Hyderabad: మీకు పని మనిషి ఉన్నారా? తస్మాత్ జాగ్రత్త! మీకూ ఇలా జరగొచ్చు.. ఇదో కొత్త రకం మోసం

హైదరాబాద్‌‌తో పాటు దేశంలోని మెట్రో నగరాల్లోని ఖరీదుగా కనిపించే ఇళ్లను ఎంపిక చేసుకుని ఈ కైలాలీ ముఠా సభ్యులు ఇంటి పనికి చేరతారు.

FOLLOW US: 

ఇంట్లో పని మనుషులను పెట్టుకోవాలని చూస్తున్నారా? లేదా ఇప్పటికే మీ ఇంటికి పని మనుషులు వచ్చి అన్ని పనులూ చేసి వెళ్తుంటారా? అయితే, కాస్త అప్రమత్తంగా ఉండాల్సిన సమయం వచ్చింది. వారు ఎక్కడి నుంచి వస్తున్నారు.. మూలాలు ఎక్కడివీ అన్న అంశాలపై కన్నేయండి. ఎందుకంటే.. ఓ దొంగల ముఠా పని మనుషుల ముసుగులో మొత్తం దోచుకెళ్తోంది. హైదరాబాద్‌లోనే వీరు చోరీ చేసిన ఘటనలు వెలుగు చూశాయి. అతి వినయం, ఎక్కడ లేని నమ్మకం ప్రదర్శించి.. చివరికి అందర్నీ మత్తులో పడేసి ఉన్నదంతా ఊడ్చుకుపోతున్న వ్యవహారం బయటికి వచ్చింది. ఈ ముఠాను నేపాలీ దేశస్థులుగా, అక్కడి కైలాలీ దొంగల ముఠాగా పోలీసులు గుర్తించారు.

నేపాల్ నుంచి వచ్చి ఖరీదైన ఇళ్లలో పనికి..
హైదరాబాద్‌‌తో పాటు దేశంలోని మెట్రో నగరాల్లోని ఖరీదుగా కనిపించే ఇళ్లను ఎంపిక చేసుకుని ఈ కైలాలీ ముఠా సభ్యులు ఇంటి పనికి చేరతారు. ఇల్లు శుభ్రం చేయడం, తోట పని వంటివి చేస్తూ ఉంటారు. ఈ సమయంలో యజమానులు ఏవైనా విలువైన వస్తువులు ఇంట్లో ఎక్కడైనా మర్చిపోతే.. అవి తమకు దొరికాయంటూ తిరిగి వారికి ఇచ్చేసి బాగా నమ్మకం పొందుతారు. ఇలా కొన్ని రోజుల తర్వాత తమ వారిని కూడా పరిచయం చేస్తారు. ఈ లోపు ఇళ్లలో ఎక్కడెక్కడ సీసీటీవీ కెమెరాలు ఉన్నాయి.. డబ్బులు, బంగారు ఆభరణాలు వంటి ఎక్కడ పెడతారు.. వాటిని కొట్టేసి పారిపోవడానికి దారి ఎక్కడి నుంచి ఉంటుందనే విషయాలన్నింటినీ పసిగడతారు. 

Also Read: Sangareddy: ఎమ్మార్వో ఆఫీసుకు తాళాలు.. బయటే కూర్చున్న సిబ్బంది, కారణం తెలిసి గ్రామస్థులు షాక్

ఆ తర్వాత యజమానులు ఎక్కడికైనా వెళ్లిన సందర్భంలో అదను చూసి లూటీ చేస్తారు. తిరిగి యజమానులు వచ్చేలోపే సొమ్ముతో సహా మాయం అవుతారు. సీసీటీవీ కెమెరాలకు సంబంధించి డీవీఆర్‌ను కూడా వెంట తీసుకెళ్తారు. ఈ చోరీ ఘటనలు తాజాగా కోకాపేట్‌లోని ఓ గేటెడ్‌ కమ్యూనిటీలో విల్లా నంబర్‌ 44లో, కుషాయిగూడ స్టేషన్ పరిధిలో జరిగాయి. మొదటి ఘటనలో రూ.2 కోట్ల విలువైన వజ్రాలు, బంగారు ఆభరణాలను దోచుకెళ్లారు. సైనిక్‌పురిలోని ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి ఇంట్లో రూ.2 కోట్లు విలువైన వజ్రాలు, బంగారు ఆభరణాలు, నగదును దోచుకుపోయారు. రాయదుర్గం, నాచారం, ముసారాంబాగ్‌ ప్రాంతాల్లోనూ వీరు చేతివాటం ప్రదర్శించినట్లుగా పోలీసులు చెప్పారు.

Also Read: KTR: కేటీఆర్ పెద్దమనసు.. జీహెచ్ఎంసీ స్వీపర్‌ రజినికి ఉన్నత ఉద్యోగం, ఉత్తర్వులు జారీ

అనంతరం, ఈ ముఠా దొంగలు ఫోన్లను పడేసి పోలీసులకు దొరక్కుండా విడివిడిగా రోడ్డు మార్గం ద్వారా నాందేడ్‌, పుణె, ఇండోర్‌, లక్నో మీదుగా భారత సరిహద్దులు దాటి నేపాల్‌లోకి చేరుకుంటారు.  ఒక్కసారి నేపాల్‌కు చేరుకున్నారంటే ఇక వారు దొరకరు. ఆ దేశానికి ఖైదీల అప్పగింతకు సంబంధించిన ప్రత్యేక ఒప్పందం అమల్లో లేకపోవడం వరంగా మారింది. సైబరాబాద్‌, రాచకొండ పోలీసులు  అక్కడ మకాం వేసి నిందితులను గుర్తించినా ఇక్కడికి తీసుకురాలేకపోతున్నారు. స్వాధీనం చేసుకున్న సొత్తును కూడా స్థానిక పోలీస్‌ స్టేషన్‌లోనే డిపాజిట్‌ చేసి రావాల్సి వచ్చింది.

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 21 Sep 2021 09:30 AM (IST) Tags: Secunderabad Hyderabad police Nepali thieves in hyderabad sainikpuri Nepali theft group

సంబంధిత కథనాలు

Hyderabad: వంట మాస్టర్‌తో మహిళ సహజీవనం, ఇంతలో గది నుంచి కంపు వాసన - తెరిచి చూసి స్థానికులు షాక్

Hyderabad: వంట మాస్టర్‌తో మహిళ సహజీవనం, ఇంతలో గది నుంచి కంపు వాసన - తెరిచి చూసి స్థానికులు షాక్

Karnataka Road Accident: కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం - బస్సు, లారీ ఢీకొనడంతో 7 మంది మృతి

Karnataka Road Accident: కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం - బస్సు, లారీ ఢీకొనడంతో 7 మంది మృతి

Hyderabad: ఏడాదిగా సహజీవనం, రెండ్రోజుల్లోనే పెళ్లి - ఇంతలో వరుడు మృతి! వధువు ఏం చేసిందంటే

Hyderabad: ఏడాదిగా సహజీవనం, రెండ్రోజుల్లోనే పెళ్లి - ఇంతలో వరుడు మృతి! వధువు ఏం చేసిందంటే

Tirupati: పీకలదాకా తాగి పోలీసులు వీరంగం, భయపడి 100కి కాల్ చేసిన స్థానికుడు - తరువాత ఏం జరిగిందంటే !

Tirupati: పీకలదాకా తాగి పోలీసులు వీరంగం, భయపడి 100కి కాల్ చేసిన స్థానికుడు - తరువాత ఏం జరిగిందంటే !

Bus Accident: బెంగళూరు-హైదరాబాద్ హైవేపై ప్రమాదం, ప్రైవేటు బస్సు - లారీ ఢీ

Bus Accident: బెంగళూరు-హైదరాబాద్ హైవేపై ప్రమాదం, ప్రైవేటు బస్సు - లారీ ఢీ

టాప్ స్టోరీస్

KTR In Davos: తెలంగాణలో ఐదు వందల కోట్ల రూపాయలతో ఆశీర్వాద్ పైప్స్ తయారీ ప్లాంట్ - విదేశాలకు ఎగుమతి చేసేలా ప్లానింగ్

KTR In Davos: తెలంగాణలో ఐదు వందల కోట్ల రూపాయలతో ఆశీర్వాద్ పైప్స్ తయారీ ప్లాంట్ - విదేశాలకు ఎగుమతి చేసేలా ప్లానింగ్

AP Government On CPS: సీపీఎస్‌ అమలు సాధ్యం కాదు- తేల్చి చెప్పిన ఏపీ ప్రభుత్వం, జీపీఎస్‌కు సహకరించాలని సూచన

AP Government On CPS: సీపీఎస్‌ అమలు సాధ్యం కాదు-  తేల్చి చెప్పిన ఏపీ ప్రభుత్వం, జీపీఎస్‌కు సహకరించాలని సూచన

Petre Rates States : పెట్రో పన్నులపై రగడ ! ఎప్పుడూ కేంద్రమేనా రాష్ట్రాలు తగ్గించవా ?

Petre Rates States : పెట్రో పన్నులపై రగడ ! ఎప్పుడూ కేంద్రమేనా రాష్ట్రాలు తగ్గించవా ?

Major: 'మేజర్' సినిమాకి స్టాండింగ్ ఒవేషన్ - సెన్సార్ టాక్ ఇదే

Major: 'మేజర్' సినిమాకి స్టాండింగ్ ఒవేషన్ - సెన్సార్ టాక్ ఇదే