Steroids seize: సిక్స్ ప్యాక్ కోసం యువకులకు స్టెరాయిడ్ల సరఫరా - నిందితుడి అరెస్ట్, భారీగా స్టెరాయిడ్స్ స్వాధీనం
Hyderabad News: జిమ్‌ల్లో యువకులకు స్టెరాయిడ్స్ సరఫరా చేసే వ్యక్తిని డ్రగ్ కంట్రోల్ అధికారులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. సికింద్రాబాద్‌లో భారీగా స్టెరాయిడ్స్ స్వాధీనం చేసుకున్నారు.
![Steroids seize: సిక్స్ ప్యాక్ కోసం యువకులకు స్టెరాయిడ్ల సరఫరా - నిందితుడి అరెస్ట్, భారీగా స్టెరాయిడ్స్ స్వాధీనం drug control officers seized huge amount of steroids in secunderabad Steroids seize: సిక్స్ ప్యాక్ కోసం యువకులకు స్టెరాయిడ్ల సరఫరా - నిందితుడి అరెస్ట్, భారీగా స్టెరాయిడ్స్ స్వాధీనం](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/11/ebc5ab4419a884ccc0dd038226f6e42d1720691235069876_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Huge Anount Of Steroids Seized In Secunderabad: ఈ కాలం యువత సిక్స్ ప్యాక్ అంటే ఎక్కువగా ఇష్టపడుతుంటారు. అందు కోసం జిమ్‌ల్లో కసరత్తు సహా ఫుడ్ డైట్స్ పాటిస్తూ సిక్స్ ప్యాక్ పెంచుకుంటారు. అలా దేహదారుఢ్యం కావాలనుకునే యువత ఆశను ఆసరాగా చేసుకుని వారికి స్టెరాయిడ్స్ సరఫరా చేస్తున్న వ్యక్తిని డ్రగ్ కంట్రోల్ అధికారులు గురువారం పట్టుకున్నారు. భారీగా స్టెరాయిడ్స్‌ను సీజ్ చేశారు. జిమ్‌ల్లో యువకులకు స్టెరాయిడ్స్ సరఫరా చేస్తున్నాడనే పక్కా సమాచారంతో తనిఖీలు చేపట్టిన అధికారులు ఖాసిం అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని నిందితున్ని పోలీసులకు అప్పగించారు. నిందితుడు జిమ్‌ల్లో స్టెరాయిడ్స్ సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు.
అటు, రాష్ట్రంలో డ్రగ్స్ అనే మాట వినిపించకూడదనే సీఎం రేవంత్ ఆదేశాలతో పోలీసులు మత్తు పదార్థాలపై ఉక్కుపాదం మోపుతున్నారు. ఈ క్రమంలోనే పబ్ నిర్వాహకులకు గట్టి హెచ్చరికలు జారీ చేశారు. ఇప్పటికే కాలేజీలు, విద్యా సంస్థల్లో డ్రగ్స్ వల్ల జరిగే అనర్థాలపై అవగాహన సదస్సులు సైతం చేపట్టారు. డ్రగ్స్, మత్తు పదార్థాలకు బానిసై జీవితాలు నాశనం చేసుకోవద్దని సూచిస్తున్నారు.
Also Read: Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం - పోలీసులకు ఎస్ఐబీ మాజీ చీఫ్ లేఖ, ఏమన్నారంటే?
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)