By: ABP Desam | Updated at : 30 Sep 2021 10:54 PM (IST)
Edited By: sharmiladevir
ప్రతీకాత్మక చిత్రం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరులో గుప్త నిధుల వెదుకులాట కోసం జరిగిన లావాదేవీల్లో ఓ వ్యక్తి హత్యకు గురయ్యాడు. పొదలకూరుకి చెందిన షేక్ రఫీ.. గుప్త నిధుల పేరుతో కొన్నాళ్లుగా స్థానికులను నమ్మించసాగాడు. ఫలానా చోట గుప్తనిధులు ఉన్నాయని, వాటిని తవ్వి తీస్తే జీవితం సెటిల్ అయిపోతుందని పరిచయస్తులకు చెబుతూ వచ్చాడు. స్వతహాగా రఫీ దర్గాలో తాయత్తులు వేసే పనిచేసేవాడు. అతని వాలకం, మాట తీరు చూసి చాలా మంది అతడిని నమ్మారు. గుప్త నిధుల కోసం భారీగా డబ్బు ఖర్చు పెట్టారు. రూ.లక్ష నుంచి రూ.5 లక్షల వరకు అతను చెప్పిన ప్రకారం పూజలు చేసేందుకు, గుప్తనిధుల్ని వెలికి తీసేందుకు ఖర్చుపెట్టేవారు. ఇలా రెండు మూడేళ్లు గడిచాయి. చివరకు రఫీ మోసం గ్రహించిన వారంతా అతడిపై దాడి చేసి హతమార్చారు.
భార్య ఫిర్యాదుతో వెలుగులోకి..
సెప్టెంబర్ 3వ తేదీన గుప్త నిధుల బాబా రఫీ హత్య జరిగింది. హంతకులు శవాన్ని నెల్లూరు బైపాస్ రోడ్డు సమీపంలో పూడ్చివేసి ఏమీ తెలియనట్లు ఉన్నారు. పొదలకూరు పోలీస్ స్టేషన్లో రఫీ కోసం భార్య మిస్సింగ్ కంప్లయింట్ ఇచ్చింది. పోలీసులు తీగలాగడంతో డొంకంతా కదిలింది. రఫీ హత్య వ్యవహారం వెలుగులోకి వచ్చింది.
Also Read: భర్తను కిడ్నాప్ చేయించిన భార్య.. కారణం తెలిసి పోలీసులు షాక్
ఒక్కడే సొమ్మంతా తీసుకుని ఉంటాడని..
గుప్త నిధుల వేట అంటూ రఫీ అప్పుడప్పుడూ తనకు డబ్బులిచ్చిన వారిని వెంటబెట్టుకుని వేర్వేరు ప్రాంతాల్లో తిప్పేవాడని పోలీసులు చెబుతున్నారు. ఈ క్రమంలో క్షుద్రపూజలు చేసి, వారికి నమ్మకం కలిగించేవాడని పేర్కొన్నారు. అయితే రెండేళ్లుగా చెప్పిందే చెబుతుండటంతో వారిలో కొంతమందికి అనుమానం వచ్చింది. నిధులు దొరికాయి కానీ మీరు ఇప్పుడే చూడకూడదంటూ రఫీ కొన్నాళ్లు చెబుతూ వచ్చాడని పోలీసులు తెలిపారు. గుప్త నిధులన్నీ రఫీ తీసుకుని ఉంటాడని వారు అనుమానించారని వెల్లడించారు. చివరకు బెదిరించడం కోసం పొదలకూరు నుంచి నెల్లూరు పిలిపించి నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లారని చెప్పారు.
Also Read: కుళ్లిన స్థితిలో నటి శవం.. గది నుంచి తీవ్ర దుర్వాసన, ఏం జరిగిందంటే..
బెదిరించబోయి.. హత్య..
రఫీని బెదిరించే క్రమంలో కొందరు అతడిపై దాడి చేశారని పోలీసులు తెలిపారు. దీంతో రఫీ చనిపోయాడని పేర్కొన్నారు. శవాన్ని వెలికితీసి పోస్ట్ మార్టంకు పంపినట్లు వెల్లడించారు. రఫీ హత్య కేసులో ముద్దాయిలను త్వరలో అరెస్ట్ చేస్తామని చెప్పారు. గుప్త నిధుల పేరుతో ఇతరులను నమ్మించేందుకు రఫీ చేసిన ప్రయత్నమే అతని హత్యకు కారణమైందని వివరించారు.
Also Read: పని మనిషిపై వంట మనిషి దాష్టీకం.. బలవంతంగా రూంలోకి లాక్కెళ్లి రేప్
Also Read: నిజామాబాద్‌లో యువతిపై గ్యాంగ్.. ఆరుగురు అరెస్టు
Hanamkonda News: సీఐ కొడుకు ర్యాష్ డ్రైవింగ్, స్పాట్లో మహిళ మృతి, షాకింగ్ వీడియో
Andhra News: బ్యాంకులో రూ.4 కోట్ల విలువైన బంగారం మాయం - మహిళా అధికారి ఆత్మహత్య
Visakha Crime: గంజాయి రవాణా చేసేది కొరియర్ బాయ్ లే: విశాఖ సీపీ సంచలన విషయాలు వెల్లడి
Bear Attack in Vizag: ఎలుగు దాడిలో కేర్ టేకర్ మృతి - విశాఖ జూపార్కులో విషాదం
Delhi News: ఇళ్లు శుభ్రం చేయమన్నందుకు భర్త చెవి కొరికిన భార్య - ఢిల్లీలో దారుణ ఘటన
Andhra Telangana Dispute : కేంద్రం అధీనంలోకి సాగర్, శ్రీశైలం డ్యాములు - ఏపీ ప్రభుత్వ దూకుడుతో సాధించిందేంటి ?
Upcoming SUVs in 2024: 2024లో కారు కొనాలనుకుంటున్నారా? - ఈ నాలుగు ఎస్యూవీలు ఎంట్రీ ఇస్తున్నాయి - ఒక్కసారి చూడండి!
KCR On Results: హైరానా వద్దు, 3న సంబరాలు చేసుకుందాం- పార్టీ నేతలకు సీఎం కేసీఆర్ భరోసా
Salaar - Ugramm: 'సలార్' ట్రైలర్ విడుదల తర్వాత కొత్త డౌట్స్ - ప్రశాంత్ నీల్ మోసం చేస్తున్నారా?
/body>