Hyderabad: ‘మూత్రం తాగు.. అర్ధనగ్నంగా ఉండు..’ అంటూ భర్త తీవ్రమైన వేధింపులు.. చివరికి..
నారాయణ పేట జిల్లా మక్తల్‌కు చెందిన యువతి రహమత్ నగర్‌లో నివసిస్తుంది. ఈమెకు 2016లోనే ఓ యువకుడితో వివాహం జరిగింది.
హైదరాబాద్‌లోని ఓ భర్త తన భార్యను వేధిస్తున్న దారుణమైన వ్యవహారం వెలుగులోకి వచ్చింది. వేధింపుల్లోనూ పరాకాష్ఠగా అతని వ్యవహారం ఉండడం విస్మయం గొలుపుతోంది. కీచక భర్త పెట్టే ఇబ్బందులు, వేధింపులు భరించలేని ఆమె చివరికి పోలీసులను ఆశ్రయించింది. ఈ మేరకు హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పూర్తి వివరాలివీ..
బాధితురాలు ఫిర్యాదులో పేర్కొన్న వివరాలు పోలీసులు చెప్పిన ప్రకారం.. నారాయణ పేట జిల్లా మక్తల్‌కు చెందిన యువతి రహమత్ నగర్‌లో నివసిస్తుంది. ఈమెకు 2016లోనే ఓ యువకుడితో వివాహం జరిగింది. ఆ యువతి ప్రేమించి అతణ్ని పెళ్లి చేసుకుంది. అప్పటి నుంచి వారిద్దరూ అక్కడే నివాసం ఉంటున్నారు. కొన్నాళ్ల క్రితం యువతి గర్భం దాల్చినా బలవంతంగా గర్భస్రావం చేయించారు. 2020లో భర్త సోదరుడు, సోదరి, బావ ఆమెను కులం పేరుతో కూడా దూషించారు. పెట్రోల్ పోసి నిప్పంటిస్తామని కూడా బెదిరించారు. చంపేస్తామని ఎన్నో సార్లు బెదిరించారని యువతి ఫిర్యాదులో పేర్కొంది.
Also Read: లైవ్ వీడియో పెట్టి మాజీ మిస్ తెలంగాణ ఆత్మహత్యాయత్నం... సకాలంలో స్పందించి రక్షించిన పోలీసులు
Also Read: పిల్లాడు కాదు.. కామాంధుడు.. పొలాల్లోకి లాక్కెల్లి.. 21 ఏళ్ల యువతిపై అత్యాచారయత్నం
డబ్బు కోసం బలవంతం చేయడంతో యువతి భర్తకు రూ.1.5 లక్షలు ఇచ్చినా వేధింపులు ఆగలేదు. పైగా ఇటీవల భర్త ఆగడాలు, వేధింపులు మరింతగా పెచ్చుమీరాయని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. తనను ఇంట్లో అర్ధ నగ్నంగా కూర్చోవాలని, మూత్రం తాగాలని తన భర్త బలవంతం చేసేవాడని ఆవేదన చెందింది. కులం పేరుతో తిడుతూ ఉంటాడని పోలీసులకు చేసిన ఫిర్యాదులో వెల్లడించింది. దీంతో పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు సహా పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.
Also Read: Sumanth's Malli Modalaindi Trailer: దొంగ సచ్చినోడా... ఎంతమంది ఆడపిల్లల జీవితాలు నాశనం చేస్తావ్ రా!
Also Read: హైదరాబాద్‌లో యువకుడు ఘాతుకం.. యువతి చేతులు, గొంతు కోసి దాడి
Also Read: యోగీ మార్క్ ట్రీట్‌మెంట్..! పాక్ విజయానికి వేడుకలు చేసుకున్న వారిపై దేశద్రోహం కేసులు
Also Read: ఈ కేటుగాళ్లు చాలా ముదుర్లు... ఆర్టీసీ బస్సుల్లో గంజాయి రవాణా... ఎలా చిక్కారంటే..?
Also Read: Family Drama Movie Review 'ఫ్యామిలీ డ్రామా' సమీక్ష: థ్రిల్లింత కొంత... సుహాస్ నటన కొండంత!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి