Hyderabad Crime: అబ్దుల్లాపూర్ మెట్ లో దారుణ ఘటన... స్నేహితుడికి మద్యం తాగించి అతడి భార్యపై అత్యాచారం, ఆపై హత్య...
స్నేహితుడికి పూటుగా మద్యం తాగించి అతడి భార్యపై అత్యాచారం చేసి, హత్య చేశారో ఇద్దరు మృగాళ్లు. మద్యం మత్తు దిగిన తర్వాత స్నేహితులు చేసిన పని తెలిసి పోలీసులను ఆశ్రయించాడు.
రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ లో దారుణ ఘటన చోటుచేసుకుంది. స్నేహితుడికి మద్యం తాగించి అతడి భార్యపై అత్యాచారం చేసి చంపేశారు ఇద్దరు వ్యక్తులు. అబ్దుల్లాపూర్‌మెట్‌లో ఇద్దరు స్నేహితులు ఓ వ్యక్తి ఇంటికి వచ్చారు. ముగ్గురు కలిసి మద్యం తాగారు. మద్యం సేవించిన మత్తులో స్నేహితుడి భార్యపై కన్నేశారు. స్నేహితుడికి మద్యం ఎక్కువగా తాగించి అతడు మత్తులోకి జారుకోగానే అతడి భార్యపై అత్యాచారం చేశారు. ఆమె వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించింది. దీంతో ఆ కీచకులు మరింత రెచ్చిపోయి ఆమెను హత్యచేశారు. తర్వాత మద్యం మత్తు నుంచి తేరుకున్న వ్యక్తి చనిపోయి పడి ఉన్న భార్యను చూసి నిర్ఘాంత పోయాడు. బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని క్లూస్ టీం, డాగ్స్ స్వాడ్‌తో విచారణ చేపట్టారు. అత్యాచారం, హత్యకు పాల్పడిన ఇద్దరు నిందితుల్లో ఒకడైన సురేశ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో నిందితుడు శ్రీకాంత్ పరారీల ఉన్నాడు. అతడి కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.
Also Read: పరాయి వ్యక్తితో బెడ్‌రూంలో భార్య, భర్తకు రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయి.. చివరికి ఏమైందంటే..
కుటుంబ కలహాలతో భర్తను చంపిన భార్య
తమ్ముడితో కలిసి భర్తను హత్య చేసిన మహిళను హనుమకొండ పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం గన్నేర్ల శంకర్ (40) ఆటో డ్రైవర్ గా జీవనం కొనసాగిస్తున్నాడు. అతని భార్య గన్నేర్ల సుజాత(37) వీరికి ఇద్దరు పిల్లలున్నారు. శంకర్ భార్య, పిల్లలతో హనుమకొండ రెడ్డి కాలనీలో నివాసం ఉంటున్నాడు. శంకర్ మద్యానికి బానిసై ఇంట్లో ఖర్చులకు డబ్బులు ఇవ్వకుండా భార్యతో తరచూ గొడవ పడుతుండేవాడు. భర్త వేధింపులను భరించలేక చివరికి దారుణానికి పాల్పడింది. సుజాత తన తమ్ముడు జనుప వెంకట్ (26)ను హైదరాబాద్ నుంచి పిలిపించి భర్త శంకర్ మద్యం సేవిస్తున్న సమయంలో కళ్లలో కారం జల్లి ఇనుప రాడ్డుతో కొట్టి చంపారు. ఈ ఘటనపై హనుమకొండ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో భాగంగా మంగళవారం నిందితులను అరెస్టు చేశారు.
Also Read: రూ.99కే బ్రాండెడ్ ఇయర్ ఫోన్స్.. టెంప్ట్ అయినందుకు రూ.33 లక్షలు హాంఫట్, ఏం జరిగిందంటే..
Also Read: Cheating Woman: తక్కువ ధరకే బైక్ కావాలా నాయనా.. హా కావాలి.. అన్నారో అంతే.. మీ ఆశే ఆమెకి బిజినెస్
Also Read: ఇద్దరివీ వీఆర్వో ఉద్యోగాలు, అన్నీ పాడుపనులే.. ఏళ్లుగా వారికి గాలం.. చివరికి ఇలా..