Hyderabad Drugs : బోర్నవిటా డబ్బాలో డ్రగ్స్ సప్లై, హైదరాబాద్ లో నైజీరియన్ అరెస్ట్!
Hyderabad Drugs : హైదరాబాద్ లో మరోసారి డ్రగ్స్ కలకలం రేగింది. నైజీరియాకు చెందిన గాడ్వి్న్ డ్రగ్స్ సప్లై చేస్తుండగా ఎక్సైజ్ పోలీసులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.
Hyderabad Drugs : హైదరాబాద్ శివారులో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. సుమారు 18 లక్షల విలువైన డ్రగ్స్ ,178 గ్రాముల కొకైన్ హాయత్ నగర్ ఎక్సైజ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నైజీరియాకు చెందిన గాడ్విన్ ఇంపీయాగ్ ను అరెస్ట్ చేశారు. హైదరాబాద్ లో డ్రగ్స్ సప్లై చేస్తుండగా ఎక్సైజ్ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. బెంగుళూరు నుంచి డ్రగ్స్ ను హైదరాబాద్ కు తీసుకువస్తున్నట్లు హయత్ నగర్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ లక్ష్మణ్ గౌడ్ తెలిపారు. గతంలో దుల్ పేట్ డ్రగ్స్ కేసులో గాడ్విన్ అరెస్ట్ అయ్యాడని అన్నారు. నిందితుడు నకిలీ పాస్ పోర్ట్ తో ట్రావెల్ చేస్తున్నాడని పోలీసులు గుర్తించారు. 3 నెలలో 400 సిమ్ కార్డులు ఉపయోగించినట్లు ఇన్స్పెక్టర్ తెలిపారు. 2015 లో చదువు నిమిత్తం హైదరాబాద్ వచ్చిన గాడ్విన్ ఇంపీయాగ్ ఆంధ్రప్రదేశ్ లో కొంత కాలం ఉన్నాడని అన్నారు. వీసా గడువు ముగిసినా ఇల్లీగల్ గా దేశంలో ఉంటున్నాడని తెలిపారు. నిందితుడు రెండు పాస్ పోర్ట్ లు కలిగి ఉన్నాడన్నారు. బెంగళూరుకు చెందిన అస్లాం నుంచి డ్రగ్స్ తెచ్చాడన్నారు. బోర్నవిటా డబ్బాలో డ్రగ్స్ ను హైదరాబాద్ తీసుకొచ్చాడని చెప్పారు.
"బెంగళూరు నుంచి బస్ లో హైదరాబాద్ కు డగ్స్ తీసుకొచ్చాడు. బెంగళూరు నుంచి 200 గ్రాములు తెచ్చాడని చెప్పుతున్నాడు. అందులో 178 గ్రాముల డ్రగ్స్ మాత్రమే దొరికింది. 28 గ్రాములు అమ్మేసినట్లు చెపుతున్నాడు. దూల్ పేట్ కేసులో అరెస్ట్ అయ్యాడు. మూడు నెలల పాటు జైల్లో ఉన్నాడు. బెయిల్ పై బయటకు వచ్చి మళ్లీ ఈ దందా చేస్తున్నాడు."- ఎక్సైజ్ పోలీసులు
విద్యార్థినుల ఫొటోలు మార్ఫింగ్ చేసి
హైదరాబాద్ శివారులోని ఘట్‌కేసర్ ఇంజినీరింగ్ కాలేజీలోని విద్యార్థినుల ఫోటోలను మార్ఫింగ్ చేసి వాట్సాప్ గ్రూపుల్లో సర్క్యూలేట్ చేస్తున్న నలుగురు సైబర్ చీటర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే వీరెవరన్నది ఇంకా పోలీసులు బయట పెట్టలేదు. వీరు ఆ కాలేజీలో చదివే విద్యార్థులా లేకపోతే బయట వ్యక్తులా అన్నది తేలాల్సి ఉంది. ఈ వ్యవహారం గత మూడు రోజుల నుంచి సంచనలం సృష్టిస్తోంది. ఘట్కేసర్‌లోని ఓ ప్రముఖ ఇంజినీరింగ్ కాలేజీలో చదువుతున్న విద్యార్థినిల ఫొటోలను కొందరు ఆగంతకులు మార్ఫింగ్ చేస్తున్నారు. విద్యార్థినిల ఫొటోలను న్యూడ్‌గా తయారు చేసి వాట్సాప్ గ్రూప్‌ల్లో పోస్టింగ్ చేస్తున్నారు.
కాలేజీలో ఉన్న వారి పనే ! వారు విద్యార్థులా ? ఉద్యోగులా ?
అంతేకాకుండా ఆ మార్ఫింగ్ ఫొటోలను ఆగంతకులు విద్యార్థులకు పంపి వేధింపులకు గురిచేస్తున్నారు. విద్యార్థినుల ఫోటోలను... కళాశాలకు చెందిన విద్యార్థినుల వాట్సాప్ డీపీల నుంచి ఫొటోలు సేకరించి.. తిరిగి వాటిని న్యూడ్ ఫొటోలుగా మార్ఫింగ్ చేసి వారికే పంపిస్తూ, వాట్సాప్ గ్రూపుల్లో పెడుతున్నాడు. నాలుగైదు నెలలుగా ఈ తంతు జరుగుతోంది. ఈ విషయమై గతడాది నవంబరు 4న హాస్టల్ వార్డెన్‌కు, 9న ప్రిన్సిపల్‌కు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని విద్యార్థులు ఆందోళనకు దిగారు. దీంతో విషయం తెలుసుకున్న విద్యార్తి సంఘాలు ళాశాల గేటు ఎదుట ధర్నాకు దిగారు. గతేడాది నవంబరు నుంచి తమ ఫొటోలను మార్పింగ్ చేస్తున్నారని విద్యార్థినులు ఫిర్యాదు చేసినా కళాశాల యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని పోలీసులు కూడా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఈ విషయం పోలీసుల దృష్టికి వెళ్లడంతో సీరియస్ గా తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఏ ఏ నెంబర్ల నుంచి ఇలా మార్ఫింగ్ ఫోటోలు పోస్ట్ అయ్యాయో ఆరా తీసి వెంటనే .. సైబర్ నిపుణుల సాయంతో నిందితుల్ని పట్టుకున్నారు. మొత్తం నలుగురు ముఠాగా ఏర్పడి ఈ పని చేసినట్లుగా గుర్తించారు బాధితులైన విద్యార్థినులు చాలా మంది పరువు పోతుందన్న ఉద్దేశంతో సైలెంట్ గా ఉన్నారు. ఆ విద్యార్థినుల కుటుంబసభ్యులు కూడా.. పోలీసులు ఆ మార్ఫింగ్ ఫోటోలు బయటకు రాకుండా చూడాలని కోరుతున్నారు. ఆ నిందితుల్ని కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు.