News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Hyderabad News: నెలరోజుల పాటు బెంగళూరులో హైదారాబాద్ పోలీసులు - సినిమా స్టైల్ లో డ్రగ్స్ ముఠా అరెస్ట్

Hyderabad News: హైదారబాద్ పోలీసులు నెలరోజుల పాటు బెంగళూరులో మకాం వేసి మరీ తెలంగాణకు డ్రగ్స్ సప్లై చేస్తున్న ముఠాను పట్టుకున్నారు.  

FOLLOW US: 
Share:

Hyderabad News: బెంగళూరు కేంద్రంగా హైదరాబాద్ కు పెద్ద ఎత్తున డ్రగ్స్ సరఫరా చేస్తున్న ముఠాను హైదరాబాద్ పోలీసులు పట్టుకున్నారు. నెలరోజుల పాటు అక్కడే మకాం వేసి మరీ నిందితులను అరెస్ట్ చేశారు. అయితే ఇందుకు సంబంధించిన వివరాలను హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. డ్రగ్స్ సరఫరా చేస్తున్న కేసులో నైజీరియాకు చెందిన అగ్ బో మ్యాక్స్ వెల్, ఇకెం ఆస్టిన్ ఒబాకా, చిగోజీలతో పాటు సాయి ఆకాశ్ అనే తెలుగు కుర్రాడిని అరెస్ట్ చేసినట్లు సీపీ సీవీ ఆనంద్ వివరించారు. బెంగళూరు నుంచి నగరానికి వచ్చి డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు తమకు పక్కా సమాచారం వచ్చిందని తెలిపారు. అప్రమత్తమైన నార్కోటిక్స్ విభాగం పోలీసులు దర్యాప్తు చేశారన్నారు. 

నలుగురు అరెస్ట్, ఒకరు పరార్

ఈక్రమంలోనే నెల రోజుల పాటు బెంగళూరులోనే మకాం వేసి... నైజీరియన్ల కదలికలపై నిఘా పెట్టారని వెల్లడించారు. అయితే ఈ కేసులో మొత్తం నలుగురిని అరెస్ట్ చేయగా.. మరో నైజీరియన్ పరారైనట్లు వివరించారు. ఈ కేసులో డ్రగ్స్ కింగ్ పిలన్ మ్యాక్స్ వెల్ ని ప్రధాన నిందితుడిగా గుర్తించినట్లు స్పష్టం చేశారు. మ్యాక్స్ వెల్, చిగోజి నైజీరియన్ నుంచి మెడికల్ వీసాపై వచ్చారని... మరో నిందితుడు ఒబాక విద్యార్థి వీసాపై వచ్చినట్లు సీపీ సీవీ ఆనంద్ తెలిపారు. ప్రస్తుతం పట్టుబడ్డ గ్యాంగ్ చాలా తెలివిగా డ్రగ్స్ సరఫరా, విక్రయాలు జరిపినట్లు తమ విచారణలో తేలిందన్నారు. 

నకిలీ అడ్రస్ లతో బ్యాంకు ఖాతాలు - కోట్లలో లావాదేవీలు

నకిలీ అడ్రస్ లతో బ్యాంకు ఖాతాలు తెరిచి లావాదేవీలు జరిపినట్లు నిర్ధారించారు. దాదాపు ఆరు నెలల్లోనే 4 కోట్లకు పైగా లావాదేవీలు జరిపినట్లు గుర్తించామన్నారు. నైజీరియన్ ముఠా సభ్యులు బెంగళూరులో ఉంటూ హైదరాబాద్ కు డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు తేలిందన్నారు. డ్రగ్స్ తీసుకునే అలవాటు ఉన్న హైదరాబాద్ వాసులు సంజయ్ కుమార్, తుమ్మ భాను తేజని పోలీసులు కొద్ది రోజుల క్రితం అరెస్ట్ చేశారు. ఈక్రమంలోనే వారు డ్రగ్స్ ఎవరి దగ్గర, ఎలా కొనుగోలు చేశారో పోలీసులకు వెల్లడించారు. ఈ సమాచారంతోనే పోలీసులు దర్యాప్తు చేయగా.. గుట్టంతా రట్టు అయిందన్నారు. 

డ్రగ్స్ సరఫరా చేస్తున్న మహిళ అరెస్ట్

మూడ్రోజుల క్రితం నైరోబీ నుంచి షార్జా మీదుగా శంషాబాద్ విమానాశ్రయానికి వచ్చిందో మహిళ. అయితే బురుండీ దేశానికి చెందిన 43 ఏళ్ల మహిళ ఎయిర్ అరేబియా ఎయిర్ వేస్ విమానం జీ9458లో ఆదివారం శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుంది. అయితే మహిళ పద్ధతి కాస్త తేడాగా, భయంగా కనిపించడంతో కస్టమ్స్ అధికారులకు అనుమానం వచ్చింది. దీంతో వెంటనే ఆమెను పక్కకు పిలిచి ఆమె లగేజీని తనిఖీ చేశారు. ఓ సంచిలో ఆఫ్రికా సంప్రదాయ దుస్తులు ఎనిమిది, మూడు సబ్బులు, ఒక హ్యాండ్ బ్యాగ్ ఉన్నాయి.

ఇంత సింపుల్ లగేజీతో వచ్చిన ఆమె ఎందుకు కాస్త కంగారుగా భయంతో ఉందని అధికారులకు అనుమానం వచ్చింది. ఆమె లగేజీని కాస్త నిశితంగా పరిశీలించగా అధికారులు షాక్ కు గురయ్యారు. ఆఫ్రికా సంప్రదాయ దుస్తులకు ఉన్న పెద్ద పెద్ద గుండీల్లో, సబ్బుల మధ్య ప్లాస్టిక్ కవర్ లో, హ్యాండ్ బ్యాగ్ అంచుల్లో హెరాయిన్ ఉన్నట్లు అర్థం అయింది. అయితే పౌడర్ రూపంలో ఉన్న హెరాయిన్ ను పొట్లాల్లో పెట్టి.. వాటిని గుండీలు, సబ్బులు, హ్యాండ్ బ్యాగ్ అంచుల్లో అమర్చినట్లు గుర్తించారు. 2.27 కిలోల ఆ హెరాయిన్ విలువ మార్కెచ్ ధర ప్రకారం రూ.14.2 కోట్లు ఉంటుందని అధికారులుల చెబుతున్నారు. 

Published at : 08 Jul 2023 10:32 AM (IST) Tags: Hyderabad News Telangana News Hyderabad CP CV Annand Nigerians Drug Supplier Drug Supplier Arrest

ఇవి కూడా చూడండి

Suicide Blast: పాకిస్థాన్‌లో ఆత్మాహుతి దాడి, 52 మంది మృతి

Suicide Blast: పాకిస్థాన్‌లో ఆత్మాహుతి దాడి, 52 మంది మృతి

Online Betting Scam: ఆన్ లైన్ బెట్టింగ్ కు పాల్పడుతున్న ముఠా అరెస్ట్, యువకులు జాగ్రత్తగా ఉండాలంటున్న పోలీసులు 

Online Betting Scam: ఆన్ లైన్ బెట్టింగ్ కు పాల్పడుతున్న ముఠా అరెస్ట్, యువకులు జాగ్రత్తగా ఉండాలంటున్న పోలీసులు 

పెళ్లి కాకుండానే గర్భం దాల్చిన యువతి, పెట్రోల్ పోసి నిప్పంటించిన తల్లి, సోదరుడు

పెళ్లి కాకుండానే గర్భం దాల్చిన యువతి, పెట్రోల్ పోసి నిప్పంటించిన తల్లి, సోదరుడు

Cyber Crime: గణేష్‌ ఉత్సవాల లక్కీ డ్రాలో ఐఫోన్‌ 15-నమ్మితే అకౌంట్‌ ఖాళీ అయినట్టే

Cyber Crime: గణేష్‌ ఉత్సవాల లక్కీ డ్రాలో ఐఫోన్‌ 15-నమ్మితే అకౌంట్‌ ఖాళీ అయినట్టే

Hyderabad: హైదరాబాదులో వర్షం, నాలా లో పడి పారిశుద్ధ కార్మికురాలు మృతి

Hyderabad:  హైదరాబాదులో వర్షం, నాలా లో పడి పారిశుద్ధ కార్మికురాలు మృతి

టాప్ స్టోరీస్

KCR Fever : కేసీఆర్‌కు తగ్గని జ్వరం - కేబినెట్ మీటింగ్ వచ్చే వారం !

KCR Fever : కేసీఆర్‌కు తగ్గని జ్వరం - కేబినెట్  మీటింగ్ వచ్చే వారం   !

TDP News : అధికార మత్తు వదిలేలా మోత మోగిద్దాం - కొత్త ఆన్ లైన్ ప్రచార ఉద్యమాన్ని ప్రకటించిన టీడీపీ !

TDP News  :  అధికార మత్తు  వదిలేలా మోత మోగిద్దాం - కొత్త ఆన్ లైన్ ప్రచార ఉద్యమాన్ని ప్రకటించిన టీడీపీ !

Pedda Kapu Review - 'పెదకాపు 1' రివ్యూ : గోదారి నెత్తుటి రాజకీయం - శ్రీకాంత్ అడ్డాల సినిమా ఎలా ఉందంటే?

Pedda Kapu Review - 'పెదకాపు 1' రివ్యూ : గోదారి నెత్తుటి రాజకీయం - శ్రీకాంత్ అడ్డాల సినిమా ఎలా ఉందంటే?

Honda SP 125 Sports Edition: రూ. లక్ష లోపే స్పోర్ట్స్ బైక్ లుక్ - హోండా ఎస్పీ125 స్పోర్ట్స్ ఎడిషన్‌ చూశారా?

Honda SP 125 Sports Edition: రూ. లక్ష లోపే స్పోర్ట్స్ బైక్ లుక్ - హోండా ఎస్పీ125 స్పోర్ట్స్ ఎడిషన్‌ చూశారా?