అన్వేషించండి

Bihar Crime News: రిఫ్రిజిరేటర్‌ తీసుకురాలేదని ఏడు నెలల గర్భిణీని చంపిన అత్తింటి వాళ్లు

Bihar Crime News: కట్నంగా ఇస్తామన్న ఫ్రిజ్జును ఇప్పటికీ తేవడం లేదనే కోపంతో అత్తింటి వాళ్లు ఓ మహిళను హత్య చేశారు. ఏడు నెలల గర్భిణీ అని కూడా చూడకుండా భర్త, అత్త, మామ కొట్టి చంపారు. 

Bihar Crime News: వారిద్దరికీ 2012లో పెళ్లి జరిగింది. వీరి అన్యోన్య దాంపత్యానికి ప్రతీకలుగా ఇప్పటికే నలుగురు పిల్లలు పుట్టారు. మరోసారి ఆమె గర్భం దాల్చగా.. ప్రస్తుతం ఏడు నెలల గర్భిణీ. అయితే పెళ్లి అప్పుడు ఆమె పుట్టింటి వాళ్లు రిఫ్రిజిరేటర్ ఇస్తామని చెప్పారు. కానీ ఆర్థిక పరిస్థితి బాగాలేక కొనివ్వ లేకపోయారు. దీంతో కోపం పెంచుకున్న అత్తింటి వాళ్లు.. తరచుగా మహిళను వేధించే వాళ్లు. పుట్టింటికి వెళ్లి రిఫ్రిజిరేటర్ తీసుకురమ్మని హింసించేవాళ్లు. అయినా ఆమె అవేం పట్టించుకోకుండా అక్కడే ఉండిపోయింది. దీంతో కోపం పెంచుకున్న భర్త, అత్త, మామలు.. నిండు చూలాలు అని కూడా చూడకుండా విపరీతంగా కొట్టారు. ఈక్రమంలోనే సదరు మహిళ ప్రాణాలు కోల్పోయింది. 

అసలేం జరిగిందంటే..?

బిహార్ లోని పుర్నియా జిల్లా భేలా ప్రసాది భవానీపూర్ చెందిన గ్రామానికి 30 ఏళ్ల అంగూరి బేగం, మోమినాత్ అలాంకు 2012లో వివాహం జరిగింది. వీరికి ఇప్పటికే నలుగురు పిల్లలు కూడా ఉన్నారు. అయితే అంగూరి బేగం ఐదోసారి గర్బం దాల్చగా.. ప్రస్తుతం ఏడు నెలలు. పెళ్లి సమయంలో అంగూరి బేగం తల్లిదండ్రులు కట్నంగా రిఫ్రిజిరేటర్ ఇస్తామని చెప్పారు. కానీ వారి ఆర్థిక పరిస్థితి బాగా లేక ఏమీ ఇవ్వలేకపోయారు. అయితే తరచుగా అత్తింటి వాళ్లు ఫ్రిజ్జు కోసం దెప్పిపొడుస్తూనే ఉన్నారు. అయినా అంగూరి బేగం అవేమీ పట్టించుకోకుండా కాపురం చేస్తూ వస్తోంది. అయితే తాజాగా భర్త, అత్త, మామ మరోసారి ఫ్రిజ్ తీసుకు రమ్మని కోరారు. అందుకు ఆమెకు స్పందించకపోయే సరికి హిసించడం మొదలు పెట్టారు. తీవ్రంగా కొట్టడంతో అంగూరి బేగం అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. 

పుట్టింటి వాళ్లకు సమాచారం ఇచ్చి పారిపోయిన భర్త, అత్త, మామలు..

అయితే అంగూరి బేగం చనిపోయిందని భర్త, అత్త, మామలు ఆమె పుట్టింటి వాళ్లకు ఫోన్ చేసి చెప్పారు. దీంతో అంగూరి తల్లిదండ్రులు హుటాహుటిన అక్కడకు చేరుకున్నారు. కానీ అప్పటికే అంగూరి భర్త, అత్త, మామలు అక్కడి నుంచి పారిపోయారు. కేవలం కూతురి మృతదేహం, ఆమె పిల్లలు మాత్రమే అక్కడ ఉన్నారు. దీంతో అంగూరు తల్లిదండ్రులు, బంధువులు పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ముందుగా అంగూరి బేగం మృతదేహాన్ని పుర్నియా సర్దార్ హాస్పిటల్ అండ్ మెడికల్ కాలేజీకి తరలించారు. పోస్టుమార్టం నిర్వహించిన వైద్యులు ఆమెను విపరీతంగా కొట్టడం వల్ల చనిపోయిందని నిర్ధారించారు. అలాగే ఆమె ప్రస్తుతం ఏడు నెలల గర్భిణీ అని తెలిపారు. అనంతరం మృతదేహాన్ని అంగూరి బేగం తల్లిదండ్రులకు అప్పగించారు.

"ఏడు నెలల గర్భిణీ అని కూడా చూడకుండా కొట్టి చంపేశారు"

"మా సోదరిని ఓ రిఫ్రిజిరేటర్ కోసం వాళ్ల అత్తింటి వాళ్లు హత్య చేశారు. ఏడు నెలల గర్భిణీ అని కూడా చూడకుడా భర్తతో పాటు అత్తా,మామలు శారీరకంగా హింసించి మరీ చంపేశారు" అని మృతురాలు అంగూరి బేగం సోదరుడు కౌషర్ రాజా తెలిపారు.  

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Assembly Sessions: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిరవధిక వాయిదా, 8 కీలక బిల్లుల ఆమోదం
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిరవధిక వాయిదా, 8 కీలక బిల్లుల ఆమోదం
Adilabad Crime News: బాలికను కిడ్నాప్ చేసి యువకుడు అఘాయిత్యం- స్థానికుల రాళ్లదాడిలో సీఎ, ఎస్ఐలకు గాయాలు
బాలికను కిడ్నాప్ చేసి యువకుడు అఘాయిత్యం- స్థానికుల రాళ్లదాడిలో సీఎ, ఎస్ఐలకు గాయాలు
2025 Apple Launching Products: 2025లో యాపిల్ లాంచ్ చేసే ప్రొడక్ట్స్ ఇవే - ఐఫోన్లు కాకుండా ఇంకేం వస్తున్నాయి?
2025లో యాపిల్ లాంచ్ చేసే ప్రొడక్ట్స్ ఇవే - ఐఫోన్లు కాకుండా ఇంకేం వస్తున్నాయి?
Komatireddy Venkat Reddy: శ్రీ తేజ్ తండ్రికి రూ.25 లక్షల చెక్ అందించిన మంత్రి కోమటిరెడ్డి, అనంతరం కీలక వ్యాఖ్యలు
శ్రీ తేజ్ తండ్రికి రూ.25 లక్షల చెక్ అందించిన మంత్రి కోమటిరెడ్డి, అనంతరం కీలక వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సినిమా వాళ్లకి మానవత్వం లేదా, సీఎం రేవంత్ ఆగ్రహంనేను సీఎంగా ఉండగా సినిమా టికెట్‌ రేట్లు పెంచను, సీఎం రేవంత్ షాకింగ్ కామెంట్స్చనిపోయారని తెలిసినా చేతులూపుకుంటూ వెళ్లాడుశ్రీతేజ్‌ హెల్త్‌‌ బులెటిన్ రిలీజ్, బిగ్ గుడ్ న్యూస్!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Assembly Sessions: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిరవధిక వాయిదా, 8 కీలక బిల్లుల ఆమోదం
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిరవధిక వాయిదా, 8 కీలక బిల్లుల ఆమోదం
Adilabad Crime News: బాలికను కిడ్నాప్ చేసి యువకుడు అఘాయిత్యం- స్థానికుల రాళ్లదాడిలో సీఎ, ఎస్ఐలకు గాయాలు
బాలికను కిడ్నాప్ చేసి యువకుడు అఘాయిత్యం- స్థానికుల రాళ్లదాడిలో సీఎ, ఎస్ఐలకు గాయాలు
2025 Apple Launching Products: 2025లో యాపిల్ లాంచ్ చేసే ప్రొడక్ట్స్ ఇవే - ఐఫోన్లు కాకుండా ఇంకేం వస్తున్నాయి?
2025లో యాపిల్ లాంచ్ చేసే ప్రొడక్ట్స్ ఇవే - ఐఫోన్లు కాకుండా ఇంకేం వస్తున్నాయి?
Komatireddy Venkat Reddy: శ్రీ తేజ్ తండ్రికి రూ.25 లక్షల చెక్ అందించిన మంత్రి కోమటిరెడ్డి, అనంతరం కీలక వ్యాఖ్యలు
శ్రీ తేజ్ తండ్రికి రూ.25 లక్షల చెక్ అందించిన మంత్రి కోమటిరెడ్డి, అనంతరం కీలక వ్యాఖ్యలు
Revanth Reddy on Sandhya Theatre Incident: తొక్కిసలాటకు కారణం అల్లు అర్జున్! అరెస్ట్ చేస్తామంటే థియేటర్ నుంచి వెళ్లిపోయారు: రేవంత్ రెడ్డి
తొక్కిసలాటకు కారణం అల్లు అర్జున్! అరెస్ట్ చేస్తామంటే థియేటర్ నుంచి వెళ్లిపోయారు: రేవంత్ రెడ్డి
Credit Card Safety Tips: మీ క్రెడిట్ కార్డు డిటైల్స్ సేఫ్‌గా ఉంచాలనుకుంటున్నారా? - ఆన్‌లైన్ షాపింగ్‌లో ఇలా అస్సలు చేయకూడదు!
మీ క్రెడిట్ కార్డు డిటైల్స్ సేఫ్‌గా ఉంచాలనుకుంటున్నారా? - ఆన్‌లైన్ షాపింగ్‌లో ఇలా అస్సలు చేయకూడదు!
Aus VS Ind Series: ట్రావిస్ 'హెడ్' కాదు.. ఇండియాకు 'హెడేక్'- ఆసీస్ బ్యాటర్ పై భారత మాజీ కోచ్ ప్రశంసల జల్లు
ట్రావిస్ 'హెడ్' కాదు.. ఇండియాకు 'హెడేక్'- ఆసీస్ బ్యాటర్ పై భారత మాజీ కోచ్ ప్రశంసల జల్లు
Fuel Filling Tips: బైక్ లేదా పెట్రోల్‌ను ట్యాంక్ ఫుల్ చేస్తున్నారా? - అయితే ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిందే!
బైక్ లేదా పెట్రోల్‌ను ట్యాంక్ ఫుల్ చేస్తున్నారా? - అయితే ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిందే!
Embed widget