X

Anantapur Road Accident: అనంతపురంలో ఘోర రోడ్డు ప్రమాదం... కారును ఢీకొన్న లారీ, నలుగురు మృతి

అనంతపురం జిల్లా జోలపురంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు-లారీ ఢీకొన్న ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. ఓ చిన్నారికి తీవ్రగాయాలయ్యాయి.

FOLLOW US: 

అనంతపురం జిల్లా బత్తలపల్లి మండలం జోలపురం వద్ద జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. అనంతపురం నుంచి కదిరి వెళ్తోన్న కారును ఎదురుగా వస్తున్న లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. నాలుగేళ్ల చిన్నారి ప్రాణాపాయం నుంచి బయటపడింది. మృతుల్లో ఇద్దరు మహిళలు ఇద్దరు పురుషులు ఉన్నారు. బత్తలపల్లి పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. మృతదేహాలు కారులో ఇరుక్కుపోవడంతో బయటకు తీసేందుకు పోలీసులు, స్థానికులు ప్రయత్నిస్తున్నారు. 

Also Read: మాజీ మిస్ తెలంగాణ మరోసారి ఆత్మహత్యాయత్నం... కీసర బ్రిడ్జిపై నుంచి మున్నేరులో దూకిన యువతి

నలుగురు మృతి, చిన్నారికి తీవ్రగాయాలు

చీకటి పడటంతో మృతదేహాలను బయటికి తీయటానికి కాస్త సమయం పట్టే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు. అనంతపురం టు చెన్నై జాతీయ రహదారి కావడంతో రోడ్డుపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. పోలీసులు ట్రాఫిక్ ను మళ్లించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రమాదంలో మృతి చెందిన వారు తనకల్లు మండలం రెడ్డివారిపల్లి గ్రామస్తులుగా పోలీసులు గుర్తించారు.  ప్రమాదంలో నలుగురు మృతి చెందగా, ఒకరి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు.

Also Read: పుట్టింటికి వచ్చిన ఇద్దరు యువతులు.. చివరికి చెరువులో మూడు శవాలు, ఏం జరిగిందంటే..

మృతుల వివరాలు 

కె. మొహమ్మద్ ఆసిఫ్(25), జి. రెడ్డి బాబాజీ, జి.రేష్మా, జి.అమ్మాజ్జీ ఈ ప్రమాదంలో మృతి చెందారు. నలుగురి మృతదేహాలను ధర్మవరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. గాయపడిన జి. తస్లిం భాను (4) బత్తలపల్లి ఆర్డీటీ హాస్పిటల్ నుంచి మెరుగైన చికిత్స కోసం అనంతపురం సవేరా హాస్పిటల్ కు తరలించారు. 

Also Read: ఇల్లు అద్దెకు తీసుకున్నారు, కొన్నాళ్లకి పాడు పనులు స్టార్ట్.. గుట్టు ఇలా బయటికొచ్చింది

కర్నూలులో రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి

కర్నూలు నగరంలోని బిర్లా కాంపౌండ్ వద్ద రోడ్డు దాటుతున్న ఇద్దరిని ద్విచక్ర వాహనం ఢీకొట్టింది. ప్రమాదంలో కింద పడిన ఓ వ్యక్తిని వెనుక నుంచి వస్తున్న బోలోరో ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కింద పడిన వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు పత్తికొండ నియోజకవర్గంలోని కటారుకొండ గ్రామానికి చెందిన బాలరాజుగా పోలీసులు గుర్తించారు. ట్రాఫిక్ డీఎస్పీ మహబూబ్ బాషా ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. ప్రమాద దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. 

Also Read: ఇంట్లో ఒంటరిగా ఆరేళ్ల బాలిక.. లోపలికి వచ్చిన సర్పంచ్ భర్త, చివరికి..

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Tags: Road Accident anantapur road accident Anantapur latest news jolapuram car accident four dead in anantapur accident

సంబంధిత కథనాలు

Hyderabad Crime:  పగలు రెక్కీ రాత్రి చోరీలు... పాత నేరస్థుడి పక్కా ప్లాన్... సరూర్ నగర్ చోరీ కేసును ఛేదించిన పోలీసులు

Hyderabad Crime: పగలు రెక్కీ రాత్రి చోరీలు... పాత నేరస్థుడి పక్కా ప్లాన్... సరూర్ నగర్ చోరీ కేసును ఛేదించిన పోలీసులు

Ganja Smuggling: అమెజాన్ లో  కరివేపాకు పేరుతో గంజాయి స్మగ్లింగ్ కేసు.. ఏడుగురు అరెస్టు

Ganja Smuggling: అమెజాన్ లో  కరివేపాకు పేరుతో గంజాయి స్మగ్లింగ్ కేసు.. ఏడుగురు అరెస్టు

Visakha Crime: విశాఖ జిల్లాలో విషాదం... పసికందును నీళ్ల డ్రమ్ములో పడేసిన తల్లి...

Visakha Crime: విశాఖ జిల్లాలో విషాదం... పసికందును నీళ్ల డ్రమ్ములో పడేసిన తల్లి...

Crime News: ఫ్రెండ్‌ లవర్‌పై కన్నేశాడు.. శవమై కనిపించాడు... సినిమా థ్రిల్లర్‌కు మించిన క్రైమ్‌ లవ్‌స్టోరీ..!

Crime News: ఫ్రెండ్‌ లవర్‌పై కన్నేశాడు.. శవమై కనిపించాడు... సినిమా థ్రిల్లర్‌కు మించిన క్రైమ్‌ లవ్‌స్టోరీ..!

Student Death: హత్యా..? ఆత్మహత్యా..? నెల్లూరు జిల్లాలో ఇంజినీరింగ్ స్టూడెంట్ అనుమానాస్పద మృతి.. 

Student Death: హత్యా..? ఆత్మహత్యా..? నెల్లూరు జిల్లాలో ఇంజినీరింగ్ స్టూడెంట్ అనుమానాస్పద మృతి.. 
SHOPPING
Kitchen Appliances
LAPTOP AND ACCESORIES
Mobiles Deal
Diwali Gift
Kitchen
Make Up
Top Mobiles
Immunity Booster

టాప్ స్టోరీస్

Balakrishna Speech: సినిమాకు ప్రభుత్వాలు సహకరించాలి.. అఖండ వేదికపై బాలయ్య స్పీచ్.. మరో సినిమాపై హింట్.. దర్శకుడు ఎవరంటే?

Balakrishna Speech: సినిమాకు ప్రభుత్వాలు సహకరించాలి.. అఖండ వేదికపై బాలయ్య స్పీచ్.. మరో సినిమాపై హింట్.. దర్శకుడు ఎవరంటే?

Sirivennela: సిరివెన్నెలకి అస్వస్థత.. కిమ్స్ లో ట్రీట్మెంట్.. స్పందించిన కుటుంబసభ్యులు

Sirivennela: సిరివెన్నెలకి అస్వస్థత.. కిమ్స్ లో ట్రీట్మెంట్.. స్పందించిన కుటుంబసభ్యులు

Nothing Ear 1: ఈ సూపర్ ఇయర్‌బడ్స్ ధర భారీ తగ్గింపు.. ఏకంగా రూ.వేయికి పైగా.. ఇప్పుడు ఎంతంటే?

Nothing Ear 1: ఈ సూపర్ ఇయర్‌బడ్స్ ధర భారీ తగ్గింపు.. ఏకంగా రూ.వేయికి పైగా.. ఇప్పుడు ఎంతంటే?

Akhanda Trailer 2: థియేటర్లలో మాస్ జాతర ఖాయం.. తల తెంచుకుని వెళ్లిపోవడమే.. రెండో ట్రైలర్ వచ్చేసింది!

Akhanda Trailer 2: థియేటర్లలో మాస్ జాతర ఖాయం.. తల తెంచుకుని వెళ్లిపోవడమే.. రెండో ట్రైలర్ వచ్చేసింది!