By: ABP Desam | Updated at : 02 Oct 2021 12:44 PM (IST)
Edited By: Rajasekhara
అనంతపురం జిల్లాలో బిడ్డను చంపిన తండ్రి
రెండేళ్ల బిడ్డకు బుడిబుడి నడకలు.. గలగల మాటలు నేర్పే తండ్రులను చూసి ఉంటాం కానీ చేజేతులా బండకేసి కొట్టి చంపేవాళ్లు ఉంటారా ?. అనుమానం పెనుభూతమైన .. దానికి మద్యంమత్తు తోడైతే అలాంటి రాక్షసులు తయారవుతారు. అనంతపురం జిల్లా మడకశిరలో తన రెండేళ్ల బిడ్డను మద్యం మత్తులో చేజేతులా నేలకేసి కొట్టి చంపాడు ఓ తండ్రి. దానికి కారణం ఆ బిడ్డ తనకు పుట్టలేదన్న అనుమానం. పాప పుట్టినప్పటి నుండి ఆ అనుమానాన్ని అలా పెంచుకుని పెంచుకుని అభం.. శుభం తెలియని పాప ప్రాణాలను తీసేశాడు.
Also Read : అధిక వడ్డీ పేరుతో కుచ్చుటోపీ.. రూ.50 కోట్ల వరకు వసూలు.. జగిత్యాలలో ఓ వ్యాపారి మోసం..
అనంతపురం జిల్లా మడకశిర ప్రాంతంలో శివ, రెడ్డెమ్మ నివసిస్తున్నారు. ఇద్దరూ కూలి పని చేసుకుంటూ ఉంటారు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. వీరిలో బాబుకు నాలుగేళ్లు కాగా పాపకు రెండేళ్లు. అయితే బాబుతో పోలిస్తే పాప కాస్త నల్లగా ఉంటుంది. దీంతో శివ పాప పుట్టినప్పటి నుండి ఆ పాప తనకు పుట్టలేదని భార్యతో గొడవపడేవాడు. పాపను అసహ్యించుకునేవాడు. అప్పుడప్పుడూ హింసించేవాడు. దగ్గరకు తీసేవాడు కాదు. కానీ ముందు ముందు తెలుసుకుంటాడులే అని ఆ తల్లి అనుకునేది.
Also Read: వరంగల్ రేప్ కేసులో టీఆర్ఎస్ లీడర్ భర్త.. అరెస్టు చేసిన పోలీసులు
అయితే రెండు రోజుల కిందట మద్యం మత్తులో ఇంటికి వచ్చిన శివ..భార్య రెడ్డెమ్మతో గొడవ పడ్డాడు. ఆ కోపాన్ని పాప అంజలిపై చూపాడు. ఎత్తి నేలకేసి గట్టిగా కొట్టడంతో తీవ్ర గాయాలయ్యాయి. అయినా పట్టించుకోకుండా నిద్రపోయాడు. ఆ తల్లే పాపను హిందూపురం ఆస్పత్రికి తీసుకెళ్లింది. సీరియస్‌గా ఉండటంతో అనంతపురం తీసుకెళ్లాలని సూచించారు. బిడ్డను తీసుకుని ఆమె హిందూపురం ఆస్పత్రికి వెళ్లింది. అయితే అక్కడ చికిత్స పొందుతూ ఆ బిడ్డ చనిపోయింది.
బిడ్డ చనిపోవడంతో పోస్ట్ మార్టం కోసం మార్చురీకి తరలించారు. అయితే ప్రాణంతో లేని బిడ్డను తీసుకెళ్లి అంత్యక్రియలు చేయని అశక్తతో .. మరో కారణమో కానీ ఆమె తల్లి మృతదేహాన్ని తీసుకోకుండానే వెళ్లిపోయింది. పాపను నేలకేసి కొట్టి చనిపోవడానికి కారణమైన తండ్రి అసలు అడ్రస్ లేడు. పోలీసు కేసు అవుతుందన్న ఉద్దేశంతో ఆ తల్లి కూడా పోయిన బిడ్డఎలాగూ తిరిగి రాదన్న కారణంతో వెళ్లిపోయిందని భావిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Also Read: గుప్త నిధుల పేరుతో మోసం.. చివరకు హత్య.. నెల్లూరులో దారుణం..
IB Official Dies: శిల్పకళా వేదికలో విషాదం, ఉపరాష్ట్రపతి ఈవెంట్ స్టేజీ వేదికపై నుంచి పడి ఐబీ అధికారి మృతి
Crime News: ఎలాంటి పరీక్షలు, ప్రాక్టికల్స్ లేకుండా 3 లక్షలకే బీటెక్ సర్టిఫికెట్
Tractor overturned: వరంగల్ జిల్లాలో విషాదం, పెళ్లి బట్టల షాపింగ్కు వెళ్తూ మృత్యుఒడికి - ట్రాక్టర్ బోల్తాపడి ఐదుగురి మృతి
Wall Collapse in Gujarat: ఉప్పు ఫ్యాక్టరీలో ఘోర ప్రమాదం- గోడ కూలి 12 మంది మృతి!
Hyderabad Crime : గర్ల్ ఫ్రెండ్ కి హాయ్ చెప్పాడని కత్తితో దాడిచేసిన బాలుడు, రక్తం కారుతుంటే సెల్ఫీ!
Bojjala Brother Dies: మాజీ మంత్రి బొజ్జల కర్మక్రియల రోజే మరో విషాదం - ఆయన సోదరుడు కన్నుమూత
LSG vs KKR: తొలి వికెట్కు 210*! ఐపీఎల్ చరిత్రలో తొలిసారి 20 ఓవర్లు ఆడేసిన రాహుల్, డికాక్
Liquor Price Telangana: మందుబాబులకు తెలంగాణ సర్కారు భారీ షాక్ - ఓ రేంజ్లో పెరిగిన బీర్లు, మద్యం ధరలు
AP Ministers Bus Tour: టీడీపీకి చెక్ పెట్టేందుకు వైఎస్ జగన్ వ్యూహం, మే 26 నుంచి మంత్రుల బస్సు యాత్ర