Hyderabad News: హైదరాబాద్ లో డ్రగ్స్ కలకలం - యువకుడితో పాటు మహిళ అరెస్ట్
Telangana News: హైదరాబాద్‌లో మరోసారి డ్రగ్స్ కలకలం రేపాయి. రాజేంద్రనగర్ పరిధిలో డ్రగ్స్ విక్రయిస్తున్న ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. వీటి విలువ రూ.25 లక్షలు ఉంటుందని అంచనా వేస్తున్నారు.
Hyderabad Police Caught Drugs: తెలంగాణలో (Telangana) డ్రగ్స్‌పై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నా ఎక్కడో ఓ చోట బయటపడుతూనే ఉన్నాయి. తాజాగా, గురువారం రాజేంద్రనగర్ (Rajendranagar)లో ఎక్సైజ్ అధికారులు భారీగా డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. సన్ సిటీ వద్ద 270 గ్రాముల ఎంఎండీఏ డ్రగ్స్ సీజ్ చేశారు. ఓ యువకుడితో పాటు మహిళను అరెస్ట్ చేసినట్లు చెప్పారు. ఓ ఈవెంట్ మేనేజర్ కు డ్రగ్స్ విక్రయిస్తుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నట్లు పేర్కొన్నారు. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ కు చెందిన నిందితులను అరెస్ట్ చేశామన్నారు. మార్కెట్ లో వీటి విలువ రూ.25 లక్షలు ఉంటుందని అంచనా వేస్తున్నారు. NDPS యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. నగరంలో మాదక ద్రవ్యాలపై ఉక్కుపాదం మోపుతున్నామని.. డ్రగ్స్ వినియోగించినా, అమ్మినా కఠినచర్యలు తప్పవని.. ఎంతటివారైనా ఉపేక్షించేది లేదని వార్నింగ్ ఇచ్చారు.