Chikoti Praveen: ఈడీ విచారణకు హాజరైన చీకోటి ప్రవీణ్ - విదేశాల్లో కేసినోలు, హవాలా మనీపై ప్రశ్నల వర్షం !
Chikoti Praveen: హవాలా, క్యాసినో ఆరోపణలు ఎదుర్కొంటున్న చికోటి ప్రవీణ్ ఈడీ విచారణకు హాజరయ్యాడు. ప్రవీణ్తోపాటు మాధవరెడ్డిలను ఈడీ విచారిస్తోంది.
Chikoti Praveen Casino Case: కేసినో కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న చీకోటి ప్రవీణ్ ఈడీ విచారణకు హాజరయ్యాడు. సంతోష్ నగర్ లోని తన ఇంటి వద్ద నుండి బయలుదేరి ఈడీ కార్యాలయానికి చేరుకున్నాడు. మీడియాతో ఎక్కడ కేసినో వ్యవహారంపై నోరు విప్పకుండా మౌనంగా ఈడీ కార్యాలయానికి చేరుకున్నాడు చీకోటి ప్రవీణ్. ఈడీ కార్యాలయానికి బయలుదేరుతుండగా ఇంటి వద్ద మీడియా అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేదు సరికదా విచారణ ఎదుర్కొంటానన్న టెన్షన్ ఏమాత్రం లేదు, పైగా గంభీరంగా కనిపించాడు.
ప్రశ్నలకు బదులివ్వలేదు, ప్రైవేట్ సెక్యూరిటీతో ఈడీ ఆఫీసుకు !
మీడియా తనను ఈడీ కంటె ఎక్కవ ప్రశ్నిస్తోంది, ప్రచారం చేస్తోందని చీకోటి ప్రవీణ్ అన్నాడు. వాహనంలో ఇంటి వద్ద బయలుదేరిన కాసేపటికి ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు చీకోటి ప్రవీణ్. ఇప్పటికే ప్రవీణ్ కు ప్రాణహాణి ఉందనే వార్తలు వినిపిస్తుండగా.. ఇంటి నుండి బయటకు వచ్చే క్రమంలో తన చుట్టూ ప్రైవేటు సెక్కూరిటీని ప్రత్యేక భద్రతకోసం ఏర్పాటు చేసుకున్నాడు. ఇంటి నుండి ఈడీ కార్యాలయంకు వెళ్లే వరకూ, తిరిగి ఇంటికి చేరే వరకూ తనతో ప్రైవేటు సెక్కూటీ ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నాడు.
విదేశాల్లో కేసినో, కోట్ల రూపాయల్లో హవాలా..
విదేశాల్లో కేసినో ఆడిస్తూ, కోట్లాది రూపాయల నగదు హవాల ద్వారా స్వదేశం నుండి విదేశాలకు, విదేశాల నుండి ఇండియాకు తరలించాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు చీకోటి ప్రవీణ్. సినీ, రాజకీయ ప్రముఖులను ప్రత్యేక విమానాల్లో కేసినో ఆడించేదుకు విదేశాలకు తీసుకెళ్లడంతోపాటు సినీ తారలతో కేసినో ఈవెంట్స్ ప్రచారం చేయించారు. అందుకుగానూ ఆ హీరోయిన్లకు భారీగా రెమ్యూనరేషన్లు చెల్లించడం.. ఇలా ఒకటేమిటి కేసినో కింగ్ గా తెలుగు రాష్ట్రాల్లో పేరుతెచ్చుకున్న చికోటి ప్రవీణ్ ను ఈరోజు ఈడీ అనేక అంశాలపై సుదీర్గంగా విచారించనుంది. విదేశాల్లో కేసినో ఎలా నిర్వహించేవారు, అందుకు డబ్బు ఎలా సేకరించేవారు. ఎవరెవరి వద్ద ఎంత వసూలు చేసేవారు.. ఇలా ఒకటేమిటి అనేక అంశాలపై ఈడీ ప్రశ్నల వర్షం కురిపించే అవకాశం ఉంది.
కేసినో కేసులో ప్రధాన నిందితుడు చికోటి ప్రవీణ్, అతడికి సహకరించిన మాధవరెడ్డితో పాటు మరో ఇద్దరు నిర్వాహకులు సహా నలుగురు హవాలా బ్రోకర్స్ కు ఇప్పటికే ఈడీ నోటీసులు జారీ చేసింది. చీకోటి ప్రవీణ్, మాధవరెడ్డి ఇళ్లలో ఇరవై గంటలపాటు సోధాలు నిర్వహించిన ఈడీ అధికారులు పలు కీలక పత్రాలను, ఆధారాలను సేకించారు. వీరి వద్ద నుండి ప్రాధమికి సమాచారం తీసుకున్నారు. ప్రవీణ్, మాధవరెడ్డితోపాటు సంపత్, బబ్లు, రాకేష్, వెంకటేష్ లు బెట్టింగ్, హావాలలో కీలకపాత్ర పోషించారని ఈడీ అనుమానిస్తోంది.
Also Read: Chikoti Casino Case : కేసినో కేసులో ఏడుగురికి ఈడీ నోటీసులు - పట్టించేసిన రూ. కోట్ల లావాదేవీలు !
చీకోటి ప్రవీణ్ కు చెందిన 4 బ్యాంక్ అకౌంట్ల నుంచి ఐదేళ్ల పాటు జరిగిన ఆర్దిక లావాదేవీల పూర్తి వివరాలను ఇప్పటికే సేకరించిన ఈడీ ఈరోజు జరిగే విచారణలో వీటిపై చికోటికి ప్రశ్నల వర్షం కురిపించనుంది. ఫోన్, ల్యాప్ ట్యాప్ సీజ్ చేసిన ఈడీ అధికారులు పలు కీలక ఆధారాలను గుర్తించినట్లు సమాచారం. మోత్తానికి నేటి ఈడీ విచారణలో చికోటి ప్రవీణ్ ఏం చెబుతాడనే దానిపై కేసు విచారణ ఆధారపడి ఉంటుంది. ఏమైనా కొత్త కోణం వెలుగుచూస్తే, దర్యాప్తును ఈడీ ముమ్మరం చేయనుంది.