Social Media Post Killed: సోషల్ మీడియా స్టేటస్‌పై ఘర్షణ- మదర్సాలో బాలుడు మృతి
Social Media Post Killed: సోషల్ మీడియాలో అభ్యంతరకరమైన పోస్టు పెట్టాడని హైదరాబాద్‌లోని ఓ మదర్సాలో విద్యార్థిని చంపిన స్నేహితుడు
Social Media Post Killed: హైదరాబాద్‌లోని ఓ మదర్సాలో జరిగిన ఘర్షణ హత్యకు దారి తీసింది. నార్సింగిలోని మదర్సాలో ఇద్దరు బాలురు మధ్య ఘర్షణ జరిగింది. సోషల్ మిడియాలో పెట్టిన స్టేటస్ ఈ గొడవకు కారణమైంది. ఈ మదర్సాలో వేర్వేరు రాష్ట్రాలకు చెందిన బాలురు ఉంటున్నారు.
ఈ మదర్సాలో రెండు వర్గాలు ఉన్నాయని అందుకో ఓ వర్గాన్ని రెచ్చగొట్టేలా మరో వర్గానిక చెందిన వ్యక్తి స్టేట్ పెట్టాడు. సిరాజ్, రహీమ్ అనే ఇద్దరి మధ్య చెలరేగిన వివాదంలో రహీమ్ చనిపోయాడు. రహీమ్ తన స్నేహితులతో ఉన్న ఫొటోను అభ్యంతరకరమైన రీతిలో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ యాడ్ చేసి సోషల్ మీడియాలో సిరాజ్ పెట్టాడు.
ఇలా అభ్యంతరకరమైన ఫొటో పెట్టడంపై రహీమ్ అభ్యంతరం చెప్పాడు. ఇది కాస్త ఇరు వర్గాల మధ్య ఘర్షణకు దారి తీసింది. సిరాజ్ గ్రూప్‌నకు చెందిన బాలురు రహీమ్‌పై దాడికి దిగారు. ఆ దెబ్బలకు తట్టుకోలేక ఆ బాలుడు స్పాట్‌లోనే పడిపోయాడు.
మదర్సా సిబ్బంది వచ్చి రహీమ్‌ను ఆసుపత్రికి తరలించారు. అక్కడ పరీక్షించిన వైద్యులు బాలుడు చనిపోయినట్టు చెప్పారు. దీంతో విషయాన్ని పోలీసులుకు చెప్పారు. పోలీసులు వచ్చి కేసు నమోదు చేసుకున్నారు. సిరాజ్‌ను అదుపులోకి తీసుకున్నారు. అసలు గొడవలకు కారణాలపై విచారణ చేస్తున్నారు.