(Source: ECI/ABP News/ABP Majha)
Hyderabad Crime: నేరెడ్ మెట్ బాలికపై సామూహిక అత్యాచారం కేసు, పదిమంది నిందితులు అరెస్ట్
Telangana Crime News: నేరేడ్‌మెట్ బాలిక సామూహిక అత్యాచారం కేసులో పోలీసులు పురోగతి సాధించారు. దారుణానికి ఒడిగట్టిన 10 మంది నిందితులను అరెస్ట్ చేసినట్లు నేరేడ్‌మెట్ పోలీసులు తెలిపారు.
Accused in Minor Molestation case in Hyderabad: రోజు రోజుకు దేశంలో బాలికలు, మహిళలపై లైంగిక దాడులు పెరుగుతున్నాయి. నిర్భయ వంటి చట్టాలు ఎన్ని ఉన్నా.. ఎంతమందిని ఎన్ కౌంటర్ చేసినా.. కొందరి వైఖరిలో మాత్రం మార్పు రావడం లేదు. దేశంలో పాటు తెలంగాణ రాష్ట్రంలో లైంగిక వేధింపుల ఘటనలు క్రమంగా పెరుగుతున్నాయి. మత్తు పదార్థాలకు బానిసలుగా మారుతున్న యువత ఆ మత్తులో దారుణాలకు ఒడిగడుతున్నారు. ఇటీవల హైదరాబాదులో మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం చేసిన ఘటన వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. నేరెడుమెట్ లో మైనర్ బాలికపై కొంతమంది యువకులు లైంగిక దాడికి పాల్పడ్డారు. మైనర్ అమ్మాయిని ట్రాప్ చేసి నేరెడ్ మెట్ తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
పది మంది అరెస్ట్
ప్రస్తుతం ఈ కేసులో పురోగతి కనిపించింది. పోలీసులు మైనర్ బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన పది మంది కీచకులను నేరెడ్ మెట్ పోలీసులు అరెస్ట్ చేశారు. కీలక సూత్రధారులైన నరేష్, విజయ్ లతో పాటు మరో ఎనిమిది మందిని అరెస్ట్ చేశారు. ఈ నెల 22న కాచిగూడ నుంచి 12 ఏళ్ల బాలికను నిందితులు కిడ్నాప్ చేసి.. కూల్ డ్రింక్ లో గంజాయి కలిపి తాగించారు. కాచిగూడ నుంచి నిందితులు బాలికను కిడ్నాప్ చేసి తీసుకువెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
కాచిగూడకు చెందిన బాలికను ఐదుగురు యువకులు ట్రాప్ చేశారు. ఆ బాలికకు గంజాయి అలవాటు చేసి నేరెడ్‌మెట్ ప్రాంతానికి తమతో తీసుకుని వెళ్లారు. బాలిక గంజాయి మత్తులో ఉండగా ఐదుగురు యువకులు ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. పలు దఫాలుగా అమ్మాయిపై దారుణానికి పాల్పడ్డారు నిందితులు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యారు.
పోలీసులను ఆశ్రయించిన తల్లి
మత్తు నుంచి తేరుకున్న బాలిక జరిగిన విషయాన్ని ఇంటికొచ్చి తల్లికి వివరించింది. దీంతో బాలిక తల్లి కాచిగూడ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు నిందితులపై కాచిగూడ పోలీసులు జీరో ఎఫ్ ఐఆర్ నమోదు చేశారు. అనంతరం కేసును నేరెడ్‌మెట్ పోలీసు స్టేషన్‌కు బదిలీ చేశారు. ఈ మేరకు రంగంలోకి దిగిన పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు పంపించారు పోలీసులు.