IPL, 2022 | Match 67 | Wankhede Stadium, Mumbai - 19 May, 07:30 pm IST
(Match Yet To Begin)
RCB
RCB
VS
GT
GT
IPL, 2022 | Match 68 | Brabourne Stadium, Mumbai - 20 May, 07:30 pm IST
(Match Yet To Begin)
RR
RR
VS
CSK
CSK

Girl Suicide: బాలిక మిస్బా మరణానికి వైసీపీ నేత కారణమా? సూసైడ్ నోట్‌లో ఏముందంటే

Chittoor Girl Suicide: చిత్తూరు జిల్లాలో ఓ బాలిక ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. స్థానిక వైసీపీ నేత, ప్రిన్సిపల్ వేధింపుల కారణంగానే ఆమె ప్రాణాలు తీసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.

FOLLOW US: 

తమ‌ జీవితంలో సాధించలేని వాటిని తమ పిల్లల ద్వారా సాధించేందుకు తల్లిదండ్రులు కలలు కంటుంటారు. తమ పిల్లల బంగారు భవిష్యత్తు కోసం రేయింబవళ్ళు కష్టపడి పని చేస్తూంటారు. తమ పిల్లలకు చిన్న అపకారం జరిగినా ఆ తల్లిదండ్రులు ఓర్చుకోలేరు. తాజాగా పలమనేరులో ఓ వైసీపీ నాయకుడి ప్రోద్బలంతో ప్రైవేటు స్కూల్ యాజమాన్యం వేధింపుల కారణంగా పదో తరగతి విద్యార్ధిని లేఖ‌ రాసి ఆత్మహత్య చేసుకున్న ఘటన చిత్తూరు జిల్లాలో కలకలం రేపుతుంది.

చిత్తూరు జిల్లా పలమనేరులో నజీర్ అహ్మద్, నజీమాలు కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. కుటుంబ షోషణకు సోడా బండిని నడుపుతూ ఆ దంపతులు ఒక్కగానొక్క కుమార్తె మిస్బాను స్థానికంగా ఉన్న బ్రహ్మర్షి హైస్కూల్ లో చదివిస్తున్నారు. అయితే చిన్నతనం నుంచి మిస్బాకు చదువుపై మక్కువ ఉండడంతో స్కూల్ లో తోటి విద్యార్థుల కంటే ముందుండేది. అంతా సాఫీగా సాగుతున్న టైంలో ఫ్రెండ్ అనుకున్న వ్యక్తి మిస్బాకు సమస్యగా మారింది. తనతో పోటీ పడి చదివే అమ్మాయి ద్వేషం పెంచుకుంది. 

స్థానికంగా ఓ పార్టీకి చెందిన నేత కుమార్తె పునీత. మిస్బాకు మంచి ఫ్రెండ్. ఎప్పుడూ మిస్బాకు మార్కులు ఎక్కువ రావడం పునీతకు తక్కువ రావడంతో సమస్య తండ్రి వరకు వెళ్లింది. కుమార్తె పునీత బాధను గ్రహించిన తండ్రి స్కూల్‌కి వెళ్లి ప్రిన్సిపాల్‌ రమేష్‌కు వార్నింగ్ ఇచ్చారు. అంతే కథ మారిపోయింది. పునీత్ తండ్రి వార్నింగ్‌తో ప్రిన్సిపాల్‌ మిస్బాను వేధించడం మొదలు పెట్టాడు. సూటిపోటి మాటలు ఆమె మనసును గాయపరిచాయి. సోడాలు కొట్టుకునే వాళ్లకు చదువెందుకని మానసికంగా హింస మొదలు పెట్టారు ప్రిన్సిపాల్. దీంతో మిస్బా తీవ్ర ఆవేదనకు గురి అయ్యింది.‌ చదువుపై కూడా సరిగ్గా దృష్టి సారించలేక పోయింది. 

గత వారం క్రితం మిస్బా తండ్రిని పిలిచిన ప్రైవేటు స్కూల్ ప్రిన్సిపాల్ రమేష్, మిస్బా సరిగ్గా చదవడం లేదని మరోక స్కూల్ లో చేర్పచండి అంటూ టీసీ ఇచ్చి పంపాడు. తమ కుమార్తె బాగా చదువుతుందని, ఎటువంటి కారణం లేకుండా ఉన్నపళంగా టీసీ ఇస్తే తమ కుమార్తెను ఎక్కడ చేర్పించాలని మిస్బా తండ్రి ప్రిన్సిపాల్ ను వేడుకున్నాడు. కానీ ప్రిన్సిపాల్ కనికరం చూపలేదు. వాళ్లను ఒప్పించలేక గత్యంతరం లేని పరిస్థితుల్లో స్ధానికంగా ఉన్న మరో స్కూల్ లో మిస్బాను చేర్పించాడు నజీర్ అహ్మద్. అయితే రోజు రెగ్యులర్‌గా స్కూల్‌కి వెళ్లి వస్తున్న మిస్బాలో మునుపటి ఉత్సహాం కనిపించలేదు. ఇంటి వచ్చినా సరే తల్లిదండ్రులతో గానీ, ఇరుగు పొరుగు వారితో గానీ సరిగ్గా మాట్లాడేది కాదు. దీంతో ఏం జరిగిందని మిస్బా తల్లిదండ్రులు ప్రశ్నించారు. అందుకు మిస్బా సరైన సమాధానం చెప్పక పోవడంతో మిస్బా స్నేహితులను అడిగి విషయం తెలుసుకున్నారు. 

మిస్బా తనకు జరిగిన అవమానాన్ని భరించలేక రెండు రోజుల క్రితం స్కూల్ నుంచి ఇంటికి వచ్చి బట్టలు మార్చుకునేందుకు రూంలోకు వెళ్లి గడియ వేసుకుంది. చాలా సమయం గడిచినా మిస్బా రాకపోయేసరికి తల్లిదండ్రులు తలుపులు తెరిచేందుకు ప్రయత్నించారు. కానీ తలుపు తెరుచుకోకపోయే సరికి అనుమానం వచ్చి తలుపులు బద్దలు కొట్టి చూస్తే మిస్బా ఫ్యాన్ కు ఉరి వేసుకుని విగత జీవిలా పడి ఉండడంను చూసి ఆ తల్లిదండ్రులు తల్లడిల్లిపోతారు. వెంటనే మిస్బాను ఆసుపత్రికి‌ తరలించారు. కానీ అప్పడికే మిస్బా మృతి చెందిందని వైద్యులు తెలియజేశారు.
 
తమ కుమార్తె మృతికి ప్రైవేటు స్కూల్ యాజమాన్యమే కారణం అంటూ, తమకు న్యాయం చేయాలంటూ డిమాండ్ చేస్తూ పోలీసులు స్టేషను ముందు మిస్బా తల్లిదండ్రులు, బంధువులు ధర్నాకు దిగ్గారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందుతులను 24 గంటల్లో అరెస్టు చేస్తామని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు.

మిస్బా సూసైడ్ నోట్‌లో ఏం రాసిందంటే?
‘‘నాన్న నన్ను క్షమించండి. నా వల్ల మీకు అన్ని ప్రాబ్లమ్ అండ్ టెన్సన్.. నేను చాలా సార్లు చనిపోదాం అనుకున్నాను కానీ నేను చనిపోతే అది తప్పు.. కానీ మీ ప్రాబ్లమ్ అండ్ టెన్షన్ పోవాలంటే నేను చనిపోవాలి కానీ నాకు అంత ధైర్యం రావటం లేదు. కానీ నేను చనిపోతేనే మీ ప్రాబ్లమ్స్ ఆన్నీ తిరిపోతాయి. కానీ నేను చనిపోతే మిమ్మల్ని ఎవరు చూసుకుంటారు. నేను ఫ్రెండ్‌షిప్ గొప్పది షిప్ లాంటిది ఎప్పటికి మునిగిపోదు అనుకున్నాను. కానీ నా చావుకు ఫ్రెండ్ కాదు నా బెస్ట్ బెస్ట్ ఫ్రెండ్ డే కారణం. 

‘‘నేను బెస్ట్ ఫ్రెండ్ అనుకున్నాను కానీ నువ్వు నాతో అలా లేవు నేను నిన్ను బెస్ట్ ఫ్రెండ్ అనుకున్నాను కానీ నువ్వు ఎప్పుడు నన్ను అలా అనుకోలేదు.. నన్ను అర్థం చేసుకోలేదు.. నేను నా చదువే నాకు అన్ని అనుకున్నాను కానీ నువ్వు నా చదువు లేకుండా చేశావు. నన్ను నాశనం చేసావు.. నాన్న నన్ను క్షమించు.. మీరు నాతో అన్ని షేర్ చేసుకోమని అన్నారు కానీ నీతో అన్ని షేర్ చేయలేక పోయాను నాన్న, ఒక ఫ్రెండ్ కు మాత్రమే చేయగలను.. కానీ తను నన్ను ఇలా చేసింది. తన ప్రవర్తన చాలా బాధ పెట్టింది అన్నింటికి కారణం నువ్వే పునీత. నన్ను క్షమించండి నాన్న మిమ్మల్ని నేను వదిలి పోతున్నాను శాశ్వతంగా. నా చావుకు కేవలం పునీతనే కారణం మీ కుమార్తెను క్షమించండి. మిస్బా బై..’’ అని రాసింది,

మిస్బా తల్లిదండ్రులు ఏం అంటున్నారంటే?
మిస్బా ఆత్మహత్య వెనుక వైసీపీ నాయకుడు సునీల్, ప్రైవేటు స్కూల్ ప్రిన్సిపాల్ రమేష్ ను వేంటనే అరెస్టు చేసి చట్టరిత్యా చర్యలు తీసుకోవాలని మిస్బా తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. మిస్బా కుటుంబాన్ని టీడీపీ మాజీ మంత్రి అమరనాథ్ రెడ్డి పరామర్శించారు. టీడీపీ తమ కుటుంబానికి అండగా నిలుస్తుందని హామీ ఇచ్చారు.‌ నిందుతులకు శిక్ష పడే వరకూ ఉద్యమం చేస్తామని మాజీ మంత్రి హెచ్చరించారు.

Published at : 24 Mar 2022 03:08 PM (IST) Tags: YSRCP News YSRCP Leaders school student suicide Palamaner school student Chittoor Girl suicide

సంబంధిత కథనాలు

Hyderabad news : ప్రియుడితో భార్య రాసలీలలు, రెడ్ హ్యాండడ్ గా పట్టుకున్న భర్త

Hyderabad news : ప్రియుడితో భార్య రాసలీలలు, రెడ్ హ్యాండడ్ గా పట్టుకున్న భర్త

Guntur Crime : గుంటూరు జిల్లాలో దారుణం, తొమ్మిదో తరగతి విద్యార్థినిపై సామూహిక అత్యాచారం

Guntur Crime : గుంటూరు జిల్లాలో దారుణం, తొమ్మిదో తరగతి విద్యార్థినిపై సామూహిక అత్యాచారం

Kondapalli Hidden Treasures : కొండపల్లి ఫారెస్ట్ లో గుప్త నిధులున్నట్లు ప్రచారం, తవ్వకాలు స్టార్ట్ చేసేసిన కేటుగాళ్లు

Kondapalli Hidden Treasures : కొండపల్లి ఫారెస్ట్ లో గుప్త నిధులున్నట్లు ప్రచారం, తవ్వకాలు స్టార్ట్ చేసేసిన కేటుగాళ్లు

Bapatla Volunteer Murder : మహిళా వాలంటీర్ మర్డర్ కేసులో నిందితుడు రైలు కింద పడి ఆత్మహత్య

Bapatla Volunteer Murder : మహిళా వాలంటీర్ మర్డర్ కేసులో నిందితుడు రైలు కింద పడి ఆత్మహత్య

Uttarakhand News : కన్న కొడుకునే పెళ్లి చేసుకున్న మహిళ, పోలీసులను ఆశ్రయించిన భర్త

Uttarakhand News : కన్న కొడుకునే పెళ్లి చేసుకున్న మహిళ, పోలీసులను ఆశ్రయించిన భర్త
SHOPPING
Top Mobiles
LAPTOP AND ACCESORIES
Best Deals

టాప్ స్టోరీస్

Siddharth: పాన్ ఇండియా అంటే ఫన్నీగా ఉంది - 'కేజీఎఫ్2'పై హీరో సిద్ధార్థ్ వ్యాఖ్యలు 

Siddharth: పాన్ ఇండియా అంటే ఫన్నీగా ఉంది - 'కేజీఎఫ్2'పై హీరో సిద్ధార్థ్ వ్యాఖ్యలు 

Akhilesh On Temples : జ్ఞానవాపి మసీదు వివాదంపై ఎస్పీ చీఫ్ అఖిలేష్ వివాదాస్పద వ్యాఖ్యలు

Akhilesh On Temples : జ్ఞానవాపి మసీదు వివాదంపై ఎస్పీ చీఫ్ అఖిలేష్ వివాదాస్పద వ్యాఖ్యలు

Jeevitha Rajasekhar: 'నా కూతురు లేచిపోయిందన్నారు - తప్పు చేస్తే కొట్టండి, అంతేకానీ' - జీవితా రాజశేఖర్ ఆవేదన!

Jeevitha Rajasekhar: 'నా కూతురు లేచిపోయిందన్నారు - తప్పు చేస్తే కొట్టండి, అంతేకానీ' - జీవితా రాజశేఖర్ ఆవేదన!

Yasin Malik Convicted: వేర్పాటువాద నేత యాసిన్ మాలిక్‌ను ఆ కేసులో దోషిగా తేల్చిన కోర్టు

Yasin Malik Convicted: వేర్పాటువాద నేత యాసిన్ మాలిక్‌ను ఆ కేసులో దోషిగా తేల్చిన కోర్టు