X

Guntur Crime: ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య... మృతదేహాన్ని కాలువలో పడేసి డ్రామా

గుంటూరు జిల్లా పొన్నూరులో ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిందో మహిళ. గుట్టుచప్పుడు కాకుండా భర్త మృతదేహాన్ని కాలువలో పడేశారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో అసలు విషయం బయటపడింది.

FOLLOW US: 

వివాహేతర సంబంధం... ఇటీవల తరచూ హత్య కేసుల్లో పోలీసులు చెబుతున్న ముఖ్య కారణం. వివాహేతర సంబంధంతో భార్యను చంపిన భర్త లేదా ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య అన్న వార్తలు వింటుంటాం. అలాంటి ఘటనే గుంటూరు జిల్లాలో చోటుచేసుకుంది. గుంటూరు జిల్లా పొన్నూరు భావనగర్‌ కాలనీలో జలచిత్ర నాగరాజు అనే వ్యక్తి దారుణంగా హత్యకు గురయ్యాడు. ఈ హత్యపై దర్యాప్తు చేసిన పోలీసులకు నివ్వెరపోయే విషయాలు తెలిశాయి. నాగరాజును అతడి భార్య హత్య చేసింది. భర్తను చంపడానికి వెనుక కారణం వివాహేతర సంబంధం అని పోలీసులు తేల్చారు. ప్రియుడితో కలిసి భర్తను హతమార్చింది. రెండు రోజుల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. భర్తను హత్య చేసి మృతదేహాన్ని అప్పికట్ల కాలువలో పడేశారు. మృతదేహాన్ని పొన్నూరు అర్బన్‌ పోలీసులు వెలికితీయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. 

Also Read: Hyderabad Crime: నకిలీ కాల్ సెంటర్ తో రూ.50 కోట్ల మోసం... క్రెడిట్ కార్డులు క్లోనింగ్ చేస్తున్న ముఠా గుట్టురట్టు

ప్రియుడితో కలిసి హత్య

గుంటూరు జిల్లా తాడేపల్లికి చెందిన నాగరాజుకు షెమా సోనీతో ఎనిమిదేళ్ల క్రితం పెళ్లి జరిగింది. భార్యభర్తలు పొన్నూరులో ఇల్లు అద్దెకు తీసుకొని జీవిస్తున్నారు. షెమా సోనీకి అదే కాలనీకి చెందిన మరో వ్యక్తితో పరిచయం ఏర్పడింది. వీళ్లద్దరూ కలిసి నాగరాజును హత్యకు ప్లాన్ చేశారు. ఈ నెల 7న నాగరాజును ఇంట్లోనే హత్య చేసి బాపట్ల మండలం అప్పిగట్ల సమీపంలోని కాలువలో మృతదేహాన్ని పడేశారు. నాగరాజు కనిపించకపోయే సరికి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై విచారణ చేపట్టిన పోలీసులు అసలు విషయం రాబట్టారు. నాగరాజు భార్యను విచారించగా హత్య చేసినట్లు ఒప్పుకున్నారు. అనంతరం అప్పికట్ల కాలువలో గాలింపు చర్యలు చేపట్టారు. గురువారం నాగరాజు మృతదేహం లభ్యమైంది. పోస్టుమార్టం తర్వాత నాగరాజు మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు అర్బన్‌ సీఐ శరత్‌బాబు వెల్లడించారు. 

Also Read: Hyderabad: కత్తితో బెదిరించి గృహిణిపై ఆటో డ్రైవర్ రేప్, మరోఘటనలో మైనర్‌పై అత్యాచారం.. రచయిత అరెస్టు

Also Read: కిచిడి వండుకుని తింటే అరెస్ట్ చేస్తారా ? మరి దొంగతనానికి వెళ్లి ఆ పని చేస్తే చేయరా ?

Also read: పిల్ల మామూలుది కాదు, గుద్దితే చెట్లు విరగాల్సిందే... ‘వరల్డ్స్ స్ట్రాంగెస్ట్ గర్ల్’ వీడియో చూడండి

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Tags: AP News AP Crime news Guntur news wifer murder husband ponnuru

సంబంధిత కథనాలు

Hyderabad: రోజూ రాత్రి మేడపైకి వెళ్లొస్తున్న బాలిక.. ఒంటిపై పంటి గాట్లు, ఆరా తీసి షాకైన పేరెంట్స్!

Hyderabad: రోజూ రాత్రి మేడపైకి వెళ్లొస్తున్న బాలిక.. ఒంటిపై పంటి గాట్లు, ఆరా తీసి షాకైన పేరెంట్స్!

Crime News: డబ్బు కోసం పోలీస్‌ బాస్ వక్రమార్గం.. నకిలీ డీఎస్పీ పేరుతో కోట్లు మాయం..

Crime News: డబ్బు కోసం పోలీస్‌ బాస్ వక్రమార్గం.. నకిలీ డీఎస్పీ పేరుతో కోట్లు మాయం..

Poisonous Snake: పాముకు ముద్దులు పెడుతూ ఫొటోలకు పోజులు.. కొన్ని గంటలకు ఏమైందంటే..!

Poisonous Snake: పాముకు ముద్దులు పెడుతూ ఫొటోలకు పోజులు.. కొన్ని గంటలకు ఏమైందంటే..!

Fake Pop Up: పోర్న్ వీక్షకులను టార్గెట్ చేస్తున్న సైబర్ కేటుగాళ్లు... ఫేక్ పాప్ అప్ తో కంప్యూటర్ బ్లాక్... ఎలా అన్ బ్లాక్ చేయాలంటే...?

Fake Pop Up: పోర్న్ వీక్షకులను టార్గెట్ చేస్తున్న సైబర్ కేటుగాళ్లు... ఫేక్ పాప్ అప్ తో కంప్యూటర్ బ్లాక్... ఎలా అన్ బ్లాక్ చేయాలంటే...?

Visakha Crime: ముందు గంజాయి గ్యాంగ్ వెనుక పోలీసులు... నర్సీపట్నంలో భారీ ఛేజ్... చివరకు

Visakha Crime: ముందు గంజాయి గ్యాంగ్ వెనుక పోలీసులు... నర్సీపట్నంలో భారీ ఛేజ్... చివరకు
SHOPPING
Kitchen Appliances
LAPTOP AND ACCESORIES
Mobiles Deal
Diwali Gift
Kitchen
Make Up
Top Mobiles
Immunity Booster

టాప్ స్టోరీస్

Republic day 2022: వాయుసేన శకటంతో 'శివాంగి' కవాతు.. రఫేల్ జెట్ తొలి మహిళా పైలట్ విశేషాలివే!

Republic day 2022: వాయుసేన శకటంతో 'శివాంగి' కవాతు.. రఫేల్ జెట్ తొలి మహిళా పైలట్ విశేషాలివే!

IPL 2022: ఇండియన్‌ క్రికెట్లో నెక్స్ట్‌ బిగ్‌థింగ్‌ అతడే! కేఎల్‌ రాహుల్‌ జోస్యం నిజమయ్యేనా?

IPL 2022: ఇండియన్‌ క్రికెట్లో నెక్స్ట్‌ బిగ్‌థింగ్‌ అతడే! కేఎల్‌ రాహుల్‌ జోస్యం నిజమయ్యేనా?

Republic Day 2022: జాంటీ రోడ్స్‌కు మోదీ లేఖ! ఇండియాకు నిజమైన బ్రాండ్‌ అంబాసిడర్‌ అని ప్రశంస

Republic Day 2022: జాంటీ రోడ్స్‌కు మోదీ లేఖ! ఇండియాకు నిజమైన బ్రాండ్‌ అంబాసిడర్‌ అని ప్రశంస

PRC Issue In AP: ఉద్యోగులను చంపడానికేనా బుగ్గనకు మంత్రి పదవి ఇచ్చిందీ? పీఆర్సీ సాధన సమితి ఆగ్రహం

PRC Issue In AP: ఉద్యోగులను చంపడానికేనా బుగ్గనకు మంత్రి పదవి ఇచ్చిందీ? పీఆర్సీ సాధన సమితి ఆగ్రహం