Crime News: మావోయిస్టుల పరిస్థితే ఘోరంగా ఉంటే వారి పేరుతో బ్లాక్ మెయిలింగ్ - జనరల్ నాలెడ్జ్ లేకపోతే దొరికిపోరా?
Fake Maoists: మావోయిస్టుల పేరుతో బెదించి డబ్బులు గుంజుతున్న వారిని హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. వారు తమపాత ఇంటి యజమానికే గురి పెట్టారు.

Fake Maoists Arrest: మావోయిస్టుల పరిస్థితి అత్యంత ఘోరంగా ఉంది. అడవుల్లోకి చొచ్చుకు వెళ్లి ..దొరికిన వాళ్లను దొరికినట్లుగా బలగాలు కాల్చి చంపుతున్నాయి. కాల్పుల విరమణ పాటిస్తామని..చర్చలకు సిద్ధమని మావోయిస్టులు చెబుతున్నా ఎవరూ పట్టించుకోడం లేదు. అలాంటి పరిస్థితుల్లోవారు ఉంటే వారి పేరు చెప్పి డబ్బులు గంజుకోవాలని ఓ ఇద్దరు అపర మేధావి దొంగలు ప్లాన్ చేశారు. దొరికిపోయారు.
ఇంటి ఓనర్‌ను మావోయిస్టుల పేరుతో బెదించాలని ప్లాన్
జులాయిగా తిరుగుతూ అప్పులు పాలయిన ఓ యువకుడు అడ్డదారిలో డబ్బులు సంపాదించాలనే ఉద్ధేశ్యంతో కిరాయికి ఉన్న ఇంటి యజమానిని మావోయిస్టుల పేరుతో లేఖ రాసి 50 లక్షలు డిమాండ్ చేశాడు. జీడిమెట్ల పియస్ పరిధి లో సంచలనం సృష్టించింది..
ఇంటి యజమాని కూన రాఘవేంద్ర గౌడ్ పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసారు..
సీసీ కెమెరాల్లో దొరికిపోయిన దొంగలు
భాదితుడు కూన రాఘవేంద్ర గౌడ్ ఇంట్లోని సీసీ విజువల్స్ ఆధారంగా కిరాయికి ఉంటున్న ఎర్రం శెట్టి రాజు (33) గా గుర్తించారు. .అతనిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల విచారణలో ప్రధాన నిందితుడు తన స్నేహితుడు కందురెళ్లి రాజు (24) ను రప్పించాడు.. ఇద్దరు కలసి మావోయిస్టుల పేరు తో లేఖ రాసి ఇంట్లోని తులసి మొక్కను పీకి పారేసి 50 లక్షలు ఇవ్వక పొతే నీ కొడుకును చంపుతామని బెదిరించారు. వీరిద్దరూ విజయవాడ గన్నవారానికి చెందిన పాత నేరస్తులుగా గుర్తించారు.
మావోయిస్చులు కాదని వెంటనే గుర్తించిన పోలీసులు
ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకొని వారి వద్ద నుండి,13 చిన్న పాటి నాటు బాంబులు,3 చరవాణీ లు ,2 బెదిరింపు లేఖలు స్వాధీనం చేసుకున్నారు. వీరు నాటు బాంబులను విజయనగరం లో కొనుగోలు చేసినట్లుగా విచారణలో తేలింది.. దీంతో వీరిని అరెస్టు చేసి రిమాండు కు తరలిస్తున్నట్లు జీడిమెట్ల పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బాల నగర్ ఏసీపీ నరేష్ రెడ్డి ప్రకటించారు.
ఇద్దర్నీ రిమాండ్ కు తరలింపు
బాధితుడు షాపూర్ నగర్ కి చెందిన కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ సోదరుడు కూన రవీందర్ గౌడ్ కుమారుడు. ఆయన బిల్డర్. ఆయన వద్ద బాగా డబ్బులు ఉంటాయని భావించి ఈ ఇద్దరూ ఇంటి కాంపౌండ్ లో ఉన్న తులసి మొక్క కుండీని ధ్వంసం చేసి అక్కడ కారుపై ఎర్రటి టవల్ లో ఓ లేఖ పెట్టి వెళ్లిపోయాడు. తమకు రూ.50 ఇవ్వాలని డిమాండ్ చేశాడు. తాము అడిగిన డబ్బు ఇవ్వకపోతే తులసి మొక్క పీకేసినట్లు మీ కొడుకును చంపేస్తామని లేఖలో రాసినట్లు ఉండటం చూసి ఆయన షాకయ్యారు. నక్సల్స్ కాదని..దొంగ నక్సలైట్లు అని సులువుగానే గుర్తించిన పోలీసులు అరెస్టు చేశారు.





















