News
News
X

ఇన్నర్‌వేర్‌లో రాళ్లు- కాళ్లకు ఇనుప బెల్ట్‌- ఫిజికల్‌ ఫిట్‌నెస్‌ పరీక్ష పాస్‌ కోసం అభ్యర్థుల అక్రమాలు

కలబురిగి జిల్లాలో ఫిజికల్ ఫిట్‌నెస్‌ టెస్ట్ నిర్వహిస్తున్నారు. అక్కడే కొందరు అభ్యర్థులు అక్రమాలకు పాల్పడ్డారు.

FOLLOW US: 
Share:

కర్నాటక రాష్ట్రంలో జరుగుతున్న రోడ్డు రవాణా సంస్థ డ్రైవర్‌, మేనేజర్‌ పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. ఫిజికల్ ఫిట్‌నెస్ పరీక్షలు కూడా మొదలయ్యాయి. ఇందులో అర్హత సాధించేందుకు అభ్యర్థులు వక్రమార్గాలు పడుతున్నారు. తగిన బరువు లేని వ్యక్తులు కూడా ఈ పరీక్షకు హాజరయ్యారు. వాళ్లు నోటిఫికేషన్‌లో చెప్పినంత బరువు ఉండేందుకు ఒకరు రాళ్లను ఇన్నర్‌వేర్స్‌లో పెట్టుకుంటే మరొకరు నడుముకు ఇనుప బెల్ట్ కట్టుకొని వచ్చారు. మరికొందరు ఇనుప గొలుసులను కాళ్లకు కట్టుకొని వచ్చారు. ఇలా ఒక్కొక్కరు ఒక్కోలా పరీక్షకు హాజరయ్యారు. 

1,619 ఉద్యోగాల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ విడుదలైంది. విద్యార్హతతోపాటు శారీరకంగా కూడా ఫిట్‌నెస్‌ ఉండాలని ప్రభుత్వం నోటిఫికేషన్‌లో చెప్పింది. తగిన ఎత్తుతో పాటు 55 కిలోల కంటే తక్కువ బరువు ఉండకూడడదని నిర్దేశించింది. దీనికి సుమారు 40 వేల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. 

వీళ్లందరికీ కలబురిగి జిల్లాలో ఫిజికల్ ఫిట్‌నెస్‌ టెస్ట్ నిర్వహిస్తున్నారు. అక్కడే కొందరు అభ్యర్థులు అక్రమాలకు పాల్పడ్డారు. బరువు సరిపోని ఓ వ్యక్తి తన ఇన్నర్‌వేర్‌లో ఐదేసి కిలోల బరువున్న రెండు తూకపు రాళ్లు వేసుకున్నాడు. మరో వ్యక్తి ఇనుప గొలుసులను కాళ్లకు చుట్టుకున్నాడు. మరొక అభ్యర్థి నడుంకు ఇనుముతో చేసిన బరువైన బెల్ట్‌ కట్టుకున్నాడు. ఇంకొకరు బరువైన షర్ట్‌ను ధరించాడు. 

తెలంగాణలో కూడా ఎత్తు పెరగడానికి అడ్డదారులు

తెలంగాణలో పోలీస్ కానిస్టేబుల్, ఎస్.ఐ. పోస్టుల ఎంపికలో భాగంగా మహిళా అభ్యర్థులకు దేహ దారుఢ్య పరీక్షలు, ఎత్తు చెక్ చేస్తుండగా ఓ అభ్యర్థిని పరీక్షించిన పోలీసులు షాకయ్యారు. ఎత్తు పెంచుకునేందుకు యువతి చేసిన ప్రయత్నం విఫలమైంది. పోలీస్ ఉన్నతాధికారులు మహిళా అభ్యర్థిని డిస్ క్వాలిఫై చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఎత్తు పెంచుకునేందుకు మహిళ తన జుట్టులో ఓ పదార్థాన్ని వాడారు. కానీ పోలీసులు ఆమె ప్రయత్నాన్ని విఫలం చేసి, ఎట్టా పట్టుకున్నారో ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

మహిళా అభ్యర్థులకు ఎత్తు కొలిచే సందర్భంలో ఒక అభ్యర్థి తల జుట్టు లోపల ఎంసీల్ మైనం పెట్టుకుని పరీక్షలకు హాజరైంది. తన ఎత్తును పెంచుకునేందుకు మహిళా అభ్యర్థి చేసిన ప్రయత్నాన్ని అధికారులు గుర్తించారు. ట్యాంకులు, పైపుల లీకేజీని అరికట్టేందుకు వినియోగించే ఎంసీల్ తలపై జట్టులో పెట్టుకుని పోలీసులను బురిడీ కొట్టించే ప్రయత్నం చేసి మహిళా అభ్యర్థి దొరికిపోయింది. 

అలా దొరికిపోయిన మహిళా అభ్యర్థి..

ఎత్తు కొలిచే ఎలక్ట్రానిక్ యంత్ర పరికరంపై మహిళా అభ్యర్థి నిలుచున్న సందర్భంలో ఎలక్ట్రానిక్ పరికరంలోని సెన్సర్ స్పందించలేదు. ఇది గమనించిన మహిళా అధికారి అభ్యర్థి తలపై ప్రత్యేకంగా పరిశీలించగా, సదరు అభ్యర్థి తలపై జుట్టు లోపల M-సీల్ మైనం అతికించుకున్నట్లుగా గుర్తించారు. తలపై ఉబ్బెత్తుగా మైనం పెట్టుకుని తన ఎత్తు ఎక్కువ చూపేందుకు ప్రయత్నం చేసిన మహిళా అభ్యర్థిని పోలీస్ ఉన్నతాధికారులు డిస్ క్వాలిఫై చేశారు. 

ఎంపిక ప్రక్రియలో ఆధునిక టెక్నాలజీతో పాటుగా సి.సి. కెమెరాలు, పోలీస్ అధికారుల నిశిత పరిశీలన ఉంటుందని, ఎటువంటి అవకతవకలకు పాల్పడినా చర్యలు తప్పవని ఎస్.పి. ఆర్.వెంకటేశ్వర్లు అభ్యర్థులను హెచ్చరించారు. అభ్యర్థి ఎత్తు కొలిచే ఎలక్ట్రానిక్ పరికరంపై నిలుచున్నప్పుడు, తలపై మరియు కాళ్ళ కింద పూర్తిస్థాయిలో సరైన స్పర్శ ఉన్నప్పుడే సెన్సర్లు స్పందిస్తాయి. అప్పుడే అభ్యర్థుల ఎత్తు, బరువు సూచిస్తాయని తెలిపారు. అదేవిధంగా పరుగు పోటీ, ఇతర ఈవెంట్లలో కూడా రేడియో ఫ్రీక్వెన్సీ విధానాన్ని ఉపయోగిస్తున్న విషయం ఎస్పీ వెంకటేశ్వర్లు గుర్తు చేశారు. అభ్యర్థులు తమ వ్యక్తిగత సత్తువపై నమ్మకంతో ఈవెంట్లలో పాల్గొని విజయం సాధించేందుకు కృషి చేయాలని ఇలాంటి తప్పిదాలకు పాల్పడి చిక్కుల్లో పడరాదని సూచించారు.

Published at : 11 Feb 2023 07:49 AM (IST) Tags: Karnataka Cheating Physical Events Karnataka Recruitment

సంబంధిత కథనాలు

Karimnagar Fire Accident: కరీంనగర్ లో వేర్వేరు చోట్ల అగ్ని ప్రమాదాలు, రిటైర్డ్ ఎంపీడీవో సజీవ దహనం!

Karimnagar Fire Accident: కరీంనగర్ లో వేర్వేరు చోట్ల అగ్ని ప్రమాదాలు, రిటైర్డ్ ఎంపీడీవో సజీవ దహనం!

Karimnagar Crime News: కరీంనగర్ లో దారుణం - యువకుడి గొంతుకోసి దారుణ హత్య, మందు పార్టీ కొంపముంచిందా? 

Karimnagar Crime News: కరీంనగర్ లో దారుణం - యువకుడి గొంతుకోసి దారుణ హత్య, మందు పార్టీ కొంపముంచిందా? 

Eluru Crime: పండుగపూటే విషాదం - ఆటోపై విరిగిపడిన తాటిచెట్టు, రెండేళ్ల పాప దుర్మరణం

Eluru Crime: పండుగపూటే విషాదం - ఆటోపై విరిగిపడిన తాటిచెట్టు, రెండేళ్ల పాప దుర్మరణం

Teenmar Mallanna: తీన్మార్ మల్లన్నకు 14 రోజుల రిమాండ్, చర్లపల్లి జైలుకు నిందితుల తరలింపు

Teenmar Mallanna: తీన్మార్ మల్లన్నకు 14 రోజుల రిమాండ్, చర్లపల్లి జైలుకు నిందితుల తరలింపు

Gold Seized in Vijayawada: విజయవాడలో రూ.7.48 కోట్ల బంగారం పట్టివేత - బస్సులో, రైళ్లో తరలిస్తుండగా నిందితుల అరెస్ట్!

Gold Seized in Vijayawada: విజయవాడలో రూ.7.48 కోట్ల బంగారం పట్టివేత - బస్సులో, రైళ్లో తరలిస్తుండగా నిందితుల అరెస్ట్!

టాప్ స్టోరీస్

ఎమ్మెల్సీ ఎన్నికల్లో గంటా శ్రీనివాసరావు ఓటేస్తారా? రాజీనామాను ఆమోదించేశారా?

ఎమ్మెల్సీ ఎన్నికల్లో గంటా శ్రీనివాసరావు ఓటేస్తారా? రాజీనామాను ఆమోదించేశారా?

KCR Tour: నేడు 4 జిల్లాల్లో సీఎం కేసీఆర్ పర్యటన - పూర్తి షెడ్యూల్ ఇదీ

KCR Tour: నేడు 4 జిల్లాల్లో సీఎం కేసీఆర్ పర్యటన - పూర్తి షెడ్యూల్ ఇదీ

NTR 30 Muhurtam : రాజమౌళి క్లాప్‌తో మొదలైన ఎన్టీఆర్ 30 - అతిరథ మహారథుల సమక్షంలో...

NTR 30 Muhurtam : రాజమౌళి క్లాప్‌తో మొదలైన ఎన్టీఆర్ 30 - అతిరథ మహారథుల సమక్షంలో...

DVV Danayya: రూ.80 కోట్లా? ఆస్కార్స్ ఖర్చుపై స్పందించిన ‘RRR’ నిర్మాత డీవీవీ దానయ్య

DVV Danayya: రూ.80 కోట్లా? ఆస్కార్స్ ఖర్చుపై స్పందించిన ‘RRR’ నిర్మాత డీవీవీ దానయ్య