Jaggayyapet Accident: జగ్గయ్యపేటలో ఘోర ప్రమాదం, ఆర్నెల్ల పాప సహా ఐదుగురు మృతి
Jangareddygudem: జంగారెడ్డి గూడెంలో జరిగే శుభకార్యానికి హాజరయ్యేందుకు హైదరాబాద్ నుంచి ఫ్యామిలీ వెళ్తుండగా, జగ్గయ్యపేట వద్ద కారు అదుపు తప్పింది.
Jaggayyapet: కృష్ణా జిల్లా జగ్గయ్యపేట (Jaggayyapet) మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గౌరవరం సమీపంలో అదుపు తప్పి కారు కల్వర్టును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో నెలల వయసున్న చిన్నారి సహా మొత్తం ఐదుగురు వ్యక్తులు చనిపోయారు. అక్కడికక్కడే ముగ్గురు చనిపోగా.. జగ్గయ్యపేట ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరొక ఇద్దరు మరణించారు. గాయాలు అయిన వారిని స్థానికులు దగ్గర్లో ఉన్న ఆస్పత్రికి హుటాహుటిన తరలించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నారు.
పశ్చిమ గోదావరి జిల్లా (West Godavari District) జంగారెడ్డి గూడెంలో (Jangareddygudem) జరిగే శుభకార్యానికి హాజరయ్యేందుకు హైదరాబాద్ నుంచి ఫ్యామిలీ వెళ్తుండగా, ఓవర్ స్పీడ్‌తో కారు అదుపు తప్పింది. కారు కల్వర్టును ఢీ కొట్టగా వారిలో అన్నాచెల్లెలు, మేనకోడలు ఉన్నారు. హైదరాబాద్ జీహెచ్ఎంసీలో పనిచేస్తున్న జోషి తన మేనకోడలు ప్రిన్సి అన్నప్రాసన కోసం హైదరాబాద్ నుంచి టీఎస్ 07 జేబీ 1940 కారులో ఏలూరు వెళుతుండగా అతి వేగంతో గౌరవరం వద్ద కల్వర్టును ఢీకొట్టింది. మృతులు పాప- ప్రిన్సి, తాత- కుటుంబరావు, తల్లి- శాంతి, మేనత్త- ఇందిర, నానమ్మ-మేరీ చనిపోయారు. మరో వ్యక్తి జోషి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Andhra Pradesh | Five people including a 6-months old girl died in a road accident in Jaggayyapet in Krishna district as their car hit a culvert. 4 of them died on the spot & 1 person died while being taken to the hospital. Another person is in critical condition in the hospital
— ANI (@ANI) March 13, 2022
ఖైరతాబాద్ ఫ్లైఓవర్‌పై కారు ప్రమాదం ఖైరతాబాద్ ఫ్లై ఓవర్‌పై ఆదివారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. అత్యధిక వేగంతో వెళ్తున్న ఓ కారు నియంత్రణ తప్పి రోడ్డు మధ్యలో ఉన్న డివైడర్‌ను ఢీ కొట్టింది. వెంటనే కారులో ఉన్న ఎయిర్ బెలూన్స్ తెరుచుకోవడంతో అందులో ఉన్నవారికి పెద్దగా గాయాలు కాలేదు. కారు ఐమాక్స్ థియేటర్ నుంచి పంజాగుట్ట వైపు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది.
సూర్యాపేటలో మరో ప్రమాదం
సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలంలో మరో రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికంగా ఉన్న అభయాంజనేయ స్వామి ఆలయ సమీపంలో బైక్‌పై వెళ్తున్న దంపతులను లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో భార్య అక్కడికక్కడే చనిపోగా భర్తకు తీవ్ర గాయాలు అయ్యాయి. బాధితుడిని స్థానికులు దగ్గర్లో ఉన్న ఆస్పత్రికి తీసుకెళ్లారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించి కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నారు.