Hyderabad Crime: గంజాయి మత్తులో ఓ కిరాతకుడు దారుణం... భార్య గొంతుకోసి హత్య... తల తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో లొంగుబాటు
హైదరాబాద్ నగరంలో దారుణం జరిగింది. భార్యపై అనుమానంతో ఓ కిరాతకుడు ఆమెను గొంతుకోసి హత్య చేశాడు. ఆపై భార్య తల తీసుకుని పోలీస్ స్టేషన్ కు వెళ్లి లొంగిపోయాడు.
హైదరాబాద్ లో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. గంజాయి మత్తులో ఓ కిరాతకుడు నిద్రపోతున్న భార్యను గొంతు కోసి హత్య చేశారు. ఆ తరువాత భార్య తల తీసుకుని పోలీస్ స్టేషన్ కు వెళ్లి లొంగిపోయాడు. ఈ దారుణ ఘటన హైదరాబాద్ నగరంలోని రాజేంద్రనగర్ పరిధిలో జరిగింది. ఇమాద్‌నగర్‌లో నివాసం ఉంటున్న ఫర్వేజ్ తో సమ్రీన్ బేగంకు 14 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. భర్త ఫర్వేజ్ వేధింపులు తట్టుకోలేక సమ్రీన్ గతంలో విడాకులు తీసుకున్నారు. ఆ తరువాత తాను మారిపోయానని నమ్మించి సమ్రీన్‌ను గతేడాది మళ్లీ పెళ్లి చేసుకున్నాడు. అయితే భార్యపై అనుమానంతో ఫర్వేజ్ ఆమెను దారుణంగా హత్యచేశాడు. గంజాయి మత్తులో ఈ హత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.
Also Read: పరువు కోసం బావ హత్య.. కాబోయే బామ్మర్దులు కత్తులతో ఘాతుకం
విడాకులు.. మళ్లీ పెళ్లి
హైదరాబాద్ నగరంలో ఓ భర్త తన భార్యను అత్యంత దారుణంగా హత్య చేశాడు. పక్కనే నిద్రిస్తున్న భార్యపై అమానుషంగా దాడి చేసి హత్య చేశాడు. గాఢ నిద్రలో ఉన్న ఆమె తలనరికి.. తలను నేరుగా పోలీసు స్టేషన్ కు తీసుకెళ్లి లొంగిపోయాడు. రాజేంద్రనగర్‌లోని ఇమాద్‌నగర్‌లో ఫర్వేజ్-సమ్రిన్ నివాసం ఉంటున్నారు. వీరికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. ఫర్వేజ్ వేధింపులు తాళలేక సమ్రిన్ విడాకులు తీసుకుంది. తరువాత ఆమెకు నచ్చజెప్పి రెండో సారి పెళ్లి కున్నాడు ఫర్వేజ్. అయితే అతని బుద్ధి ఏ మాత్రం మారలేదు. రెండో సారి పెళ్లి చేసుకున్న తర్వాత ఆమెను మరింత వేధింపులకు గురిచేసేవాడు. దీంతో ఇద్దరూ తరచూ గొడవలు పడేవారు. ఆమెను ఎలాగైన కడతేర్చాలని మనసులో పెట్టుకుని సమయం కోసం కాచుకుని హత్య చేశాడు.
Also Read: తాడేపల్లిలో చెడ్డీ గ్యాంగ్ కలకలం..! ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే ఇంట్లో చోరీ ?
గంజాయి మత్తులో
శుక్రవారం తెల్లవారుజామున 4 గంటలకు ఫర్వేజ్ ఇంటికి వచ్చాడు. అప్పటికే గంజాయి మత్తులో ఫర్వేజ్ భార్య నిద్రపోతున్న గదిలోకి వెళ్లాడు. నిద్రపోతున్న సమ్రీన్‌పై ఒక్కసారిగా కత్తితో దాడి చేశాడు. అతి దారుణంగా ఆమె తలపై నరికాడు. ఆమె తలను వేరు చేసి.. తలను తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లి లొంగిపోయాడు. నిందితున్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. అతడు గంజాయి మత్తులో ఉన్నట్టు తెలిపారు. సంఘటన స్థలంలో పోలీసులు విచారణ చేపట్టారు. భార్యపై అనుమానంతోనే ఫర్వేజ్ ఈ దారుణానికి పాల్పడినట్టు స్థానికులు తెలిపారు.
Also Read: మూడో భార్యతో ఉంటూ.. రెండో భార్యను చంపాలని భర్త క్షుద్రపూజలు.. చేతబడికి పాస్ పోర్ట్ సైజ్ ఫొటో