అన్వేషించండి

ACB Caught: ఒక్క బిల్లు క్లియర్ చేయాడానికి రూ. 15 లక్షల లంచం - రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన బల్దియా ఇంజినీర్

GHMC: బల్దియాలో ఇంజనీర్ల అవినీతిపై ఏసీబీ దృష్టి పెట్టింది. కూకట్ పల్లి ఇంజినీర్ ఒకర్ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది.

ACB caught the Superintendent Engineer Kukatpally:  హైదరాబాద్ నగరంలోని అవినీతి అధికారుల గుండెల్లో ఏసీబీ  మరోసారి రైళ్లు పరిగెత్తించింది. జీహెచ్‌ఎంసీ కూకట్‌పల్లి జోనల్‌ కార్యాలయంలో పనిచేస్తున్న సూపరింటెండింగ్‌ ఇంజనీర్‌ పొద్దుటూరి చిన్నారెడ్డి , ఒక కంప్యూటర్ ఆపరేటర్‌తో కలిసి బుధవారం ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. ఒక కాంట్రాక్టర్‌కు సంబంధించిన భారీ బిల్లును క్లియర్ చేయడానికి దాదాపు 10 శాతం కమీషన్ డిమాండ్ చేసి, లంచం తీసుకుంటుండగా అధికారులు వీరిని అదుపులోకి తీసుకున్నారు.

ఒక కాంట్రాక్టర్ పూర్తి చేసిన పనులకు సంబంధించి  రూ. 1.40 కోట్ల బిల్లు పెండింగ్‌లో ఉంది. ఈ బిల్లును ధృవీకరించి, ఆమోదం కోసం జోనల్ కమిషనర్‌కు పంపాల్సి ఉండగా, ఎస్‌ఈ చిన్నారెడ్డి లంచం డిమాండ్ చేశారు. ఇందులో భాగంగా రూ. 15 లక్షలు ఇస్తేనే ఫైలు ముందుకు కదులుతుందని తేల్చి చెప్పారు. ఈ మొత్తాన్ని నేరుగా కాకుండా, తన వద్ద పనిచేస్తున్న కంప్యూటర్ ఆపరేటర్ బి. ప్రవీణ్ కుమార్ ద్వారా అందజేయాలని సూచించారు.        

అధికారి వేధింపులు భరించలేక సదరు కాంట్రాక్టర్ ఏసీబీని ఆశ్రయించారు. బాధితుడి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు పక్కా వ్యూహంతో బుధవారం ఉదయం కూకట్‌పల్లి జోనల్ కార్యాలయంలో  ట్రాప్  ప్లాన్ చేశారు. ప్రవీణ్ కుమార్ ద్వారా ఎస్‌ఈ చిన్నారెడ్డి రూ. 15 లక్షల నగదును స్వీకరిస్తున్న తరుణంలో ఏసీబీ బృందం మెరుపు దాడి చేసి వారిని పట్టుకుంది. నిందితుల చేతుల నుంచి రసాయన పరీక్షల ద్వారా లంచం తీసుకున్నట్లు నిర్ధారించి, నగదును స్వాధీనం చేసుకున్నారు.            

ఈ ఘటనతో కూకట్‌పల్లి జోనల్ కార్యాలయంలో ఒక్కసారిగా కలకలం రేగింది. ఏసీబీ అధికారులు కేవలం లంచం కేసుతోనే ఆగకుండా, చిన్నారెడ్డి చాంబర్‌లో ఉన్న కీలక ఫైళ్లను, కంప్యూటర్ డేటాను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఆయనకు సంబంధించిన ఇతర ఆస్తుల వివరాలపై కూడా ఆరా తీస్తున్నారు. నిందితులిద్దరినీ అరెస్ట్ చేసి, హైదరాబాద్‌లోని ఏసీబీ ప్రత్యేక కోర్టులో హాజరుపరచనున్నారు. ఈ దాడితోనైనా ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతి తగ్గుతుందని ప్రజలు భావిస్తున్నారు.               


 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CPI leader Narayana: శ్రీవారికి భక్తుడిగా మారిన కమ్యూనిస్టు దిగ్గజం - బీజేపీ స్పందన ఇదే !
శ్రీవారికి భక్తుడిగా మారిన కమ్యూనిస్టు దిగ్గజం - బీజేపీ స్పందన ఇదే !
Ind vs Nam Match Highlights: T20 ప్రపంచ కప్‌లో అతిపెద్ద విజయాన్ని నమోదు చేసిన టీమిండియా! నమీబియాపై ఘనవిజయం!  
T20 ప్రపంచ కప్‌లో అతిపెద్ద విజయాన్ని నమోదు చేసిన టీమిండియా! నమీబియాపై ఘనవిజయం!  
YSRCP: మండలిలోనే పోరాటం - శాసనసభ బహిష్కరణ - వైసీపీఎల్పీ సమావేశంలో జగన్ నిర్ణయం
మండలిలోనే పోరాటం - శాసనసభ బహిష్కరణ - వైసీపీఎల్పీ సమావేశంలో జగన్ నిర్ణయం
Vishwak Sen: ఫ్లాపుల్లోనూ 'ఫంకీ'కి కెరీర్ బెస్ట్ బిజినెస్... విశ్వక్ సేన్‌ లాస్ట్ 5 ఫిలిమ్స్ కంపేరిజన్ చూస్తే?
ఫ్లాపుల్లోనూ 'ఫంకీ'కి కెరీర్ బెస్ట్ బిజినెస్... విశ్వక్ సేన్‌ లాస్ట్ 5 ఫిలిమ్స్ కంపేరిజన్ చూస్తే?
Advertisement

వీడియోలు

Mumbai Muscial Road | ముంబైలో ఏర్పాటు చేసిన ఈ రోడ్డు సంగీతం పాడుతుంది | ABP Desam
India va Namibia Match Preview | T20 World Cup 2026 లో మోత మొదలు పెడతారా.? | ABP Desam
Rohit Sharma on 2027 ODI World Cup | వన్డే వరల్డ్ కప్ భారత్ గెలుస్తుందని హిట్ మ్యాన్ ధీమా | ABP Desam
Saqlain Mushtaq on Ind vs Pak Match Pitch | మ్యాచ్ ఆడకముందే ఏడుపులు మొదలు | ABP Desam
Sanju Samson Playing Against Namibia | నమీబియాతో మ్యాచ్ లో బరిలోకి దిగనున్న సంజూ | ABP Desam
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CPI leader Narayana: శ్రీవారికి భక్తుడిగా మారిన కమ్యూనిస్టు దిగ్గజం - బీజేపీ స్పందన ఇదే !
శ్రీవారికి భక్తుడిగా మారిన కమ్యూనిస్టు దిగ్గజం - బీజేపీ స్పందన ఇదే !
Ind vs Nam Match Highlights: T20 ప్రపంచ కప్‌లో అతిపెద్ద విజయాన్ని నమోదు చేసిన టీమిండియా! నమీబియాపై ఘనవిజయం!  
T20 ప్రపంచ కప్‌లో అతిపెద్ద విజయాన్ని నమోదు చేసిన టీమిండియా! నమీబియాపై ఘనవిజయం!  
YSRCP: మండలిలోనే పోరాటం - శాసనసభ బహిష్కరణ - వైసీపీఎల్పీ సమావేశంలో జగన్ నిర్ణయం
మండలిలోనే పోరాటం - శాసనసభ బహిష్కరణ - వైసీపీఎల్పీ సమావేశంలో జగన్ నిర్ణయం
Vishwak Sen: ఫ్లాపుల్లోనూ 'ఫంకీ'కి కెరీర్ బెస్ట్ బిజినెస్... విశ్వక్ సేన్‌ లాస్ట్ 5 ఫిలిమ్స్ కంపేరిజన్ చూస్తే?
ఫ్లాపుల్లోనూ 'ఫంకీ'కి కెరీర్ బెస్ట్ బిజినెస్... విశ్వక్ సేన్‌ లాస్ట్ 5 ఫిలిమ్స్ కంపేరిజన్ చూస్తే?
Ambati Rambabu remanded: తగ్గేదే లే.. మళ్లీ రాజమండ్రి జైలుకు అంబటి రాంబాబు - లక్కీ డ్రా కేసులో 14 రోజుల రిమాండ్
తగ్గేదే లే.. మళ్లీ రాజమండ్రి జైలుకు అంబటి రాంబాబు - లక్కీ డ్రా కేసులో 14 రోజుల రిమాండ్
MS Dhoni:'ఎంఎస్ ధోని రూ. 10 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది', మద్రాస్ హైకోర్టు సంచలన ఆదేశాలు!
'ఎంఎస్ ధోని రూ. 10 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది', మద్రాస్ హైకోర్టు సంచలన ఆదేశాలు!
AP Liquor Scam: లిక్కర్ స్కామ్‌కు అసలు ఆర్కిటెక్ట్ రాజ్ కేసిరెడ్డే - బెయిల్ ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరణ
లిక్కర్ స్కామ్‌కు అసలు ఆర్కిటెక్ట్ రాజ్ కేసిరెడ్డే - బెయిల్ ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరణ
Cop elopes with history sheeter : ఖాకీ ప్రేమ.. ఖైదీతో పరార్- పెళ్లి పీటల మీద పోలీస్ వరుడికి షాకిచ్చిన మహిళా కానిస్టేబుల్!
ఖాకీ ప్రేమ.. ఖైదీతో పరార్- పెళ్లి పీటల మీద పోలీస్ వరుడికి షాకిచ్చిన మహిళా కానిస్టేబుల్!
Embed widget