Hyderabad Crime News: హైదరాబాద్‌లో భారీగా డ్రగ్స్ స్వాధీనం, ముగ్గురు విదేశీయులు అరెస్ట్
Telangana Crime News | కాంగ్రెస్ ప్రభుత్వం డ్రగ్స్ పై చర్యలు తీసుకుంటుండగా హైదరాబాద్‌లో కోటిన్నర విలువ చేసే ఎండీఎంఏ డ్రగ్స్ దొరికాయి. ముగ్గురు విదేశీయులను అరెస్ట్ చేశారు.

Drugs seized in Hyderabad | హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం డ్రగ్స్, మత్తు పదార్ధాలపై ఉక్కుపాదం మోపుతోంది. ఈ క్రమంలో హైదరాబాద్‌లో 1300 గ్రాముల డ్రగ్స్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రూ.1.60 కోట్ల విలువైన ఎండీఎంఏను సీజ్ చేసి, డ్రగ్స్ విక్రయించేందుకు ప్రయత్నించిన ముగ్గురు విదేశీయులను పోలీసులు అరెస్టు చేశారు. లంగర్ హౌస్, హుమాయున్ నగర్ పోలీసులతో కలిసి హైదరాబాద్ నార్కోటిక్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్ ఈ జాయింట్ ఆపరేషన్ చేపట్టింది. ఎక్కడైనా డ్రగ్స్, గంజాయి లాంటి మత్తుపదార్థాల గురించి తెలిస్తే, తమకు సమాచారం అందించాలని నార్కోటిక్ బ్యూరో, పోలీసులు ప్రజలకు సూచించారు. డ్రగ్స్ కేసులలో చిక్కుకుని జీవితాలు నాశనం చేసుకోవద్దని యువతకు సూచించారు.






















