అన్వేషించండి

Hawala Money Seized: హైదరాబాద్‌లో భారీగా హవాలా నగదు పట్టివేత, ఈసారి 2 కోట్లు స్వాధీనం!

Munugode ByPolls: హైదరాబాద్ లో పది రోజుల వ్యవధిలోనే 10 కోట్ల హవాలా డబ్బును పట్టుకున్నారు. ఈసారి బంజారా హిల్స్ లో రెండు కోట్ల రూపాయలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 

Hawala Money Seized: మునుగోడు ఉప ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది మొదలు తెలంగాణలో భారీగా నగదు స్వాధీనం చేసుకుంటున్నారు పోలీసులు. తాజాగా హైదరాబాద్ లో మరోసారి భారీగా హవాల డబ్బు పట్టబడింది. గత పది రోజుల వ్యవధిలోనే పది కోట్ల రూపాలయను హైదరాబాద్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తాజాగా బంజారాహిల్స్ పోలీసులు రోడ్ నెంబర్ - 12లో వాహన తనిఖీలు చేస్తుండగా.. రెండు కోట్ల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. డబ్బును తరలిస్తున్న సదరు వ్యక్తులు డబ్బుకు సంబంధించి సరైన సమాధానం, పూర్తి వివరాలు చెప్పకపోవడంతో పోలీసులు డబ్బును స్వాధీనం చేసుకున్నారు. అలాగే నిందితులను కూడా అదుపులోకి తీసుకున్నారు. 

మంగళ వారం రోజు 3.5 కోట్లు..

గాంధీనగర్ పీఎస్ పరిధిలో అక్రమంగా తరలిస్తున్న డబ్బును ట్యాంక్ బండ్ హోటల్ మారియట్ వద్ద నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు గుర్తించారు. పక్కా సమాచారంతో తనిఖీలు నిర్వహించినట్లు పోలీసులు తెలిపారు. గండి సాయికుమార్ రెడ్డికి వెంక‌టేశ్వ‌ర్ అనే వ్య‌క్తి రూ. 3.5 కోట్ల న‌గదు ఇచ్చాడు. ఆ న‌గ‌దును సైదాబాద్‌లో ఉండే బాలు, మ‌హేంద‌ర్‌కు ఇవ్వాల‌ని సూచించాడు. ఇదే స‌మ‌యంలో పోలీసులు అక్క‌డికి చేరుకుని త‌నిఖీలు నిర్వ‌హించారు. 3.5 కోట్ల రూపాయల న‌గ‌దుతో పాటు 7 సెల్‌ఫోన్లు, రెండు కార్ల‌ను స్వాధీనం చేసుకున్నారు. అలాగే గండి సాయికుమార్ రెడ్డి, గుండే మ‌హేశ్‌, సందీప్ కుమార్, మ‌హేంద‌ర్, అనూష్ రెడ్డి, భ‌ర‌త్‌ల‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. నగదు ఎక్కడి నుంచి తీసుకువస్తున్నారు, ఎవరు ఇచ్చారు వంటి పూర్తి సమాచారం తెలపకపోవడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. 

సోమవారం రోజు 2.5 కోట్లు..

జూబ్లీహిల్స్, భారతీయ విద్యాభవన్ సమీపంలో ద్విచక్ర వాహనంపై భారీ ట్రావెలర్స్ బ్యాగ్‌తో నగదును ఇద్దరు వ్యక్తులు తరలిస్తున్నారు. అనుమానం వచ్చి వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు తనిఖీ చేయగా ఆ బ్యాగులో రూ. 2,49,79,000 (2 కోట్ల 49 లక్షల 79 వేల రూపాయలు) ఉన్నట్లు సమాచారం. అందుకు సంబంధించిన రిసీప్ట్, పత్రాలు ఉన్నాయా అని ప్రశ్నించగా నిందితులు అవేమీ లేవని సమాధానమిచ్చారు. దీంతో టాస్క్ ఫోర్స్ ఆ ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుంది. వారి వద్ద నుంచి నగదును స్వాధీనం చేసుకున్నారు.

ఆదివారం రోజు 79.26 లక్షల పట్టివేత..

హైదరాబాద్ పోలీసులు నిర్వహించిన వాహన తనిఖీల్లో భారీగా హవాలా డబ్బు పట్టుబడింది. చంద్రాయణ గుట్ట ఎక్స్ రోడ్ వద్ద 79 లక్షల 25వేల హవాలా డబ్బును స్వాధీనం చేసుకున్నారు. చంద్రాయణ గుట్ట పోలీసులు వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా.. అనుమానంగా కనిపించిన రెండు కార్లను ఆపి సోదాలు చేశారు. అందులో 79.25 లక్షల డబ్బు కనిపించింది. అయితే డబ్బు తరలిస్తున్న వ్యక్తులు ఆ డబ్బుకు సంబంధించి ఎలాంటి ఆధారాలు చూపకపోవడంతో పోలీసులు వాటిని స్వాధీనం చేసుకున్నారు. అలాగే కారు నడుపుతున్న ఉత్తర ప్రదేశ్ కు చెందిన ఇమ్రాన్ మాలిక్, సల్మాన్ మాలిక్, హైదరాబాద్ కు చెందిన వెంకట్ రెడ్డి, శేఖర్ లను అదుపులోకి తీసుకున్నారు. వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

పది రోజుల క్రితం 1.24 కోట్ల పట్టివేత.. 

భాగన్యనగరంలో అక్రమంగా తరలిస్తున్న హవాలా డబ్బును పోలీసులు పట్టుకున్నారు. మాసబ్ ట్యాంక్ పరిధిలో షోయబ్ అనే వ్యక్తి వద్ద 1.24 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఉత్తర ప్రదేశ్ మీరట్ కు చెందిన షోయబ్ మాలిక్ హైదరాబాద్ వచ్చి పాత సామాను సేకరించే వ్యాపారం చేస్తున్నట్లు గుర్తించారు. బంధువు కామిల్ సూచన మేరకు హవాలా డబ్బు తీసుకున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడి అయింది. గుజరాత్ గల్లీకి చెందిన భరత్ వద్ద తీసుకున్న ఈ డబ్బును షోయబ్ తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. పక్కా సమాచారంతో షోయబ్ నివాసంలో తనిఖీ చేసిన పోలీసులు.. డబ్బును స్వాధీనం చేసుకున్నారు. నగదుకు సంబంధించిన లెక్క చెప్పకపోవడంతో పోలీసులు లోతుగా ఆరా తీస్తున్నారు.

నగరంలో 10 రోజుల వ్యవధిలో రూ.10కోట్లు హవాలా సొమ్మును హైదరాబాద్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం పట్టుబడుతున్న హవాలా సొమ్ము మునుగోడు ఉపఎన్నిక కోసమే చేతులు మారుతున్నాయనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ క్రమంలో పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Maruti Swift: మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహంచిత్తూరు జిల్లాలో ఒంటరి ఏనుగు బీభత్సంఏసీబీ కేసు కొట్టేయాలని కోరుతూ హైకోర్టులో కేటీఆర్ పిటిషన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Maruti Swift: మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
Viduthalai 2 Review: విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
Tamil Nadu: విడాకుల పేరుతో మనోవర్తి కోసం వేధింపులు -  భార్యకు ఈ భర్త ఇచ్చిన షాక్ మాములుగా లేదు !
విడాకుల పేరుతో మనోవర్తి కోసం వేధింపులు - భార్యకు ఈ భర్త ఇచ్చిన షాక్ మాములుగా లేదు !
మళ్లీ మేమే వస్తామనుకున్నాం.. మస్క్‌నీ పట్టుకురావాలని ప్లాన్ చేశాం
మళ్లీ మేమే వస్తామనుకున్నాం.. మస్క్‌నీ పట్టుకురావాలని ప్లాన్ చేశాం
Embed widget