Manneguda Kidnap Case : మన్నెగూడ కిడ్నాప్ కేసు సీన్ రీకన్‌స్ట్రక్షన్, కారులో వైశాలిపై విచక్షణారహితంగా దాడి!
Manneguda Kidnap Case : మన్నెగూడ వైశాలి కిడ్నాప్ కేసు మరో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. నిందితుడు నవీన్ రెడ్డి కారులో వైశాలిపై విచక్షణారహితంగా దాడి చేసినట్లు ఒప్పుకున్నాడు.
Manneguda Kidnap Case : హైదరాబాద్ శివారులోని మన్నెగూడలో వైద్య విద్యార్థిని వైశాలి కిడ్నాప్ కేసు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైన విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో ప్రధాన నిందితుడు నవీన్ రెడ్డిని ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేశారు. కిడ్నాప్ కేసు విచారణలో భాగంగా పోలీసులు ఆదివారం సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేశారు. హస్తినాపురం నుంచి మన్నెగూడ వరకు కిడ్నాప్ కేసును సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేశారు. వైశాలి ఇంటి ముందున్న షెడ్డును టీషాపు కోసం రిపేర్ చేయాలని మిస్టర్ టీకి చెందిన వాట్సాప్ గ్రూప్ లో నవీన్ రెడ్డి మెసేజ్ పెట్టాడు. అక్కడకు వచ్చిన సిబ్బందిని రెచ్చగొట్టి వైశాలి ఇంటిపై దాడికి పాల్పడ్డాడు. అనంతరం వైశాలిని కిడ్నాప్ చేశారు. కారులో వైశాలిపై దాడి చేసినట్టు నవీన్ రెడ్డి పోలీసుల సమక్షంలో వెల్లడించాడు. ఈ కేసులో అరెస్టైన 36 మంది నిందితులు ఇంకా జైలులోనే ఉన్నారు.
కారులో దాడి
వైశాలిని కిడ్నాప్ చేసిన నవీన్ రెడ్డి కారులో ఆమెపై విచక్షణా రహితంగా దాడి చేసినట్టు ఒప్పుకున్నట్లు పోలీసులు తెలిపారు. వైశాలి కిడ్నాప్ కేసులో ప్రధాన నిందితుడు నవీన్ రెడ్డిని 3 రోజుల కస్టడీకి రంగారెడ్డి జిల్లా కోర్టు పోలీసులకు అనుమతి ఇచ్చింది. ముందు ఒక రోజు కస్టడీకి మాత్రమే ఇబ్రహీంపట్నం 15 ఎంఎం కోర్టు అనుమతి ఇవ్వగా... ఆదిభట్ల పోలీసులు మూడు రోజుల కస్టడీ కావాలని జిల్లా కోర్టును ఆశ్రయించారు. దీనికి జిల్లా కోర్టు అనుమతిచ్చింది. కోర్టు ఆదేశాలతో శనివారం చర్లపల్లి జైలులో ఉన్న నవీన్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
మూడు రోజుల పోలీస్ కస్టడీ
తెలంగాణలో సంచలనంగా సృష్టించిన వైశాలి కిడ్నాప్ కేసు మలుపులు తిరుగుతోంది. నవీన్‌రెడ్డిని పోలీసులు కస్టడీకి తీసుకుని విచారణ చేపట్టారు. కిడ్నాప్ కేసులో ఏ1 నిందితుడు నవీన్ రెడ్డిని విచారించేందుకు 8 రోజులు పోలీసు కస్టడీకి ఇవ్వాలని ఆదిభట్ల పోలీసులు ఇబ్రహీంపట్నం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే కోర్టు ముందుగా ఒక రోజు కస్టడీకి మాత్రమే అనుమతి ఇచ్చింది. దీంతో పోలీసులు రంగారెడ్డి జిల్లా కోర్టును ఆశ్రయించారు. మూడు రోజుల పోలీస్ కస్టడీకి జిల్లా అనుమతి ఇచ్చింది. శనివారం చర్లపల్లి జైలు నుంచి నవీన్ రెడ్డిని కస్టడీకి తీసుకొన్న పోలీసులు, ఇబ్రహీంపట్నం ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం ఆదిభట్ల పోలీస్ స్టేషన్‌కి తరలించారు. ఇటీవల నవీన్ రెడ్డి సోదరుడు సందీప్ రెడ్డిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. వైశాలి, నవీన్ రెడ్డికి సంబంధించిన వీడియోలను వైరల్ చేస్తున్న కేసులో సందీప్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు.
అసలేం జరిగింది?
హైదరాబాద్ శివారులోని ఆదిభట్లలో యువతి కిడ్నాప్ కేసు సంచలనం అయింది. ప్రేమించిన యువతి మరొకరితో పెళ్లికి సిద్ధమవ్వడంతో ఆమెను కిడ్నాప్ చేశాడు యువకుడు. అయితే ఆ కిడ్నాప్ కూడా సినీఫక్కీలో చేశారు. తన అనుచరులతో యువతి ఇంటిపై దాడి చేసి తండ్రిని కొట్టి యువతిని కిడ్నాప్ చేశాడు. రంగారెడ్డి జిల్లా మన్నెగూడలో డిసెంబర్ 9న ఈ ఘటన జరిగింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు 36 మందిని అరెస్టు చేశారు