అన్వేషించండి

IPL Betting: హైదరాబాద్‌లో భారీగా ఐపీఎల్ బెట్టింగ్, ముఠా అరెస్టు - లక్షల సొమ్ము సీజ్!

Hyderabad News: హైదరాబాద్‌లో ఐపీఎల్ బెట్టింగ్ ముఠా పోలీసులకు దొరికిపోయింది. క్రికెట్ బెట్టింగ్ నడుపుతున్న ఇద్దరు సూత్రధారులను పోలీసులు అరెస్టు చేశారు.

Hyderabad IPL Betting: హైదరాబాద్ లో ఆన్ లైన్ ద్వారా క్రికెట్ బెట్టింగ్ చేసే ముఠాను పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి రూ.36,14,918 లను స్వాధీనం చేసుకున్నట్లుగా సైబరాబాద్ SOT రాజేంద్రనగర్ టీమ్ పోలీసులు వెల్లడించారు. ఆన్ లైన్ క్రికెట్ బెట్టింగ్ నడుపుతున్నారు అనే సమాచారంపై రామచంద్రాపురం ప్రాంతంలో  రామకృష్ణా గౌడ్, ఉపేందర్ గౌడ్ అనే ఇద్దరు యువకులను పోలీసులు పట్టుకున్నారు. వారిని విచారణ చేయగా.. వారు NICE7777 అనే APP ద్వారా తెలిసిన పంటర్స్ ద్వారా ఆన్ లైన్ క్రికెట్ బెట్టింగ్ నడుపుతున్నట్లు నిర్ధారణ అయింది.

వారి మొబైల్ ఫోన్ లోని యాప్ పరిశీలించగా మొత్తం 42 పంటర్స్ వివరాలను పోలీసులు గుర్తించారు. ఆన్ లైన్ బెట్టింగ్ కు కనెక్ట్ అయిన 5 బ్యాంక్ అకౌంట్స్ లలో ఉన్న మరో రూ.18,40,997 సొమ్మును పోలీసులు ఫ్రీజ్ చేశారు.

బుకీ ల వివరాలు
1. మొగిలిగిడ రామక్రిష్ణ గౌడ్, S/o చెన్నయ్య, వయసు 30, బీరంగూడ (బుకీ)
2. మొగిలిగిడ ఉపేందర్ గౌడ్, S/o చెన్నయ్య, వయసు 40, బీరంగూడ (బుకీ) 
3. సోను (మెయిన్ బుకీ - పరారీ)
4. తలారీ శ్రీనివాస్, S/o హన్మంతు, వయసు 38, గాజుల రామారం (పంటర్)
5. బండి వినయ్ కుమార్, గాజుల రామారం (పంటర్)

ఏటీఎం కార్డు దొంగిలించి డబ్బులు విత్ డ్రా
మరో ఘటనలో ATM కార్డు మోసం వెలుగు చూసింది. కార్డు నుంచి డబ్బులు విత్‌ డ్రా చేయమని సాయం కోరితే ఏకంగా కార్డు మార్చి రూ.1.73 లక్షలు కాజేశాడో కేటుగాడు. ఈ ఘటన మేడ్చల్ పీఎస్ పరిధిలో జరిగింది. మండల పరిధిలోని పూడూరు గ్రామానికి చెందిన వర్గంటీ పుణ్యవతి జనవరి 27వ తేదీన మేడ్చల్ పట్టణంలోని యాక్సిస్ బ్యాంక్ ఏటీఎంకి వెళ్ళి అక్కడే ఉన్న ఓ యువకుడికి తన పిన్ నెంబర్ చెప్పి డబ్బులు తీసి ఇవ్వాలని కోరగా అతడు రూ.4 వేలు డ్రా చేసి ఆమె ఏటీఎంకు బదులుగా తన వద్ద ఉన్న మరో ఎస్బీఐ బ్యాంకుకు చెందిన ఏటీఎం ఇచ్చాడు. 

దీంతో తస్కరించిన ఏటీఎం కార్డుతో విడతల వారీగా పుణ్యవతి ఖాతాలో ఉన్న రూ.1.73 లక్షలను కాజేశాడు. కాగా గత నాలుగు రోజుల క్రితం డబ్బులు అవసరమై బ్యాంకుకు వెళ్లి డబ్బులు విత్ డ్రా కోసం ప్రయత్నించగా.. ఖాతాలో డబ్బులు లేకపోవడంతో షాక్ గురైన పుణ్యవతి నేడు మేడ్చల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని పట్టుకున్న సెబ్ పోలీసులు
కడప జిల్లాకు తరలిస్తున్న భారీ అక్రమ మద్యాన్ని కర్నూలు ఎస్ఈబీ పోలీసులు సీజ్ చేశారు. కర్నూలు శివారులోని పంచలింగాల చెక్ పోస్ట్ వద్ద తనిఖీలో వాహనంలో అక్రమంగా తరలిస్తున్న 240 బాక్సుల 11,520 బాటిళ్ల మద్యాన్ని సీజ్ చేశామని ఎస్ఈబీ సూపరింటెండెంట్ రవికుమార్ తెలిపారు. సీజ్ చేసిన మద్యం విలువ 14 లక్షల 51 వేలు అని, సీజ్ చేసిన వాహనం ధర 4 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు. ఈ మద్యాన్ని కడప జిల్లాకు చెందిన రింగుల భాష అనే వ్యక్తి కీలక సూత్రధారని తెలిపారు. ఇతనిపై ఇప్పటికే వందకు పైగా అక్రమ మద్యం, ఎర్రచందనం తరలింపు కేసులు ఉన్నాయని తెలిపారు.

టాప్ హెడ్ లైన్స్

Pruthvishwar Reddy: లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
Tirumala Road Accident: తిరుమల ఘాట్ రోడ్డులో లోయలో రోడ్డు ప్రమాదం.. కర్ణాటకకు చెందిన భక్తుడి మృతి
Tirumala Road Accident: తిరుమల ఘాట్ రోడ్డులో లోయలో రోడ్డు ప్రమాదం.. కర్ణాటకకు చెందిన భక్తుడి మృతి
నా భర్తను చంపు.. లేకపోతే నేను చచ్చిపోతా.. లవర్‌తో భార్య చాటింగ్ చూసి భర్త షాక్
నా భర్తను చంపు.. లేకపోతే నేను చచ్చిపోతా.. లవర్‌తో భార్య చాటింగ్ చూసి భర్త షాక్
Hyderabad Crime News: వినాయకుడి ప్రసాదమే పెట్టుబడిగా వ్యాపారం చేసిన గణేష్‌! 51 లక్షలకు లడ్డూ కొని 3.45కోట్లతో పరార్‌!
వినాయకుడి ప్రసాదమే పెట్టుబడిగా వ్యాపారం చేసిన గణేష్‌! 51 లక్షలకు లడ్డూ కొని 3.45కోట్లతో పరార్‌!

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Aid for Peddi Sudarshan Reddy Family: పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
Viveka Murder Case: వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
Medical Student Incident: మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
Sai Sudharsan Ruled Out: శ్రీలంక టెస్ట్ సిరీస్ కు ముందు ఇండియాకు బిగ్ షాక్.. గాయంతో స్టార్ బ్యాటర్ అవుట్, పడిక్కల్ కి లక్కీ ఛాన్స్!
శ్రీలంక టెస్ట్ సిరీస్ కు ముందు ఇండియాకు బిగ్ షాక్.. గాయంతో స్టార్ బ్యాటర్ అవుట్, పడిక్కల్ కి లక్కీ ఛాన్స్!
Pruthvishwar Reddy: లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
Gedela Raju OTT : టాప్ ట్రెండింగ్‌లో పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్ - రెండు ఓటీటీల్లో రఘు కుంచె మూవీ సూపర్ రెస్పాన్స్... డోంట్ మిస్
టాప్ ట్రెండింగ్‌లో పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్ - రెండు ఓటీటీల్లో రఘు కుంచె మూవీ సూపర్ రెస్పాన్స్... డోంట్ మిస్
Telangana High Court: హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
యూత్‌కు నచ్చేలా Pulsar N160 S, N160 SS వేరియంట్లు.. ఇంజిన్ నుంచి డిస్‌ప్లే వరకు సరికొత్త మార్పులు
Pulsar N160 కొత్త వేరియంట్లు.. మరింత పవర్‌, మరిన్ని మోడ్స్‌ - రూ.1.34 లక్షలకే!
Embed widget