X

Cyber Fraud Gang: మీరు A వీడియోలు చూశారో మాకు తెలుసు.. ముందు డబ్బులు కట్టండి!

మీరు పోర్న్ వెబ్ సైట్లు చూస్తున్నారు..మేం సైబర్ క్రైమ్ నుంచి కాల్ చేస్తున్నాం. మీరు ఫైన్ కట్టాలి.. ఇలా ఎప్పుడైనా కాల్స్ వచ్చాయా? అయితే జాగ్రత్త మోసపోకండి. ఈ వార్త చదవండి అసలు విషయం తెలుస్తుంది.

FOLLOW US: 

డబ్బు సంపాదించడానికి నేరగాళ్లు.. నానా దారులు తొక్కుతున్నారు. ఇంటర్నెట్ వాడకం ఎక్కువ ఉండటంతో.. దానిపై కన్నేసి ఎలా వీలైతే.. అలా దోచుకుంటున్నారు. కొత్తగా కొంతమందికి అలానే టోకరా వేశారు. మీరు పోర్న్ చూస్తున్నారు... ఫైన్ కట్టాల్సిందేనంటూ.. బురిటీ కొట్టించారు. 

ఇంటర్నెట్‌లో పోర్న్ వీడియోలు చూస్తున్నారు.. జరిమానా కట్టండి అంటూ కొంతమందికి నోటీసులు వచ్చాయి. వారు ఈ విషయాన్ని సోషల్ మీడియాలో తెలిపారు. వాళ్లకి వచ్చిన బోగస్ పాప్ అప్ నోటీసులను సైతం షేర్ చేశారు. అయితే ఈ విషయాన్ని గమనించిన దిల్లీ సైబర్ క్రైమ్ బ్రాంచ్ కేసును సుమోటోగా తీసుకుంది. ఈ మేరకు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసింది. 

బోగస్ పాప్ అప్ నోటీసులను టెక్నికల్ టీమ్ కు పంపించారు. అవన్నీ చెన్నై నుంచి వచ్చినట్లు తెలిసింది. ఇక రంగంలోకి దిగిన క్రైమ్ బ్రాంచ్ పోలీసులు.. వారం రోజులు చెన్నైకి వెళ్లారు. అక్కడే మకాం వేశారు. నిందితులను గ్రాబ్రియేల్‌ జేమ్స్‌, రామ్‌ కుమార్‌ సెల్వం, బి.ధీనుశాంత్‌గా గుర్తించారు. వారిని పట్టుకునేందుకు సైబర్‌ క్రైం పోలీసులు ఈ ప్రాంతంలో ఒక వారం పాటు క్యాంప్ చేసి, చెన్నై, త్రిచి, కోయంబత్తూర్, ఊటీ మధ్య 2 వేల కిలోమీటర్లకు పైగా తిరిగారు. ఎట్టకేలకు ముగ్గురినీ అదుపులోకి తీసుకున్నారు. ముగ్గురిని విచారిస్తుంటే మెల్ల మెల్లగా విషయాలు బయటపడ్డాయి. ఈ ముగ్గురూ తమ బాస్ చందర్‌కాంత్ ఆదేశాల మేరకు ఈ పనిచేసినట్లు చెప్పారు. చందర్ కాంత్  కంబోడియాలో ఉంటాడని తెలిపారు. ఇందులో మరో ట్విస్ట్ ఏంటంటే.. చందర్ కాంత్ పోలీసులకు దొరికిన ధీనుశాంత్ సోదరుడు.

పోలీసులు తమదైన స్టైల్ విచారణ చేస్తుంటే.. ధీనుశాంత్ నిజాలు చెప్పాడు. బోగస్ పోలీసు నోటీసులు, ఇంటర్నెట్ వినియోగదారులకు వాటిని పంపించడం లాంటి.. సాంకేతిక విషయాలన్నీ చందర్ కాంత్ చెస్తుంటాడని చెప్పుకొచ్చాడు. కంబోడియా నుంచి వీటన్నింటీని ఆపరేట్ చేస్తాడని తెలిపాడు. ఇప్పటి వరకు ఈ గ్యాంగ్.. ఫ్రాడ్ చేసి తరలించడానికి 20కి పైగా బ్యాంకు ఖాతాలు ఉపయోగించినట్లు చెప్పాడు.

పట్టుబడిన ముగ్గురు నిందితులు.. ఈ ఏడాదిలో యూపీఐ ఐడీలు, బోగస్ నోటీసులతో క్యూ ఆర్ సంకేతాలతో రూ.30 లక్షలకు పైగా వసూలు చేశారు. ఇలా మోసం చేసి సంపాదించిన డబ్బును అంతా.. క్రిప్టోకరెన్సీ ద్వారా తరలించేవారు. డబ్బను దాచిపెట్టేందుకు చాలా ఖాతాలు ఉపయోగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

ఇలాంటి ముఠాలు డబ్బులు కోసం ఎలాంటి పనైనా చేస్తాయని పోలీసులు చెబుతున్నారు. ఇంటర్నెట్ వాడే వారు జాగ్రత్తగా ఉండాలని.. ఇలా ఏవైనా బెదిరింపులు వస్తే.. వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు.

Tags: cyber crime Cyber Crime In Chennai Cyber Crime Branch Delhi Bogus Pop-Up Notices To Internet Users

సంబంధిత కథనాలు

Baby Boy Dies: బైక్ వెనక చక్రంలో ఇరుక్కొని మూడు నెలల పసికందు మృతి

Baby Boy Dies: బైక్ వెనక చక్రంలో ఇరుక్కొని మూడు నెలల పసికందు మృతి

Karimnagar: హెల్మెట్ పెట్టుకోలేదని ప్రశ్నించినందుకు కానిస్టేబుల్ పై దాడి... పోలీసుల రంగ ప్రవేశంలో సద్దుమణిగిన గొడవ...!

Karimnagar: హెల్మెట్ పెట్టుకోలేదని ప్రశ్నించినందుకు కానిస్టేబుల్ పై దాడి... పోలీసుల రంగ ప్రవేశంలో సద్దుమణిగిన గొడవ...!

Nellore Crime: త్వరలో ఉద్యోగం పర్మినెంట్ అవుతుందనుకుంటే.. ఏకంగా మహిళా సెక్రటరీ ప్రాణాలు కోల్పోయింది.. 

Nellore Crime: త్వరలో ఉద్యోగం పర్మినెంట్ అవుతుందనుకుంటే.. ఏకంగా మహిళా సెక్రటరీ ప్రాణాలు కోల్పోయింది.. 

Kottagudem: పాల్వంచ కుటుంబం ఆత్మహత్య కేసు... వనమా రాఘవేంద్రకు మరో 14 రోజుల రిమాండ్‌

Kottagudem: పాల్వంచ కుటుంబం ఆత్మహత్య కేసు... వనమా రాఘవేంద్రకు మరో 14 రోజుల రిమాండ్‌

Social Media Arrest : రాజద్రోహమే కాదు.. ప్రభుత్వంపై యుద్ధం కూడా ప్రకటించాడని కేసులు.. సాక్ష్యాల్లేవని బెయిలిచ్చిన కోర్టు !

Social Media Arrest :  రాజద్రోహమే కాదు.. ప్రభుత్వంపై యుద్ధం కూడా ప్రకటించాడని కేసులు..  సాక్ష్యాల్లేవని బెయిలిచ్చిన కోర్టు !
SHOPPING
Kitchen Appliances
LAPTOP AND ACCESORIES
Mobiles Deal
Diwali Gift
Kitchen
Make Up
Top Mobiles
Immunity Booster

టాప్ స్టోరీస్

Dhanush: విడాకులు తీసుకున్న ధనుష్, ఐశ్వర్య.. ఇప్పుడు ఒకే హోటల్ లో..

Dhanush: విడాకులు తీసుకున్న ధనుష్, ఐశ్వర్య.. ఇప్పుడు ఒకే హోటల్ లో..

Micromax New Phone: మైక్రోమ్యాక్స్ కొత్త ఫోన్ వచ్చేది అప్పుడే.. రూ.15 వేలలోనే సూపర్ ఫీచర్లు!

Micromax New Phone: మైక్రోమ్యాక్స్ కొత్త ఫోన్ వచ్చేది అప్పుడే.. రూ.15 వేలలోనే సూపర్ ఫీచర్లు!

Netaji Subhash Chandra Bose: దేశవ్యాప్తంగా నేతాజీ 125వ జయంతి వేడుకలు... బోస్ హోలోగ్రామ్ విగ్రహం ఆవిష్కరించనున్న ప్రధాని... రిపబ్లిక్ డే వేడుకలకు నేడు శ్రీకారం

Netaji Subhash Chandra Bose: దేశవ్యాప్తంగా నేతాజీ 125వ జయంతి వేడుకలు... బోస్ హోలోగ్రామ్ విగ్రహం ఆవిష్కరించనున్న ప్రధాని... రిపబ్లిక్ డే వేడుకలకు నేడు శ్రీకారం

Delhi HC: వివాహ బంధంలో భర్తకు ఆ హక్కు ఉంది... భార్యతో లైంగిక సంబంధం ఆశించవచ్చు.... దిల్లీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు...

Delhi HC:  వివాహ బంధంలో భర్తకు ఆ హక్కు ఉంది... భార్యతో లైంగిక సంబంధం ఆశించవచ్చు.... దిల్లీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు...