Hyderabad: గన్‌తో కాల్చుకున్న సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్ - 45 రోజుల కిందే కొత్త డ్యూటీ!
బేగంపేట్ చికోటి గార్డెన్ వద్ద సీఆర్పిఎఫ్ కానిస్టేబుల్ దేవేందర్ సర్వీస్ రివార్వల్ తో కాల్చుకుని మృతి చెందాడు.
ప్రేమ విఫలం కావడంతో సీఆర్పిఎఫ్ లో పనిచేస్తున్న ఓ కానిస్టేబుల్ రివాల్వర్ తో కాల్చుకుని మృతి చెందిన సంఘటన బేగంపేట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. బేగంపేట్ చికోటి గార్డెన్ వద్ద సీఆర్పిఎఫ్ కానిస్టేబుల్ దేవేందర్ సర్వీస్ రివార్వల్ తో కాల్చుకుని మృతి చెందాడు. సీఆర్పీఎఫ్ ఐజీ మహేష్ లడ్డ దగ్గర విధులు నిర్వహిస్తున్న దేవేందర్ గత కొంతకాలంగా ప్రేమను విఫలమయానన్న మనస్తాపంలో ఉన్నట్లు తెలుస్తోంది. గత నలభై ఐదు రోజుల కింద అతణ్ని మహేష్ లడ్డ వద్ద సీఆర్పీఎఫ్ సెక్యూరిటీ కానిస్టేబుల్ గా నియమించినట్లు పోలీసులు తెలిపారు.
2021 బ్యాచ్ నియామకాల్లో సీఆర్పీఎఫ్ జవాన్ గా విధుల్లో చేరాడని పోలీసులు చెప్పారు. దేవేందర్ ఛత్తీస్ గడ్ కు చెందిన వ్యక్తిగా గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. అతని మరణానికి ప్రేమ విషయమే ప్రధాన కారణంగా పోలీసులు భావిస్తున్నారు.