ట్రైన్‌లో ఉండగా ఫోన్ లాక్కున్న దుండగులు, పట్టుకోబోయి కింద పడిన యువతి మృతి
Chennai Woman: చెన్నైలో ఓ మహిళ తన ఫోన్‌ని లాక్కున్న వారిని పట్టుకోడానికి ప్రయత్నించి రైల్లో నుంచి పడిపోయి మృతి చెందింది.
Chennai Woman Falls:
చెన్నైలో ఘటన..
చెన్నైలో ఓ లోకల్ ట్రైన్‌ను పడిపోయి యువతి ప్రాణాలు కోల్పోయింది. జులై 2వ తేదీన ఈ ప్రమాదం జరిగింది. ట్రైన్‌లో ఇద్దరు దొంగలు ఆమె ఫోన్‌ని చోరీ చేసేందుకు ప్రయత్నించగా వారిని పట్టుకోబోయి పట్టుతప్పి కింద పడిపోయింది. తలకు తీవ్రగాయాలయ్యాయి. వెంటనే ఆమెని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. దాదాపు వారం రోజులుగా ప్రాణాలతో పోరాడిన ఆమె..చివరకు కన్నుమూసింది. పోలీసుల వివరాల ప్రకారం..22 ఏళ్ల ప్రీతి ట్రైన్ ఫుట్‌బోర్డ్‌పై నిలబడి ఫోన్ మాట్లాడుతోంది. అప్పుడే ఓ ఇద్దరు వ్యక్తులు ఆమె ఫోన్‌ని లాక్కునేందుకు ప్రయత్నించారు. వాళ్లను పట్టుకోవాలనే తొందరలో అదుపు తప్పి ట్రైన్‌లో నుంచి కింద పడిపోయింది. అప్పటికే ఫోన్ లాక్కుని ఇద్దరు నిందితులూ పారిపోయారు. తలకు తీవ్ర గాయాలవడం వల్ల బాధితురాలు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. ప్రీతి కాల్ రికార్డ్‌ల ఆధారంగా ఆ ఫోన్‌ని ట్రేస్ చేశారు పోలీసులు. ఆ నిందితులు అప్పటికే ఓ వ్యక్తికి ఫోన్ అమ్మేశారు. పోలీసులు విచారించగా..."నాకు ఈ ఫోన్‌ని అమ్మేశారు" అని చెప్పాడు. ఈ కేసులోని నిందితులిద్దరినీ ట్రాక్ చేసిన పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తామే ఈ చోరీ చేసినట్టు వాళ్లు అంగీకరించారు.
ప్లాట్‌ఫామ్‌పై పడి..
రైలు ఎక్కేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని, కదులుతున్న రైలు నుంచి దిగడం, ఎక్కడం ప్రమాదకరమని రైల్వే స్టేషన్లలోని మైకుల్లో చెబుతూనే ఉంటారు. అయినా అవేవీ పట్టించుకోకుండా ప్రమాదాలకు గురవుతుంటారు చాలా మంది. నిర్లక్ష్యపూరితంగా వ్యవహరించడం వల్ల ఒక్కో సారి ప్రాణాల మీదకు తెచ్చుకుంటారు. కదులుతున్న రైలు ఎక్కేటప్పుడు జారి ప్లాట్‌ఫాంకు, రైలుకు మధ్య ఇరుక్కుని ప్రాణాలు వదలిన ఘటనలు చాలానే ఉన్నాయి. అయినా రైలు కదిలేంత వరకు అక్కడే తచ్చాడుతూ.. తీరా కదిలాకా నింపాదిగా, నిర్లక్ష్యంగా ఎక్కడం వల్ల కాలు జారి ప్రమాదాలు కొనితెచ్చుకుంటారు చాలా మంది. రైల్వే ప్లాట్‌ఫాంలపై జరిగే ప్రమాదాలను, ప్రయాణికుల నిర్లక్ష్య వైఖరితో జరిగే ఘటనలను రైల్వే పోలీసులు ఎలా చాకచక్యంగా తప్పిస్తారో అంటూ సోషల్ మీడియాలో చాలా వీడియోలు ట్రెండ్ అవుతుంటాయి. అలాంటి వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ ఘటన తాజాగా ప్రకాశం జిల్లా ఒంగోలులో జరిగింది. ఈ ఘటనలో ఓ వ్యక్తి రైల్వే ప్లాట్‌ఫాంకు, రైలుకు మధ్య ఇరుక్కున్నాడు. అక్కడే ఉన్న రైల్వే పోలీసు వెంటనే స్పందించి రైలును ఆపుచేయించి తనను ప్రాణాలతో కాపాడాడు. ఇదంతా అక్కడే ఉన్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయింది. కదులుతున్న రైలును ఎక్కేందుకు ప్రయత్నించినా ఓ ప్రయాణికుడు కాలు జారి కింద పడ్డాడు. ప్లాట్ ఫాం, రైలుకు మధ్య ఇరుక్కున్నాడు. ఓ చేతితో హ్యాండిల్ ను పట్టుకుని రైలుతో పాటు ముందుకు కదిలాడు. ఇదంతా అక్కడే ఉన్న తోటి ప్రయాణికులు, వ్యాపారులు చూసినా కాపాడే ప్రయత్నం మాత్రం చేయలేదు.