అన్వేషించండి

Goa News: దొంగల నయా ట్రెండ్- ఇల్లంతా దోచేసి, లవ్ లెటర్ రాసి పరార్!

Goa News: గోవాలో జరిగిన ఓ దొంగతనం కేసులో దొంగలు వ్యవహరించిన తీరు అవాక్కయ్యేలా చేసింది. ఇల్లంతా దోచేసిన దొంగలు.. యజమానికి ఓ లవ్ లెటర్ రాసి పరారయ్యారు.

Goa News: కాలంతో పాటు ప్రతి ఒక్కరు ట్రెండ్ మారుస్తున్నారు. ఈ మధ్య దొంగలు కూడా చేసే దొంగతనాల్లో వైవిధ్యం, ట్రెండ్ పాటిస్తున్నారు. కొత్తకొత్తగా దొంగతనాలు చేస్తూ పోలీసులకే చుక్కలు చూపిస్తున్నారు. ఇలా కూడా దొంగతనం చేయొచ్చానని అవాక్కయ్యేలా చేస్తున్నారు. తాజాగా గోవాలో కూడా దొంగలు ఇలానే షాకిచ్చారు. 

అసలేమైందంటే?

గోవా మార్గోవో పట్టణంలో ఓ ఇంట్లో దొంగలు పడ్డారు. లక్షల విలువైన బంగారు ఆభరణాలు, వస్తువులు చోరీ చేశారు. ఇంతవరకు బాగానే ఉంది.. అయితే అనంతరం అక్కడ 'ఐ లవ్ యూ' అని రాశారు. అసిబ్ జెక్‌ అనే వ్యక్తి తన సోదరుడి పెళ్లి ఉండటంతో మంగళవారం వివాహ విందు ఏర్పాటు చేశారు. దీంతో ఆ ఇంటి వారంతా రిసెప్షన్‌ జరిగే ఫంక్షన్‌ హాల్‌కు వెళ్లారు. తర్వాత మధ్యాహ్నం 1 గంటకు తిరిగి ఇంటికి చేరుకున్నారు

అయితే ఇంట్లో వస్తువులు చిందర వందరగా పడి ఉండటంతో దొంగతనం జరిగిందని గ్రహించారు. బాత్‌ రూమ్‌ కిటికీ గ్రిల్‌ తొలగించి ఉండటంతో దొంగలు అక్కడి నుంచి ఇంట్లోకి చొరబడినట్లు తెలుసుకున్నారు. మొత్తం రూ.20 లక్షల విలువైన బంగారు ఆభరణాలు, రూ.1.5 లక్షల నగదు చోరీ అయినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అలాగే చోరీ అనంతరం దొంగలు ఆ ఇంట్లోని టీవీ సెట్‌పై 'ఐ లవ్ యూ' అని మార్కర్‌తో రాసినట్లు పోలీసులకు చెప్పారు.

దొంగతనం జరిగిన ఇంటిని పరిశీలించారు పోలీసులు. డాగ్‌ స్క్వాడ్‌, ఫింగర్‌ ప్రింట్‌ నిఫుణులను రప్పించి ఆధారాలు సేకరించారు. అయితే ఈ వార్త చూసిన నెటిజన్లు కూడా దొంగల ట్రెండ్ చూసి అవాక్కవుతున్నారు.

ఇటీవల దొంగలు చేస్తున్న పనులు చాలా కామెడీగా ఉంటున్నాయి. ఇటీవల ఓ రాష్ట్రంలో ఏకంగా ఇరిగేషన్‌ అధికారులమని చెప్పి బ్రిడ్జ్‌నే ఎత్తుకుపోయారు కొందరు దొంగలు. మొన్నటికి మొన్న ఓ దొంగ కిరాణాషాపుకి వచ్చి దోచుకెళ్దాం అనుకుంటే అక్కడ ఏమిలేక పోయేసరికి ఆవేదనతో ఆ షాపు ఓనర్‌కి ఓ లెటర్‌ రాసి వెళ్లిపోయాడు. అలానే ఇక్కడొక దొంగ ఇల్లంతా దోచేసి చివర్లో యజమానికి ప్రేమలేఖ రాశాడు. ఇది చూసి షాకైన ఇంటి యజమాని.. మొత్తం డబ్బు, నగలు పోయాయని ఆవేదన వ్యక్తం చేశాడు. పోలీసులు వెంటనే దొంగలను పట్టుకోవాలని కోరాడు.

Also Read: Baramulla Encounter: జమ్ముకశ్మీర్‌లో ఎన్‌కౌంటర్- ముగ్గురు పాక్ ఉగ్రవాదులు హతం

Also Read: Hardik Patel: భాజపాలో చేరడం ఓ ఆప్షన్- కాంగ్రెస్ కన్నా ఆప్ బెస్ట్: హార్దిక్ పటేల్

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

YS Sharmila: అదాని, మోదీలంటే చంద్రబాబుకు భయం - గవర్నర్‌కు షర్మిల ఫిర్యాదు
అదాని, మోదీలంటే చంద్రబాబుకు భయం - గవర్నర్‌కు షర్మిల ఫిర్యాదు
Telangana Adani Investments: కేసీఆర్ హయాంలోనే అదానీతో ఒప్పందాలు, పెట్టుబడులు - అధారాలు రిలీజ్ చేసిన కాంగ్రెస్
కేసీఆర్ హయాంలోనే అదానీతో ఒప్పందాలు, పెట్టుబడులు - అధారాలు రిలీజ్ చేసిన కాంగ్రెస్
Bajaj Platina vs Honda Shine: బజాజ్ ప్లాటినా వర్సెస్ హోండా షైన్ - ఏది ఎక్కువ మైలేజీని ఇస్తుంది? - రెండిట్లో ఏది బెస్ట్?
బజాజ్ ప్లాటినా వర్సెస్ హోండా షైన్ - ఏది ఎక్కువ మైలేజీని ఇస్తుంది? - రెండిట్లో ఏది బెస్ట్?
CM Chandrababu: సభ్యత్వ నమోదులో టాప్ 10 నేతలకు చంద్రబాబు అభినందన, మంత్రి లోకేష్‌కు ప్రత్యేకంగా
సభ్యత్వ నమోదులో టాప్ 10 నేతలకు చంద్రబాబు అభినందన, మంత్రి లోకేష్‌కు ప్రత్యేకంగా
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

గ్రామస్థుల భారీ ఆందోళన రోడ్డుపైనే వంట.. RDO నిర్బంధం!హైవే పక్కనే పెద్దపులి తిష్ట, జడుసుకున్న వాహనదారులుఇంకా చల్లారని  రాకాసి మంటలు, కుప్పకూలిపోయిన భవనంజీడిమెట్లలో భారీ అగ్ని ప్రమాదం, ఆ తప్పు వల్లే దట్టంగా మంటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Sharmila: అదాని, మోదీలంటే చంద్రబాబుకు భయం - గవర్నర్‌కు షర్మిల ఫిర్యాదు
అదాని, మోదీలంటే చంద్రబాబుకు భయం - గవర్నర్‌కు షర్మిల ఫిర్యాదు
Telangana Adani Investments: కేసీఆర్ హయాంలోనే అదానీతో ఒప్పందాలు, పెట్టుబడులు - అధారాలు రిలీజ్ చేసిన కాంగ్రెస్
కేసీఆర్ హయాంలోనే అదానీతో ఒప్పందాలు, పెట్టుబడులు - అధారాలు రిలీజ్ చేసిన కాంగ్రెస్
Bajaj Platina vs Honda Shine: బజాజ్ ప్లాటినా వర్సెస్ హోండా షైన్ - ఏది ఎక్కువ మైలేజీని ఇస్తుంది? - రెండిట్లో ఏది బెస్ట్?
బజాజ్ ప్లాటినా వర్సెస్ హోండా షైన్ - ఏది ఎక్కువ మైలేజీని ఇస్తుంది? - రెండిట్లో ఏది బెస్ట్?
CM Chandrababu: సభ్యత్వ నమోదులో టాప్ 10 నేతలకు చంద్రబాబు అభినందన, మంత్రి లోకేష్‌కు ప్రత్యేకంగా
సభ్యత్వ నమోదులో టాప్ 10 నేతలకు చంద్రబాబు అభినందన, మంత్రి లోకేష్‌కు ప్రత్యేకంగా
PAN Card Vs PAN 2.0: పాన్ కార్డు వర్సెస్ పాన్ 2.0 - రెండిటి మధ్య తేడా ఏంటి? - కొత్త కార్డు వల్ల లాభాలేంటి?
పాన్ కార్డు వర్సెస్ పాన్ 2.0 - రెండిటి మధ్య తేడా ఏంటి? - కొత్త కార్డు వల్ల లాభాలేంటి?
Maharastra: నా వల్లనే ప్రాబ్లం అయితే సీఎం పదవి అక్కర్లేదు - ప్రధానికి చెప్పానన్న షిండే - వీడనున్న మహా చిక్కుముడి !
నా వల్లనే ప్రాబ్లం అయితే సీఎం పదవి అక్కర్లేదు - ప్రధానికి చెప్పానన్న షిండే - వీడనున్న మహా చిక్కుముడి !
Dilawarpur Latest News: ఇథనాల్‌ పరిశ్రమ వివాదంలో బిగ్‌ అప్‌డేట్‌- పనులు ఆపాలని కలెక్టర్ ఆదేశం- ప్రభుత్వానికి కీలక నివేదిక
ఇథనాల్‌ పరిశ్రమ వివాదంలో బిగ్‌ అప్‌డేట్‌- పనులు ఆపాలని కలెక్టర్ ఆదేశం- ప్రభుత్వానికి కీలక నివేదిక
Vizag News: విశాఖ జిల్లా పరవాడ ఫార్మాసిటీలో ప్రమాదం- ఒకరు మృతి- విషయాన్ని దాచి పెట్టిన యాజమాన్యం
విశాఖ జిల్లా పరవాడ ఫార్మాసిటీలో ప్రమాదం- ఒకరు మృతి- విషయాన్ని దాచి పెట్టిన యాజమాన్యం
Embed widget