Online Bettings Suicide : ఆన్లైన్ బెట్టింగులకు మరో ప్రాణం బలి, అప్పుల పాలై యువకుడు ఆత్మహత్య
Online Bettings Suicide : ఆన్ లైన్ బెట్టింగులు మరో ప్రాణాన్ని బలితీసుకున్నాయి. ఆన్ లైన్ బెట్టింగులతో అప్పుల పాలై ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. సాయి కిషన్ అనే యువకుడు బీటెక్ పూర్తి చేసి ఉద్యోగం రాకపోవడంతో ఇంటివద్దనే ఉంటున్నాడు.
Online Bettings Suicide : తెలంగాణ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండల కేంద్రంలోని పాండవ బస్తీలో సాయి కృష్ణ అనే యువకుడు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. సాయి కిషన్ బీటెక్ పూర్తి చేసి ఇంట్లోనే ఉంటూ ఆన్ లైన్ బెట్టింగ్ లకు అలవాటపడ్డాడు. ఆన్లైన్ గేమ్ లలో బెట్టింగులు వేసి అప్పులు కావడంతో మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడు. సాయి కిషన్ తండ్రి కూడా గతంలో ఉరి వేసుకోని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. సాయి కిషన్ మృతితో ఆ కాలనీలో విషాదఛాయలు అలముకున్నాయి.
భార్యాభర్తలు సూసైడ్
జగిత్యాల రూరల్ మండలం రఘురాములకోటలో పురుగుల మందు తాగి భార్యభర్తలు ఆత్మహత్య చేసుకుంది. సింహారాజు మునింధర్(65), సులోచన(60) పలు రకాల ఇబ్బందులతో మనస్థాపానికి గురి అయ్యి ఇంట్లోనే ఆత్మహత్య చేసుకున్నారు. ఆదివారం అర్ధరాత్రి తరువాత పురుగుల మందు తాగి భార్య భర్తలు ఆత్మహత్య చేసుకున్నారు. ఇంట్లో ఓ గదిలో పురుగుల మందు సేవించి పడి ఉండడం చూసిన కుటుంబ సభ్యులు హుటాహుటిన జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రికి తరలించేలోపు ఇద్దరూ మృతిచెందారని వైద్యులు తెలిపారు. వారి కుమారుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు జగిత్యాల రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
మద్యానికి బానిసై
కాకినాడ జిల్లా సర్పవరం ఎస్ఐ ఆత్మహత్య మరువక ముందే మరో ఘటన చోటుచేసుకుంది. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్లలో ఏఆర్ కానిస్టేబుల్ సుబ్బారావు ఆత్మహత్యకు పాల్పడడం కలకలం రేపింది. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్లలోని సాయుధ పోలీసు కార్యాలయం ఆవరణలో ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ మర్రిపాడు సుబ్బారావు(50) సోమవారం ఉరేసుకుని సూసైడ్ చేసుకున్నాడు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం కానిస్టేబుల్ సుబ్బారావు సోమవారం ఉదయం విధులకు హాజరై రోల్‌కాల్ తర్వాత సమీపంలోని శిథిలావస్థ భవనంలో వెళ్లి ఉరేసుకున్నాడని తెలిపారు. మద్యానికి బానిసైన సుబ్బారావు కుటుంబ సభ్యులతో గోడవపడేవారని పోలీసులు అన్నారు. ఆదివారం గ్రామంలో మరిడమ్మ జాతర జరిగిందని, సుబ్బారావు అతిగా మద్యం తాగడంతో అతనికి కుటుంబ సభ్యుల మధ్య మరోసారి గొడవ జరిగినట్లు తెలుస్తోంది. దీంతో మనస్తాపానికి గురైన సుబ్బారావు ఇవాళ ఆత్మహత్యకు పాల్పడినట్లు అధికారులు తెలిపారు. మృతుడికి ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుమారుడు రాజారావు ఏఆర్ కార్యాలయంలో ఎస్‌టీఎఫ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. సుబ్బారావు అల్లుడు బాబు నాయుడు కూడా ఏఆర్ కార్యాలయంలో ఆర్‌ఎస్సైగా పనిచేస్తున్నారు.
Also Read : Child Marriage : బర్త్ డే వేడుకల ముసుగులో బాల్య వివాహం, 12 ఏళ్ల బాలికకు 35 ఏళ్ల వ్యక్తితో పెళ్లి