Fale Notes: పది రూపాయల స్టాంప్ పేపర్లపై 500 నోట్ల ముద్రణ - ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయబ్బా !
Crime News: సులువుగా డబ్బు సంపాదించాలంటే దొంగ నోట్లు ప్రింట్ చేయడమే మార్గమనుకున్నారు. మరి ఆ క్వాలిటీ పేపర్ ఎక్కడ నుంచి వస్తుంది..?
Two men used YouTube video to print fake 500 notes on 10 stamp paper: డబ్బులు సంపాదించాలంటే కష్టపడి పని చేసుకోవడమో.. ఉద్యోగం చేసుకోవడమో.. వ్యాపారం చేసుకోవడమో చేస్తారు. కానీ కొంత మంది మాత్రం షార్ట్ కట్స్ ను వెదుక్కుంటారు. వారే దొంగతనాలు..మోసాలు చేస్తూంటారు. ఇంకొంత మంది ఇంత కష్టం ఎందుకులే అని నేరుగా దొంగ నోట్లు ప్రింట్ చేస్తే పోలా అనుకుంటారు. అలా అనుకున్న యూపీకి చెందిన సోన్ భద్ర జిల్లాకు చెందిన ఇద్దరు మిత్రులకి ఓ సందేహం వచ్చింది. అదేమిటంటే.. దొంగ నోట్లు ప్రింట్ చేయాలంటే క్వాలిటీ పేపర్ కావాలి. మాములు పేపర్లు పని చేయవు. అలాంటి క్వాలిటీ పేపర్లు ప్రభుత్వం మాత్రమే తయారు చేస్తుంది. మరి వాటిని ఎలా సంపాదించాలి అని ఆలోచించారు.
నోట్లు ఎలా ప్రింట్ చేయాలో దానికి ఎలాంటి ప్రింటర్లు కొనాలో కూడా రీసెర్చ్ చేశారు. కానీ పేపర్ మాత్రం ఎలా సంపాదించాలో వారికి అర్థం కాలేదు. చివరికి వారికి ఓ ఐడియా వచ్చింది. అదేమిటంటే.. స్టాంప్ పేపర్స్. పది రూపాయల స్టాంప్ పేపర్లను తయారు చేస్తుంది. అవి కూడా ప్రభుత్వం నోట్లను తయారు చేసేంత క్వాలిటీ పేపర్లతోనే తయారు చేస్తుంది. పది రూపాయల స్టాంప్ పోను..కింద మ్యాటర్ రాసుకునేందుకు పేపర్ అంతా ఖాళీగానే ఉంటుంది. ఇంత కన్నా మంచి ఐడియా ఇక రాదనుకున్నారు. పది రూపాయల స్టాంప్ పేపర్లను కొనుక్కుని వచ్చేసి దొంగ నోట్ల ప్రింటింగ్ స్టార్ట్ చేశారు.
యూట్యూబ్‌లో చూసి ప్రింటర్లు ఇతర సామాగ్రి తెచ్చుకున్నారు. ఓ రాత్రి పూట .. పది రూపాయల స్టాంప్ పేపర్లను ఉపయోగించి శాంపిల్‌గా ప్రింట్స్ తీశారు. వాటిని మార్కెట్లో మార్చారు. పెద్దగా ఎవరూ పట్టించుకోకపోవడంతో ఇక తిరుగులేదని అనుకున్నారు. ఊళ్లో ఉన్న పది రూపాయల స్టాంప్ పేపర్లను టోకున కొనేందుకు ప్రయత్నించారు. అయితే అవి కూడా లెక్కల్లో ఉంటాయి కాబట్టి.. ఒక్కొక్కటిగా కొంటూ.. ఒక్కో వెండర్ దగ్గర కొంటూ.. వస్తున్నారు. అలా కొన్న పేపర్లతో డబ్బులు ప్రింట్ చేయడం ప్రారంభించారు.
కానీ వీళ్లు ఈ దొంగ నోట్ల మార్కెట్‌కు కొత్త. ఎన్ని జాగ్రత్తలుతీసుకుకున్నా ఎక్కడో ఓ చోట దొరికిపోతారు. అలాగే వీరు కూడాచాలా సులువుగా పోలీసులుక దొరికిపోాయరు. చిన్న చిన్న మొత్తాలతో చిన్న షాపుల్లో ఇస్తే వర్కవుట్ అయిందని ఈ సారి ఓ పది వేలు తీసుకుని పెద్ద దుకాణంకు వెళ్లారు. కానీ అక్కడ నోట్ల గణనలో పండిపోయిన వ్యాపారి ఉన్నారు. ఆ నోట్లను పట్టుకోగానే ఆయనకు అవి దొంగ నోట్లు అని తెలిసిపోయింది. వెంటనే.. పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వచ్చి పట్టుకున్నారు. దీంతో ఆ నోట్ల ముద్రణ సైడ్ బిజినెస్ రోజుల్లోనే ముగిసిపోయింది. వారు ఊచలు లెక్క పెడుతున్నారు.
స్టాంప్ పేపర్లతో ఇలాంటి పనులు చేస్తున్నారని తెలియడంతో.. స్టాంప్ పేపర్ల వినియోగాన్ని కూడా పరిశీలించాలని అధికారులు నిర్ణయించారు.