Anakapalli News : అనకాపల్లి జిల్లాలో దారుణం, వివాహితపై నలుగురు మైనర్లు అత్యాచారం!
Anakapalli News : అనకాపల్లి జిల్లాలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. మద్యం మత్తులు నలుగురు మైనర్లు వివాహితపై అత్యాచారం చేశారు.
Anakapalli News : అనకాపల్లి జిల్లా రావికమతం దొండపూడి గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. నలుగురు మైనర్ యువకులు మద్యం మత్తులో ఓ వివాహితపై అత్యాచారం చేశారు. భర్త ఫిర్యాదుతో ఈ ఘటన వెలుగు చూసింది. దిశ డీఎస్పీ మహేశ్వర రావు ఆధ్వర్యంలో ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఈ ఘటన సంచలనం అయింది. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
దిల్లీలో దారుణం
దిల్లీలో అత్యంత దారుణ ఘటన జరిగింది. ఆరు నెలల క్రితం జరిగిన శ్రద్ధ అనే యువతి హత్య కేసును ఛేదించినట్లు పోలీసులు ప్రకటించారు. ఈ కేసులో అఫ్తాబ్ అనే వ్యక్తిని అరెస్టు చేశామని దిల్లీ పోలీసులు సోమవారం తెలిపారు. అయితే ఈ కేసు దర్యాప్తులో షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. నిందితుడు తనతో సహజీవనం చేసిన శ్రద్ధ అనే యువతిని చంపేసి, మృతదేహాన్ని 35 ముక్కలుగా నరికి నగరంలోని వివిధ ప్రదేశాలలో వాటిని పారేశాడని దర్యాప్తులో తేలింది.
" అఫ్తాబ్ ఒక ఫ్రిజ్‌ని తీసుకువచ్చాడు. తనతో సహజీవనం చేసిన అమ్మాయిని చంపేసి.. మృతదేహాన్ని ముక్కలుగా నరికి.. వాటిని 18 రోజుల పాటు ఆ ఫ్రిజ్‌లో ఉంచాడు. ఆ తర్వాత అతను వాటిని నగరంలోని వివిధ ప్రాంతాల్లో పారేశాడు. "-దిల్లీ పోలీసులు
అసలేం జరిగింది?
అఫ్తాబ్, శ్రద్ధ.. ముంబయిలోని ఓ కాల్ సెంటర్‌లో పనిచేశారు. అక్కడ వారు మొదట కలుసుకున్నారు. తరువాత డేటింగ్ ప్రారంభించారు. ఆమె కుటుంబం వారి సంబంధాన్ని ఆమోదించకపోవడంతో ఈ జంట దిల్లీకి పారిపోయి లివ్-ఇన్ రిలేషన్‌షిప్‌లో జీవిస్తున్నారు. అయితే శ్రద్ధా తల్లిదండ్రులు మాత్రం.. ఆమె సోషల్ మీడియా పోస్ట్‌ల ద్వారా తమ కుమార్తె యోగక్షేమాలను తెలుసుకుంటున్నారు. కానీ చాలా కాలంగా ఆమె సోషల్ మీడియా ఖాతాలో ఎటువంటి అప్‌డేట్ రాకపోవడంతో శ్రద్ధ తండ్రి దిల్లీకి వచ్చారు. తన కూతురు వివరాలు తెలియకపోవడంతో ఆమె తండ్రి దిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
అఫ్తాబ్‌పై అనుమానం
తన కుమార్తె ముంబయిలోని కాల్ సెంటర్‌లో పనిచేసేదని, అక్కడ అఫ్తాబ్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడిందని, వారి స్నేహం సన్నిహితంగా మారిందని శ్రద్ధ తండ్రి ఫిర్యాదులో పేర్కొన్నారు. వారిద్దరూ ఒకరినొకరు ఇష్టపడటం ప్రారంభించారని, అయితే కుటుంబం దానిని అంగీకరించలేదని శ్రద్ధా తండ్రి ఆరోపించారు. దీంతో అతని కూతురు, అఫ్తాబ్ ముంబయి వదిలి దిల్లీకి వచ్చి ఇక్కడి ఛతర్‌పుర్ ప్రాంతంలో ఉంటున్నట్లు తెలిపారు. ఆయన ఫిర్యాదు మేరకు దిల్లీ పోలీసులు దర్యాప్తు ప్రారంభించి నిఘా ద్వారా అఫ్తాబ్‌ను పట్టుకున్నారు. అఫ్తాబ్‌ను ప్రశ్నించగా, అమ్మాయి తనను పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేస్తోందని, దీని వల్ల వారి మధ్య తరచూ గొడవలు జరగినట్లు తెలిపాడు. మే నెలలో శ్రద్ధాను దారుణంగా చంపి, ఆమె మృతదేహాన్ని ముక్కలుగా నరికి.. నగరంలోని పలు ప్రాంతాల్లో పారేసినట్లు ఒప్పుకున్నాడు.
Also Read : నిజామాబాద్‌లో పాలిటెక్నిక్ విద్యార్థి సూసైడ్- పరీక్షల భయమేనంటున్న ఫ్రెండ్స్!