Viral News: నరరూపరాక్షసుడంటే ఈ నిరంజనే - మెదడుతో సూప్ కోసం హత్యలు - ఎంత మందిని సూప్ చేశాడంటే ?
Crime News: యూపీకి చెందిన రాజా కోలందర్ అనే నరరూప రాక్షసుడికి యావజ్జీవ శిక్ష విధించారు. మనిషిని చంపి ఆ తలతో సూప్ చేసుకుంటాడు ఈ వ్యక్తి.

Man Eater: ఎవరైనా కాస్త హింస పెడితే వీడు నరరూప రాక్షసుడు అని విమర్శిస్తాం. అయితే నిజంగా నరరూప రాక్షసులు కొంత మంది ఉంటారు.అలాంటి వారిలో ఒకరు రామ్ నిరంజన్ అలియాస్ రాజా కోలందర్. రాజా కోల్ అనే మారుపేరుతోనూ పిలుస్తారు. ఇతని ప్రత్యేకత ఏమిటంటే నరమాంసభక్షకుడు. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మజిల్లాకు చెందిన ఒక సీరియల్ కిల్లర్. భారత క్రిమినల్ చరిత్రలో ఒక భయానక వ్ . ఈయన క్రూరమైన నేరాలు, ముఖ్యంగా నరహత్యలు , నరమాంస భక్షణ సంచలనం సృష్టించాయి.
రామ్ నిరంజన్ ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ జిల్లాలోని శంకర్‌గఢ్‌కు చెందిన వాడు. నైనీలోని సెంట్రల్ ఆర్డనెన్స్ డిపో లో ఉద్యోగిగా పనిచేశాడు. రామ్ నిరంజన్ తనను తాను "రాజా"గా భావించేవాడు. తనకు ఇష్టం లేని వ్యక్తులను చంపాలనే ఆలోచనతో ఉండేవాడు. రామ్ నిరంజన్ నేరాలు భారతదేశ క్రిమినల్ చరిత్రలో అత్యంత దారుణమైనవ . అతను హత్యలు చేయడమే కాకుండా వారి తలలతో సూప్‌లు చేసుకుని తాగుతాడు.
రామ్ నిరంజన్ 2000-2001 మధ్యకాలంలో అనేక హత్యలకు పాల్పడ్డాడు. ప్రధానంగా ఆడవాళ్లు , పిల్లలను టార్గెట్ చేసేవాడు. కిడ్నాప్ చేసి, హత్య చేసిన తర్వాత వారి శరీర భాగాలను ఉపయోగించి దారుణమైన చర్యలకు పాల్పడేవాడు. హత్య చేసిన తర్వాత తలను కోసి, వారి మెదడును తీసి సూప్ తయారు చేసి తాగేవాడు. ఈ విషయం తెలిసిన తర్వాత భారతదేశంలో అత్యంత భయంకరమైన నరమాంస భక్షకులలో ఒకడిగా గుర్తించడం ప్రారంభించాడు. 2000లో పత్రకారుడు మనోజ్ కుమార్ సింగ్ అనే జర్నలిస్టు, అతని డ్రైవర్ రవి శ్రీవాస్తవ్‌లను కిడ్నాప్ చేసి హత్య చేశాడు. ఈ కేసులో రామ్ నిరంజన్ మరియు ,సహచరుడు బచ్చరాజ్ కోల్ దోషులుగా తేలారు
खबर आपको विचलित कर सकती है?⚠️🚨
— Surya☀️ (@RaviSai13516746) May 24, 2025
राजा कोलंदर ने 14 से ज्यादा हत्याओं की बात कबूली है। वह हत्या के बाद शव के टुकड़े-टुकड़े कर देता था, मांस खा जाता था। खोपड़ी से भेजा निकाल कर उसे उबालकर सूप बनाकर पीता था।
आज इसने जुर्म कबूला वेहसि दरिंदे को आजीवन कारावास की सजा मिली है।😡 pic.twitter.com/slv0gJYyUM
రామ్ నిరంజన్ 2001లో అరెస్టు అయ్యారు. అతని నేరాలపై విచారణ ఉత్తరప్రదేశ్‌లోని స్థానిక కోర్టులో జరిగింది. 2000లో జరిగిన జర్నలిస్టు మనోజ్ కుమార్ సింగ్ , డ్రైవర్ రవి శ్రీవాస్తవ్ హత్య కేసులో ఎడిజి కోర్టు రామ్ నిరంజన్ , బచ్చరాజ్ కోల్‌లకు జీవిత ఖైదు శిక్ష విధించింది. రామ్ నిరంజన్ యొక్క నేరాలు ఉత్తరప్రదేశ్‌లో, ముఖ్యంగా ప్రయాగ్‌రాజ్ ప్రాంతంలో, తీవ్ర భయాందోళనలను సృష్టించాయి. యావజ్జీవ శిక్ష విధిస్తూ తీర్పు చెబుతున్న సమయంలో ఆయన నవ్వుతూ కనిపించాడు.





















