Naveen Murder Case : ఆ సినిమా చూసే అంత క్రూరహత్య - ఫశ్చాత్తాపమే లేని హరి హరకృష్ణ !
ఓ సినిమాలో సీన్ చూసే హత్య చేసేందుకు ప్లాన్ చేసుకున్నాడు హరి హరకృష్ణ . ఇప్పటికీ తాను తప్పు చేసినట్లుగా ఫీల్ కావడం లేదని పోలీసులు ఆశ్చర్యపోతున్నారు.
Naveen Murder Case : స్నేహితుడ్ని అత్యంత దారుణంగా చంపడమే కాకుండా.. శరీరంలో భాగాలు కోసేసి వికృతంగా ప్రవర్తించడానికి కారణం ఓ సినిమా అని పోలీసులు గుర్తించారు. నవీన్ హత్య కేసులో హరి హర కృష్ణ ను కస్టడీకి తీసుకుని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. రెండో రోజు విచారణలో సంచలన విషయాలు వెల్లడించినట్లుగా తెలుస్తోంది. నవీన్ ను హత్య చేసి శరీర భాగాలు విడతీయడానికి యూట్యూబ్ విడియోల్లో సెర్చ్ చేసిన హరి హర కృష్ణ .. ఆ ప్రకారం ఐడియాలను అమలు చేశారు. సాధారణంగా హరి హరకృష్ణ క్రైమ్ సినిమాలు ఎక్కువగా చూస్తూంటాడు.
విక్రమ్ సినిమాలో మర్డర్ సీన్ చూసి ఇన్ స్పయిర్ అయిన హరి హరకృష్ణ
ఇటీవల విక్రమ్ అనే సినిమా చూసిన హరిహర కృష్ణ అందులో చూపించిన హత్యల్ని చూసి బాగా ఇన్ స్పయిర్ అయినట్లుగా గుర్తించారు. విక్రమ్ సిమిమా చూసి హత్య చేసి నట్టు పోలీసులకి వెల్లడించాడు హరి హర కృష్ణ . విక్రమ్ సినిమాలో సీన్లలో ఒక మనిషిని చంపి తలని శరీర భాగలని తొలగించిన సీన్ గురించి వివరించాడు. సాక్ష్యాలు లేకుండా చేయడానికి శరీర భాగాలను సంచిలో వేసికోని వెళ్లి..ప్లాన్ ప్రకారం తగుల పెట్టినట్లుగా హరకృష్ణ పోలీసులకు వివరించారు. నవీన్ హత్య కేసులో హరిహర కృష్ట స్నేహితులు సహాయం తీసుకున్నట్టు వెల్లడయినట్లుగా తెలుస్తోంది. హత్యకు ముందు హత్యకు తర్వాత ఎక్కువ సార్లు ఫోన్స్ చేసి మాట్లాడాడు. కాల్ రికార్డ్స్ ..వాట్సాప్ ఆధారం గా స్నేహితుల లిస్ట్ తయారు చేశారు పోలీసులు.
హత్య విషయాలన్ని స్నేహితులకు ముందే చెప్పిన నిందితుడు - లిస్టవుట్ చేసిన పోలీసులు
హత్య విషయంలో ఎంత మంది ప్రత్యక్షంగా పాల్గొన్నారో పోలీసులు ఇంకా గుర్తించలేదు. హరిహరకృష్ణ తప్పి మరొకరు పాల్గొన్నారన్నదానికి ఆధారాలు దొరకలేదు. అయితే హత్య విషయంలో ఇతర స్నేహితుల ప్రమేయం ఉందని.. చాలా మంది స్నేహితులకు తన ప్లాన్ చెప్పి సలహాలు తీసుకున్నారన్న అభిప్రాయం వినిపిస్తోంది. ఈ స్నహితుల్ని విచారిస్తే మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. మరో వైపు ... హరిహరకృష్ణ, నవీన్ లతో సన్నిహితంగా ఉన్న అమ్మాయి ని ప్రశ్నించేందుకు పోలీసులు చేస్తున్న ప్రయత్నాలు విఫలమవుతున్నాయి. తాను ఆత్మహత్య చేసుకుంటానని ఆ అమ్మాయి బెదిరిస్తోందని పోలీసులు చెబుతున్నారు. సున్నితమైన విషయం కావడంతో.. పోలీసులు సంయమనంతో వ్యవహరిస్తున్నట్లుగా తెలుస్తోంది.
కనీస పశ్చాత్తపమే లేదని ఆశ్చర్యపోతున్న పోలీసులు
ఇంత జరిగినా నిందితుడు హరి హరకృష్ణలో ఏ మాత్రం పశ్చాత్పం లేదని పోలీసులు ఆశ్చర్యపోతున్నారు. తాను తప్పు చేశాననే భావనకు కూడా రావడంలేదని.. పైగా విచారణకు సహకరించకుండా.. దుందుడుకుగా వ్యవహరిస్తున్నారని పోలీసు వర్గాలు చెబుతున్నాయి.