Gummadi Sandhya Rani: మంత్రి సంధ్యారాణి ఎస్కార్ట్ వాహనానికి ప్రమాదం - భద్రతా సిబ్బంది సహా ముగ్గురికి గాయాలు
Vijayanagaram News: విజయనగరం జిల్లా రామభద్రాపురం మండలం భూసాయివలసలో మంత్రి సంధ్యారాణి ఎస్కార్ట్ వాహనాన్ని ఓ వ్యాన్ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు భద్రతా సిబ్బంది సహా ఐదుగురికి గాయాలయ్యాయి.
Minister Gummadi Sandhya Rani Escort Vehilce Accident: మంత్రి గుమ్మడి సంధ్యారాణి ఎస్కార్ట్ వాహనానికి ప్రమాదం తప్పింది. విజయనగరం జిల్లా రామభద్రాపురం మండలం భూసాయివలసలోని అరికతోట వద్ద ఎస్కార్ట్ వాహనాన్ని వ్యాన్ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు భద్రతా సిబ్బందితో పాటు వ్యానులోని ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. మంత్రి మెంటాడ పర్యటనకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. సంధ్యారాణి, పోలీసులు క్షతగాత్రులను అంబులెన్సులో ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. .
'మద్యం మత్తులో ఢీకొట్టాడు'
ఈ ఘటనపై మంత్రి సంధ్యారాణి స్పందించారు. గురువారం ఉదయం ఓ ముఖ్యమైన కార్యక్రమం మీద వెళ్తుంటే అవతలి వ్యక్తి మద్యం తాగి వచ్చి తమ పోలీస్ ఎస్కార్ట్ వాహనాన్ని ఢీకొట్టాడని మంత్రి తెలిపారు. ఈ ఘటనలో మా కానిస్టేబుళ్లు ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతానికి ఎవరికీ ఏమీ కాలేదు. వ్యాన్ డ్రైవర్ ఉదయాన్నే 7 గంటలకే తాగేసి ఇలా వాహనాన్ని నడపాడని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. డ్రైవరైన యువకునికి నిండా పాతికేళ్లు కూడా ఉండవని అన్నారు. తమ ఎస్కార్ట్ వాహన డ్రైవరు ప్రాణాలు తెగించి అందర్నీ కాపాడాడని చెప్పారు.