Bapatla News: బాపట్ల జిల్లాలో విషాదం - బీచ్‌లో నలుగురు యువకులు గల్లంతు, ఇద్దరు మృతి
Andhrapradesh News: బాపట్ల జిల్లా రామాపురం సముద్ర తీరంలో ఆదివారం నలుగురు యువకులు గల్లంతు కాగా.. ఇద్దరు మృతి చెందారు. కాగా, 2 రోజుల క్రితం ఇదే బీచ్‌లో నలుగురు యువకులు ప్రాణాలు కోల్పోయారు.
![Bapatla News: బాపట్ల జిల్లాలో విషాదం - బీచ్‌లో నలుగురు యువకులు గల్లంతు, ఇద్దరు మృతి four young people missing in ramapuram beach and two died in bapatla districts latest news Bapatla News: బాపట్ల జిల్లాలో విషాదం - బీచ్‌లో నలుగురు యువకులు గల్లంతు, ఇద్దరు మృతి](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/23/1663e40ebf1dba0a8a36b451b4e58d2d1719139085441876_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Four Young People Missing In Ramapuram Beach In Bapatla District: బాపట్ల (Bapatla) జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. వేటపాలెం మండలం రామాపురం బీచ్‌లో (Ramapuram Beach) నలుగురు యువకులు గల్లంతయ్యారు. వీకెండ్ కావడంతో మంగళగిరి నుంచి రామాపురం బీచ్‌కు 12 మంది యువకులు సరదాగా వచ్చారు. ఈ క్రమంలో సముద్రంలో స్నానానికి దిగగా.. నలుగురు యువకులు గల్లంతయ్యారు. వీరిని గమనించిన తోటి స్నేహితులు ఇద్దరిని కాపాడగా.. ఇద్దరు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వారిని స్థానికంగా ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాలను పరిశీలించారు. మృతులు బాలనాగేశ్వరరావు (27), బాలసాయిగా (26) గుర్తించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బీచ్‌కు వచ్చే వారు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
2 రోజుల క్రితమే..
కాగా, ఈ నెల 21న (శుక్రవారం) ఇదే రామాపురం సముద్ర తీరంలో నలుగురు యువకులు గల్లంతయ్యారు. సముద్రంలో స్నానానికి వెళ్లిన యువకులు ప్రమాదవశాత్తు గల్లంతై ప్రాణాలు కోల్పోయారు. మెరైన్ సిబ్బంది, పోలీసులు మృతదేహాలను వెలికితీశారు. వీరంతా ఏలూరు జిల్లా దుగ్గిరాలకు చెందిన వారిగా గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే, రోజుల వ్యవధిలోనే ఇలాంటి ఘటనలు జరగడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. బీచ్‌కు వచ్చి సముద్రంలో స్నానానికి దిగే వారు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)