By: ABP Desam | Updated at : 26 Jan 2023 03:36 PM (IST)
Edited By: Satyaprasad Bandaru
గుండెపోటుతో వరుడు మృతి
Adilabad News : మరికొన్ని గంటల్లో పెళ్లి బాజాలు మోగాల్సిన ఇంట్లో విషాదం నెలకొంది. గుండెపోటుతో పెళ్లి కొడుకు మృతిచెందడంతో ఆ కుటుంబం విషాదంలో మునిగిపోయింది. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరులో ఈ ఘటన జరిగింది. రావుల శంకరయ్యచారి, భూలక్ష్మి దంపతుల కుమారుడు రావుల సత్యనారాయణాచారి(34)కు జగిత్యాల జిల్లా మెట్‌పల్లికి చెందిన యువతితో శుక్రవారం వివాహం నిర్ణయించారు. పెళ్లి ఏర్పాట్లలో ఉన్న సత్యనారాయణాచారి గుండెపోటుతో ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. అతడిని గమించిన కుటుంబసభ్యులు ఉట్నూరులోని ఓ ఆస్పత్రికి తరలించారు. సత్యనారాయణాచారి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండటంతో ఆదిలాబాద్ రిమ్స్‌కు తరలించారు. రిమ్స్ లో చికిత్స పొందుతూ గురువారం సత్యనారాయణాచారి మృతిచెందాడని ఆయన బంధువులు తెలిపారు. మరికొన్ని గంటల్లో పెళ్లిబాజాలు మోగాల్సిన ఇంట్లో పెళ్లికొడుకు చనిపోవడంతో కుటుంబసభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.
ఇండోనేషియా విహారయాత్రకు వెళ్లిన సాఫ్ట్ వేర్ ఉద్యోగి మృతి
హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి సాఫ్ట్ వేర్ ఉద్యోగిగా పని చేస్తున్నాడు. ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ క్రమంలోనే గ్రూప్-1 మెయిన్స్ కు అర్హత కూడా సాధించాడు. భార్యతో కలిసి వెకేషన్ కోసం ఇండోనేషియా వెళ్లాడు. అక్కడే ప్రమాదవశాత్తు సముద్రంలో పడి చనిపోయాడు. దీంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.
అసలేం జరిగిందంటే..?
హైదరాబాద్ నాగోల్ పీఎస్ సమీపంలోని అజయ్ నగర్ లో నివాసం ఉండే రాముని రవీందర్ కు ఇద్దరు కుమారులు. వీరిలో చిన్నవాడైన వంశీకృష్ణ(27) సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. ప్రభుత్వ ఉద్యోగులకు ప్రిపేర్ అవుతూనే గ్రూప్-1 ఫలితాల్లో మెయిన్స్ అర్హత సాధించాడు. గతేడాది జూన్ 23వ తేదీన కర్మాన్ ఘాట్ కు చెందిన యువతితో అతడికి వివాహం జరిగింది. ఈనెల 13వ తేదీన భార్య, ఇతర బంధువులతో కలిసి మలేసియా, ఇండోనేషియాలకు విహార యాత్ర కోసం వెళ్లారు. మొదట మలేసియా యాత్ర పూర్తయిన తర్వాత ఇండోనేషియాలోని బాలీకి వెళ్లారు. ఈనెల 22వ తేదీన ఆదివారం వంశీకృష్ణ బాలిలో సముద్ర గర్భంలోని అక్వేరియం సందర్శించేందుకు ఒంటరిగా వెళ్లాడు. ఈ క్రమంలోనే అక్కడి నిర్వాహకులు సూచించినట్లుగానే కాళ్లకు చెప్పులు, ఆక్సిజన్ సిలిండర్ ధరించి వెళ్లాడు. కానీ సముద్రంలోకి దిగి గల్లంతయ్యాడు.
భార్య అతని రాక కోసం చాలా సేపు ఎదురు చూసినా పైకి అతడు పైకి రాకపోవడంతో.. నిర్వాహకులకు తెలిపింది. లోపలికి వెళ్లి చూసిన నిర్వాహకులకు కూడా అతడు కనిపించకుండా పోవడంతో.. పోలీసులకు సమాచారం అందించారు. అక్కడి పోలీసులు సముద్రంలో గాలించి వంశీకృష్ణ మృతదేహాన్ని బయటకు తీశారు. అతను అప్పటికే మృతి చెందినట్లు గుర్తించారు. నగరంలో ఉన్న కుటుంబ సభ్యులకు సమాచారం అందడంతో వారు మంగళవారం ఉదయం బాలీకి బయలుదేరి వెళ్లారు అక్కడ పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని శుక్రవారం నగరానికి తీసుకొచ్చే అవకాశం ఉందని కుటుంబ సభ్యులు తెలిపారు. సముద్రంలో గల్లంతైన వంశీకృష్ణ నీటిలోకి వెళ్లాక భయపడడంతో గుండెపోటుతో మృతి చెందాడని అక్కడ పోలీసులు ప్రాథమిక సమాచారం ఇచ్చినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
TSPSC : పేపర్ లీకేజీ కేసు సీబీఐ కి వెళ్తుందా ? ఎవరేం వాదించారంటే ?
Tirupati Crime News: మైనర్‌పై వాలంటీర్ అత్యాచారయత్నం, నిందితుడిపై పోక్సో కేసు నమోదు
MLC Kavitha: సుదీర్ఘంగా కవితను విచారించిన ఈడీ, మళ్లీ నేడు రావాలని నోటీసులు
Mulugu District: మావోయిస్ట్ పార్టీకి చెందిన 8 మంది కొరియర్ లు అరెస్ట్
Gudivada News : గుడివాడలో పోలీస్ వర్సెస్ వీఆర్వో- చేయి కొరికిన వీఆర్వో, చెంపపై కొట్టిన లేడీ కానిస్టేబుల్
AP BJP Vs Janasena : అడిగినా పవన్ సపోర్ట్ ఇవ్వలేదు - సొంతంగా ఎదుగుతామని ఏపీ బీజేపీ ప్రకటన !
Rangamarthanda Movie Review - 'రంగమార్తాండ' రివ్యూ : ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం హీరోలుగా కృష్ణవంశీ తీసిన సినిమా
AP Skill Development: 'స్కిల్' డెవలప్ మెంట్ స్కామ్ లో చంద్రబాబు జైలుకు వెళ్లడం ఖాయం: మంత్రి అమర్నాథ్
1,540 ఆశా వర్కర్ల పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతి, వివరాలు ఇలా!