజీపీ మహేందర్‌ రెడ్డి ప్రకటించినా... పోలీస్‌ నిఘాకు చిక్కకుండా శేషన్న తప్పించుకు తిరుగుతున్నాడు. నయీమ్ ఎన్‌కౌంటర్‌ తర్వాత ప్రధాన అనుచరులైన శేషన్న, రామయ్య, జహంగీర్‌ మాయమయ్యారు. మహబూబ్‌నగర్‌ జిల్లాకు చెందిన శేషన్న మావోయిస్టు పార్టీలో చేరిన సమయంలోనే నయీంతో పరిచయం ఏర్పడింది. పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇద్దరు కలిసి సొంతంగా గ్యాంగ్‌ ఏర్పాటు చేసుకున్నారు. ఉమ్మడి నల్లగొండ కేంద్రంగా ప్రారంభమైన నయీం గ్యాంగ్‌ అరాచకాలు శేషన్నకు పట్టుఉన్న మహబూబ్‌నగర్‌ జిల్లాలో ఎక్కువగా చోటు చేసుకున్నాయి. బెదిరింపులు, కిడ్నాప్‌లు, వసూళ్లు, మాట వివని వారిని మట్టుబెట్టేవారు. నయీం టార్గెట్‌ ఫిక్స్‌ చేస్తే శేషన్న పక్కాగా ప్లాన్‌ వేసి అమలు చేసేవాడు. నయీం నేర సామ్రాజ్యానికి శేషన్న సైన్యాధికారిగా వ్యవహరించేవాడు. నయీం చేసే ప్రతి పనిలోనూ శేషన్న ప్రమేయం ఉండేది. దీంతో నయీం ఎన్‌కౌంటర్‌ తర్వాత పరారీలో ఉన్న శేషన్నకోసం పోలీస్‌లు తీవ్రంగా ప్రయత్నించడంతో కర్నూలు జిల్లాలోని మాజీ మావోయిస్టు వెంకట్‌ రెడ్డి ఆశ్రయం కల్పించినట్లు ఇటీవలే గుర్తించారు. పోలీస్‌లకు తన జాడ తెలిసిందనే విషయం పసిగట్టిన శేషన్న, అతనికి ఆశ్రయం కల్పించిన వెంకట్‌ రెడ్డి పరారయ్యారు.

ఇప్పటికీ కొనసాగుతున్న కేసు..

నయీమ్ కేసుల దర్యాప్తులో ఇప్పటి వరకు అతని కుటుంబ సభ్యులు, గ్యాంగు సభ్యుల్ని అరెస్ట్ చేసినప్పటికీ ప్రధాన అనుచరుడు, నయీం అరాచకల్లో అత్యంత కీలకంగా వ్యవహరించిన శేషన్నకు సంబంధించి పోలీస్ దర్యాప్తు ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో శేషన్నను త్వరలో పట్టుకుంటామని డీజీపీ అప్పట్లో తెలిపారు. ఇక నయీమ్ కేసులో కేవలం ఆరోపణలు, విచారణ సమయంలో ఎలాంటి ఆధారాలు లేకుండా ప్రముఖుల పేర్లు కొందరు వెల్లడించిన ప్రకారం ముందుకు వెళ్లడం కుదరదన్నారు. కేసు దర్యాప్తు కొనసాగుతోందని, ఆధారాల మేరకు నయీమ్ తో  అంటకాగిన ప్రతి ఒక్కరిపై చర్యలు తప్పవని డీజీపీ మహేందర్ రెడ్డి హెచ్చరించారు. నయీం బాధితులకు చట్ట ప్రకారం న్యాయం జరుగుతుందని, వాస్తవానికి నయీం పోలీస్ కాల్పుల్లో మృతి చెందడంతోనే బాధితులకు న్యాయం జరిగిందని డీజీపీ అప్పట్లో  వ్యాఖ్యానించారు. కాగా గ్యంగా స్టర్ సయీం కేసుల్లో ప్రత్యేక దర్యాప్తు సంస్థ(సిట్) రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు మొత్తం 197 కేసులు నమోదు చేసింది. నయీమ్ ఎన్ కౌంటర్ తర్వాత ఎక్కడికక్కడ అతని అనుచరుల్ని అరెస్ట్ చేశారు. 

హైదరాబాద్, సైబరాబాద్, నల్లగొండ, రంగారెడ్డి, మహబూబ్ నగర్, కరీంనగర్ తోపాటు ఇతర ప్రాంతాల్లో నమోదైన 197 కేసుల్లో 125 మంది నయీం అనుచరుల్ని అరెస్ట్ చేశారు. ఆయా కేసులకు సంబంధించి అప్పటికే న్యాయస్థానాల్లో 18 చార్జిషీట్లు దాఖలు చేశారు. మరికొన్ని కేసుల్లో చార్జిషీట్లు దాఖలు చేసేందుకు అధికారులు రంగం సిద్ధం చేశారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదులు, నయీంతో సంబంధాలు కలిగి ఉన్నారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ రాజకీయ నాయకులు, ప్రస్తుత, మాజీ పోలీస్ అధికారులు సిబ్బందితోపాటు మొత్తంగా 878 మంది నుంచి సిట్ వాంగ్మూలాలు సేకరించింది. 107 మంది నిందితుల్ని కస్టడీకి తీసుకుని విచారించిన సిట్ వారి నుంచి నయీం గ్యాంగ్ కార్యకలా పాలకు సంబంధించిన సమాచారాన్ని రాబట్టింది. గ్యాంగ్ స్టర్ నయీం కేసుల్లో పలువురు నిందితులపై పీడీ యాక్ట్ ప్రకారం కేసులు నమోదు చేశారు.

Published at : 27 Sep 2022 02:22 PM (IST) Tags: Hyderabad News Nayeem case Nayeem Follower Arresr Sheshanna Arrest

సంబంధిత కథనాలు

Chandrapur Bridge Collapse:  మహారాష్ట్రలో ఘోర ప్రమాదం, కూలిన రైల్వే ఫుట్ ఓవర్ బ్రిడ్జి, 13 మందికి గాయాలు

Chandrapur Bridge Collapse: మహారాష్ట్రలో ఘోర ప్రమాదం, కూలిన రైల్వే ఫుట్ ఓవర్ బ్రిడ్జి, 13 మందికి గాయాలు

Anakapalle Road Accident: అనకాపల్లి జిల్లాలో విషాదం, కారు ఢీకొని అన్నాచెల్లెలు సహా ముగ్గురు దుర్మరణం

Anakapalle Road Accident: అనకాపల్లి జిల్లాలో విషాదం, కారు ఢీకొని అన్నాచెల్లెలు సహా ముగ్గురు దుర్మరణం

Anasuya Bharadwaj: అనసూయకు వేధింపులు - కటకటాల్లోకి నిందితుడు, రష్మి, విష్ణు ప్రియను కూడా టార్గెట్ చేశాడా?

Anasuya Bharadwaj: అనసూయకు వేధింపులు - కటకటాల్లోకి నిందితుడు, రష్మి, విష్ణు ప్రియను కూడా టార్గెట్ చేశాడా?

TSRTC MD Sajjanar: డ్రైవర్‌ రాజయ్య ఆత్మహత్యపై టీఎస్‌ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ క్లారిటీ, అదంతా దుష్ప్రచారమేనని ప్రకటన

TSRTC MD Sajjanar: డ్రైవర్‌ రాజయ్య ఆత్మహత్యపై టీఎస్‌ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ క్లారిటీ, అదంతా దుష్ప్రచారమేనని ప్రకటన

Adilabad: ఐటీ, జీఎస్టీ అధికారినంటూ వ్యాపారికి ఫోన్ చేసిన వ్యక్తి - తర్వాత ఏమైందంటే!

Adilabad: ఐటీ, జీఎస్టీ అధికారినంటూ వ్యాపారికి ఫోన్ చేసిన వ్యక్తి - తర్వాత ఏమైందంటే!

టాప్ స్టోరీస్

Minister Botsa : కాళ్లు పట్టుకునైనా సమస్యలు పరిష్కరించుకునే నేర్పు ఉండాలి - మంత్రి బొత్స

Minister Botsa : కాళ్లు పట్టుకునైనా సమస్యలు పరిష్కరించుకునే నేర్పు ఉండాలి - మంత్రి బొత్స

KCR Review Meeting: రొటీన్‌గా కాదు, గొప్పగా పనిచేయండి - విప్లవాత్మక మార్పులు తీసుకొద్దాం: సీఎం కేసీఆర్

KCR Review Meeting: రొటీన్‌గా కాదు, గొప్పగా పనిచేయండి - విప్లవాత్మక మార్పులు తీసుకొద్దాం:  సీఎం కేసీఆర్

Bandi Sanjay : పాలన చేతగాక పోతే ఇంట్లో కూర్చోండి, భైంసా ఏమైనా నిషేధిత ప్రాంతమా? - బండి సంజయ్

Bandi Sanjay :  పాలన చేతగాక పోతే ఇంట్లో కూర్చోండి, భైంసా ఏమైనా నిషేధిత ప్రాంతమా? - బండి సంజయ్

Mla Prakash Reddy : నా తమ్ముడు మాట్లాడిన భాష తప్పు, భావం కరెక్టే - ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి

Mla Prakash Reddy : నా తమ్ముడు మాట్లాడిన భాష తప్పు, భావం కరెక్టే - ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి