Hyderabad Pubs: హైదరాబాద్‌లోని ఓ పబ్‌లో గలీజు పనులు! యువతులతో సెమీన్యూడ్ డాన్సులు
Hyderabad: బంజారాహిల్స్‌లో ఓ పబ్‌లో జరుగుతున్న అసాంఘిక కార్యకలాపాలు కూడా బయటికి వచ్చాయి.
సికింద్రాబాద్ కిమ్స్ హాస్పిటల్ సమీపంలోని రామ్‌గోపాల్ పేటలో బార్ అండ్ రెస్టారెంట్ ముసుగులో పబ్ గా మార్చేసిన ఘటన ఆదివారం వెలుగు చూసింది. అంతేకాక, ఇందులో యువతులతో అభ్యంతరక రీతిలో డాన్సులు చేయిస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు. ఈ విషయం గురించి సమాచారం అందుకున్న సెంట్రల్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఆదివారం ఈ పబ్‌పై దాడులు చేశారు. అక్కడే ఉన్న నిర్వహకులు, కస్టమర్లతో పాటు మొత్తం 18 మందిని అరెస్టు చేశారు.
హైదరాబాద్ బంజారాహిల్స్‌లో ఓ పబ్‌లో జరుగుతున్న అసాంఘిక కార్యకలాపాలు కూడా బయటికి వచ్చాయి. ఈ పబ్‌లో రష్యాకు చెందిన యువతులతో సెమీ న్యూడ్ డ్యాన్స్‌లు చేయించారు. దీనిపై కూడా పోలీసులు దాడి చేసి సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
రాంగోపాల్ పేటలో ఇలా
బోయిన్‌పల్లికి చెందిన జి.విజయ్‌కుమార్ గౌడ్ కొన్ని రోజులుగా ఎలాంటి పర్మిషన్లు లేకుండానే క్లబ్ టెకీలను నిర్వహిస్తున్నారు. దీనికి నళిని రెడ్డి మేనేజింగ్ డైరెక్టర్‌గా, ఎన్.రవి మేనేజర్/అకౌంటెంట్‌గా, సైదా జరీన్, బి.హరికృష్ణ డీజే ఆపరేటర్లుగా, బి.ప్రకాష్ క్యాషియర్‌గా పనిచేస్తున్నారు. ఒక నిర్దిష్ట సమయం లేకపోవడం, అతిగా డీజే చప్పుళ్లు ఉండడంతో గతంలో దీనిపై రెండు కేసులు నమోదయ్యాయి. అయినా ఆగని క్లబ్ టెకీల నిర్వహకులు కస్టమర్లను ఆకట్టుకోవడానికి మరింత అసభ్య పనులకు దిగారు. కొంత యువతులతో డాన్సులు చేయిస్తూ దాన్ని డ్యాన్స్ బార్‌గా చేసేశారు. ఈ యువతులు బార్ కి వచ్చిన వారిని, మత్తులో ఉన్నవారిని రెచ్చగొట్టేలా హావభావాలు ప్రదర్శిస్తూ కస్టమర్ల పక్కన కూర్చోవడం, చివరికి అసాంఘిక కార్యకలాపాలకు దారి తీసేలా ప్రోత్సహిస్తున్నారని పోలీసులు తెలిపారు. దీనిపై పోలీసులకు సమాచారం అందింది. తెల్లవారుజామున ఒంటి గంటల ప్రాంతంలో పోలీసులు ఈ క్లబ్ టెకీలపై దాడి చేసి నిర్వహకులను, డాన్సులు చేస్తున్న 8 మంది యువతులు, ఐదుగురు కస్టమర్లను అదుపులోకి తీసుకున్నారు.
బంజారాహిల్స్ పబ్‌లో అమ్మాయిలు అర్ధనగ్న డాన్సులు
బంజారాహిల్స్‌లోని ఎనిమా అని పబ్‌లో అర్దనగ్న డ్యాన్స్‌లతో రచ్చ చేశారు. జూబ్లీహిల్స్ రోడ్ నెంబరు–36లోని రెస్టారెంట్, పబ్‌ను ప్రారంభించారు. ప్రీ లాంచింగ్ అంటూ ప్రారంభించిన ఈ పబ్‌లో రష్యన్ యువతులతో డాన్సులు చేయించారు. 2 రోజుల ఈ వేడుకలకు ఎక్సైజ్ శాఖ నుంచి వీరు అనుమతి పొందినప్పటికీ పోలీసుల నుంచి పర్మిషన్లు పొందలేదు.
ఇదే క్రమంలో రాత్రి వేడుకల్లో భాగంగా రష్యన్ యువతులతో కలిసి డాన్సులు చేయించారు. పెద్ద ఎత్తున ఈ వేడుకలో పాల్గొనడం, దాంతో అక్కడున్న రోడ్డుపై పూర్తిగా ట్రాఫిక్ స్తంభించడంతో పోలీసులకు ఫిర్యాదు అందింది. దీంతో వారు దాడి చేసి పబ్ నిర్వహకులైన దుర్గా ప్రసాద్, చువాల్ సింగ్‌లపై ఐపీసీ సెక్షన్ 294, ఆబ్సెంట్ చట్టం, 341, 21 ఆఫ్ 76 చట్టం కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.