(Source: Poll of Polls)
Crime News: గోదావరిలో స్నానానికి దిగి ఐదుగురు హైదరాబాద్ యువకుల మృతి, మంత్రి పొన్నం ప్రభాకర్ దిగ్భ్రాంతి
Telangana News | బాసర వద్ద గోదావరిలో స్నానానికి దిగి ఐదుగురు హైదరాబాద్ యువకుల మృతిచెందారు. ఈ విషాద ఘటనపై మంత్రి పొన్నం ప్రభాకర్ దిగ్భ్రాంతి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

Basara Crime News | ముథోల్: నిర్మల్ జిల్లా బాసరలో గోదావరిలో స్నానానికి దిగి ఐదుగురు యువకులు మృతి చెందారు. ఒకే కుటుంబానికి చెందిన వారు కావడంతో తీవ్ర విషాదం నెలకొంది. ఈ ఘటనపై తెలంగాణ ప్రభుత్వం స్పందించింది.
నిర్మల్ జిల్లా బాసర వద్ద గోదావరి నదిలో స్నానం చేస్తూ ఐదుగురు యువకుల మృతి చెందడం పట్ల తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర ద్రిగ్బాంతి వ్యక్తం చేశారు. హైదరాబాద్ లోని దిల్ సుఖ్ నగర్ కి ఓ చెందిన కుటుంబం బాసర (Basara) సరస్వతి అమ్మవారి దర్శనానికి వచ్చి ఆదివారం (జూన్ 15న) ఉదయం గోదావరి లో స్నానానికి వెళ్ళి ఐదుగురు యువకులు గల్లంతై మృతి చెందారని సమాచారం తీవ్రంగా కలిచివేసిందన్నారు మంత్రి పొన్నం. ప్రాజెక్ట్ ల వద్దకు నదుల వద్దకు వెళ్ళినప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు.
వరుస విషాదాలు.. తల్లిదండ్రులు పట్టించుకోవాలని సూచనలు
ఇటీవల జనవరిలో కొండపోచమ్మ సాగర్ లో ఐదుగురు యువకులు, వారం రోజుల క్రితం మేడిగడ్డ ప్రాజెక్ట్ లో పడి ఆరుగురు యువకులు మృతి చెందరు. ఇలాంటి ఘటనలు జరగకుండా తల్లిదండ్రులు వారి పిల్లలను నదులు ,కాలువలు ప్రాజెక్ట్ ల వద్దకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రాజెక్ట్ ల ,కాలువల వద్ద లోతు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో హెచ్చరిక బోర్డు లు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. రేపటి మంచి భవిష్యత్ కలిగిన యువకులు ఇలా చనిపోవడం బాధాకరమని వారి కుటుంబానికి దైర్యం ప్రసాదించాలని ఆ దేవుడిని వేడుకున్నారు. బాసర గోదావరి నదిలో మృతి చెందిన ఐదుగురు యువకులకు సంతాపాన్ని వ్యక్తం చేశారు. వారి కుటుంబానికి మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.
కంచ ఐలయ్య సోదరుడి మృతికి సంతాపం
కంచ ఐలయ్య సోదరుడు కంచ కట్టయ్య ఆకస్మిక మృతిపై మంత్రి పొన్నం ప్రభాకర్ దిగ్భ్రాంతికి లోనయ్యారు. ఈ కష్ట సమయంలో వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఆ పరమాత్మ ఆయన ఆత్మకు శాంతి చేకూర్చి, మీ కుటుంబ సభ్యులకు ఈ విషాదాన్ని తట్టుకునే ధైర్యాన్ని ప్రసాదించాలని ప్రార్థించారు. ఈ సందర్భంగా మేమంతా మీ పక్కన ఉన్నామని, మరొక్కసారి మీ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ పొన్నం ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు.
కంచ ఐలయ్య గారి సోదరుడు శ్రీ కంచ కట్టయ్య గారి ఆకస్మిక మరణ వార్త విని తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యాను.
— Ponnam Prabhakar (@Ponnam_INC) June 15, 2025
ఈ కష్టం సమయంలో మీ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. ఆ పరమాత్మ ఆయన ఆత్మకు శాంతి చేకూర్చి, మీ కుటుంబ సభ్యులకు ఈ విషాదాన్ని తట్టుకునే ధైర్యాన్ని ప్రసాదించాలని… pic.twitter.com/5iYEi1InoZ






















