అన్వేషించండి

Kidney Scam: డబ్బులిస్తామని ఆశ చూపి కిడ్నీ కొట్టేశారు - పోలీసులను ఆశ్రయించిన బాధితుడు, వెలుగు చూసిన కిడ్నీ రాకెట్ ముఠా మోసం

Andhrapradesh News: విజయవాడలో మరోసారి కిడ్నీ రాకెట్ మోసం వెలుగుచూసింది. డబ్బులిస్తామని చెప్పి తన కిడ్నీతీసుకుని మోసం చేశారని ఓ వ్యక్తి గుంటూరు ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశాడు.

Kidney Rocket Scam In Vijayawada: ఓ వ్యక్తి ఆర్థిక ఇబ్బందులను ఆసరాగా చేసుకున్న కిడ్నీ రాకెట్ ముఠా సభ్యులు డబ్బు ఆశ చూపి అతని నుంచి కిడ్నీ కొట్టేశారు. అనంతరం డబ్బులివ్వకుండా మోసం చేశారు. ఈ వ్యవహారంపై బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. అసలు విషయం వెలుగుచూసింది. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. గుంటూరుకు (Guntur) చెందిన మధుబాబు ఆర్థికంగా ఇబ్బందులు పడుతుండగా.. అప్పుల్లో కూరుకుపోయాడు. చివరకు లోన్ యాప్స్ నుంచి సైతం అప్పులు తీసుకున్నాడు. ఏదో విధంగా అప్పులు తీర్చేయాలని భావించాడు. ఈ క్రమంలో ఒకసారి ఫేస్ బుక్‌లో కిడ్నీ దానం చేస్తే డబ్బులు ఇస్తామన్న పోస్ట్ చూశాడు. తనకు డబ్బులు అవసరమని కిడ్నీ ఇచ్చేందుకు తాను సిద్దంగా ఉన్నానని వారిని సంప్రదించాడు.

వెంటనే బాషా అనే వ్యక్తి లైన్‌లోకి వచ్చాడు... తాను కూడా డబ్బులు అవసరమై కిడ్నీ ఇచ్చానని ... అందుకు బదులుగా రూ.30 లక్షలు ఇచ్చారని చెప్పాడు. దీంతో ఆశపడిన మధుబాబు విజయవాడ వెళ్లి భాషాను కలిశాడు. అతను వెంకట్‌ను పరిచయం‌ చేశాడు... తన బావ కిడ్నీ వ్యాదితో బాధ పడుతున్నాడని చెప్పిన వెంకట్..  కిడ్నీ ఇస్తే రూ.30 లక్షలు ఇస్తానని ఒప్పందం చేసుకున్నాడు. అనంతరం ఈ నెల మొదటి వారంలో విజయవాడలోని ఓ ఆస్పత్రిలో ఆపరేషన్ చేసి కిడ్నీతీసుకున్నారు.

రికార్డులు మార్చి..

కిడ్నీని రక్త సంబంధీకులు లేదా బందువులు మాత్రమే ఇవ్వాలని రూల్స్‌ ఉండడంతో రికార్డులు మార్చి మధుబాబును బంధువుగా చూపారు. ఈ నెల మొదటి వారంలో విజయవాడలోని ఓ ఆస్పత్రిలో ఆపరేషన్ చేశారు. లెఫ్ట్ కిడ్నీ తీసుకుంటానని చెప్పి రైట్ కిడ్నీ తీసుకున్నారని బాధితుడు తెలిపారు. ఆపరేషన్ జరిగి ఇంతకాలం అయినా డబ్బు ఇవ్వకపోవడంతో మధుబాబు తీవ్ర ఆందోళనకు గురయ్యాడు. ఒప్పందం ప్రకారం రూ.30 లక్షలు ఇవ్వాల్సి ఉండగా.. కేవలం రూ.1.10 లక్షలు మాత్రమే ఇచ్చారు. మిగిలిన డబ్బులు అడుగుతుంటే తనను బెదిరించారని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. 'మిగిలిన డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదని.. స్నేహితుడిలా కిడ్నీ దానం చేశావ్' అంటూ సదరు ముఠా సభ్యులు బెదిరిస్తున్నారని వాపోయాడు. 

ఎస్పీకి ఫిర్యాదు

తాను మోసపోయానని గ్రహించిన బాధితుడు మధుబాబు గుంటూరు ఎస్పీని అశ్రయించారు. తన ఆర్థిక ఇబ్బందులను అవకాశంగా మార్చుకొని తన కిడ్నీ తీసుకున్నారని ఫిర్యాదు చేశారు. కిడ్నీ కోల్పోయిన తర్వాత తన జీవితం మరింత దుర్భరంగా మారిందని.. శక్తి లేకుండా పోయిందని... ఏ పనీ చేయలేక పోతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. తనను మోసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు.

Also Read: Eluru News: ఏలూరులో ఘోర రోడ్డు ప్రమాదం- నలుగురి మృతి- ఓ బాలుడి పరిస్థితి విషమం

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana: 20-25 ఎకరాలలో ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ స్కూల్స్‌ నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం
20-25 ఎకరాలలో ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ స్కూల్స్‌ నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం
Secunderabad To Goa Train: హైదరాబాద్ నుంచి గోవా వెళ్లేవారికి గుడ్ న్యూస్- కొత్త రైలు ప్రారంభించిన కిషన్ రెడ్డి
హైదరాబాద్ నుంచి గోవా వెళ్లేవారికి గుడ్ న్యూస్- కొత్త రైలు ప్రారంభించిన కిషన్ రెడ్డి
Prakash Raj: డిప్యూటీ సీఎం అంటే ఉదయనిధి స్టాలిన్‌లా ఉండాలి - పవన్ కళ్యాణ్‌కు ప్రకాష్ రాజ్ మరో కౌంటర్
డిప్యూటీ సీఎం అంటే ఉదయనిధి స్టాలిన్‌లా ఉండాలి - పవన్ కళ్యాణ్‌కు ప్రకాష్ రాజ్ మరో కౌంటర్
Sobhita Dhulipala: సమంత నా సోల్‌మేట్‌ - నాగార్జునకు కాబోయే కోడలు శోభితా ధూళిపాళ కామెంట్స్ వైరల్!
సమంత నా సోల్‌మేట్‌ - నాగార్జునకు కాబోయే కోడలు శోభితా ధూళిపాళ కామెంట్స్ వైరల్!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Prakash Raj Counters Pawan Kalyan | తమిళనాడులో పవన్ కళ్యాణ్ పరువు తీసిన ప్రకాశ్ రాజ్ | ABP Desamపసిపాపకి పాలు పట్టేందుకు అవస్థలు పడుతున్న తల్లిNirmal Man Returned from Kuwait: కువైట్‌లో గోట్‌లైఫ్ బతుకు! ఒక్క పోస్ట్‌తో సేఫ్‌గా సొంతూరికిRajendra Prasad: నటుడు రాజేంద్ర ప్రసాద్ ఇంట్లో విషాదం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana: 20-25 ఎకరాలలో ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ స్కూల్స్‌ నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం
20-25 ఎకరాలలో ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ స్కూల్స్‌ నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం
Secunderabad To Goa Train: హైదరాబాద్ నుంచి గోవా వెళ్లేవారికి గుడ్ న్యూస్- కొత్త రైలు ప్రారంభించిన కిషన్ రెడ్డి
హైదరాబాద్ నుంచి గోవా వెళ్లేవారికి గుడ్ న్యూస్- కొత్త రైలు ప్రారంభించిన కిషన్ రెడ్డి
Prakash Raj: డిప్యూటీ సీఎం అంటే ఉదయనిధి స్టాలిన్‌లా ఉండాలి - పవన్ కళ్యాణ్‌కు ప్రకాష్ రాజ్ మరో కౌంటర్
డిప్యూటీ సీఎం అంటే ఉదయనిధి స్టాలిన్‌లా ఉండాలి - పవన్ కళ్యాణ్‌కు ప్రకాష్ రాజ్ మరో కౌంటర్
Sobhita Dhulipala: సమంత నా సోల్‌మేట్‌ - నాగార్జునకు కాబోయే కోడలు శోభితా ధూళిపాళ కామెంట్స్ వైరల్!
సమంత నా సోల్‌మేట్‌ - నాగార్జునకు కాబోయే కోడలు శోభితా ధూళిపాళ కామెంట్స్ వైరల్!
Revanth Reddy : వైఎస్, కేసీఆర్ చేతకాక వదిలేశారు - రేవంత్‌కూ ఎన్నో సమస్యలు - సాధించగలరా  ?
వైఎస్, కేసీఆర్ చేతకాక వదిలేశారు - రేవంత్‌కూ ఎన్నో సమస్యలు - సాధించగలరా ?
AP Politics: క్రిస్టియన్ తో పెళ్లి, హిందూ మతం పేరుతో రాజకీయాలా?- పవన్ కళ్యాణ్‌పై గోరంట్ల మాధవ్ ఫైర్
క్రిస్టియన్ తో పెళ్లి, హిందూ మతం పేరుతో రాజకీయాలా?- పవన్ కళ్యాణ్‌పై గోరంట్ల మాధవ్ ఫైర్
Viswam Trailer: యాక్షన్, ఫన్‌తో నిండిపోయిన ‘విశ్వం’ ట్రైలర్ - బ్లాక్‌బస్టర్ వైబ్స్ కనిపిస్తున్నాయా?
యాక్షన్, ఫన్‌తో నిండిపోయిన ‘విశ్వం’ ట్రైలర్ - బ్లాక్‌బస్టర్ వైబ్స్ కనిపిస్తున్నాయా?
Israel Strikes Beirut: లెబనాన్‌పై ఇజ్రాయెల్ బాంబుల వర్షం - ప్రాణాలు దక్కాలంటే పారిపోవాలని ప్రజలకు వార్నింగ్
లెబనాన్‌పై ఇజ్రాయెల్ బాంబుల వర్షం - ప్రాణాలు దక్కాలంటే పారిపోవాలని ప్రజలకు వార్నింగ్
Embed widget