అన్వేషించండి

Hyderabad News: బోటి కూర కోసం మందుబాబు రచ్చరచ్చ.. వేడి వేడిగా ఇవ్వలేదంటూ కాగుతున్న నూనె పోసి దాడి..

మద్యం మత్తులో ఉన్న ఓ యువకుడు బోటి కూర కావాలని వైన్ షాప్ నిర్వాహకుడిని అడిగాడు. కూర వేడిగా లేదు, వేడి చేసి మళ్లీ తీసుకురమ్మని విసిగించాడు. కూర తీసుకురానుందుకు మసిలే నూనెను నిర్వాహకుడిపై పోశాడు.

మద్యం మత్తులో ఉన్న ఓ యువకుడు బోటి కూర కావాలని వైన్ షాప్ నిర్వాహకుడిని అడిగాడు. అతడు కూర తెచ్చి ఇచ్చాడు. కూర వేడిగా లేదు, వేడి చేసి మళ్లీ తీసుకురమ్మని విసిగించాడు. తాగిన మత్తులో గట్టిగా అరుస్తూ కేకలు పెట్టాడు. కూర తీసుకురానుందుకు మసిలే నూనెను నిర్వాహకుడిపై పోశాడు. ఈ ఘటన నాచారం ఠాణా పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మల్లాపూర్‌లోని ఓ వైన్స్‌ పర్మిట్‌ రూంలో మీర్‌పేట్‌ హెచ్‌బీ కాలనీకి చెందిన ధర్మేందర్‌ అనే వ్యక్తి సోమవారం రాత్రి మద్యం తాగుతున్నాడు. 

మల్లాపూర్‌కు చెందిన శివ కుమార్‌ అనే వ్యక్తి అక్కడికి వెళ్లాడు. అప్పటికే మద్యం మత్తులో ఉన్న ధర్మేందర్‌.. బోటి కూర వేడి చేసుకురావాలని శివ కుమార్‌ని విసిగించాడు. అంతటితో ఆగకుండా గట్టిగా కేకలు పెట్టాడు. దీంతో శివ కుమార్‌ ధర్మేందర్‌ను హెచ్చరించాడు. నువ్వు నాకు చెప్పేదేమిటంటూ ధర్మేందర్‌ స్నేహితులు ముగ్గురు శివ కుమార్‌పై బండ రాయితో దాడి చేశారు. అంతటితో ఆగకుండా.. పక్కనే ఉన్న బజ్జీల కడాయిలో కాగుతున్న నూనె ఆయనపై పోశారు. ఘటనలో శివ కుమార్‌కు తీవ్రగాయాలు అయ్యాయి. దీంతో అతడిని గాంధీ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం శివ కుమార్‌కు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. మద్యం మత్తులో జరిగే నేరాలు పోలీసులకు తలనొప్పిగా మారుతున్నాయి.

Also Read: Warangal Crime: వరంగల్‌లో దారుణం.. సొంత అన్న ఫ్యామిలీపై కత్తులతో దాడి.. ముగ్గురు అక్కడికక్కడే మృతి

వరంగల్‌లో దారుణం..
వరంగల్‌ జిల్లాలో దారుణం జరిగింది. బుధవారం తెల్లవారు జామునే చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. సొంత తమ్ముడే అన్న కుటుంబంపై గొడ్డలి, కత్తితో దాడి చేశాడు. వారు నిద్రిస్తున్న సమయంలో ఈ దాడికి పాల్పడడంతో ఆ కుటుంబంలో ముగ్గురు అక్కడికక్కడే మరణించారు. ఈ ఘటనలో మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వరంగల్‌ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్‌ నగరంలోని ఎల్బీ నగర్‌లో మహమ్మద్‌ చాంద్‌ బాషా కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్నారు. ఆయనకు తన సొంత తమ్ముడు షఫీతో కలిసి ఏడాది కాలంగా పశువుల వ్యాపారం నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలోనే లావాదేవీల విషయంలో ఇద్దరి మధ్య వివాదం నడుస్తోంది. దాదాపు రూ.కోటి విషయంలో వారిద్దరి మధ్య భేదాభిప్రాయాలు నెలకొన్నాయి. ఈ క్రమంలో అన్నపైనే కోపం పెంచుకున్న షఫీ.. బుధవారం చాంద్‌బాషా కుటుంబంపై దాడి చేసి దారుణానికి ఒడిగట్టాడు. 

Also Read: Biryani Theft: బిర్యానీ కోసం దొంగగా మారిన బాలుడు... చిరుతిళ్ల కోసం తాళం వేసిన ఇళ్లే లక్ష్యం... ఒకే పీఎస్ లో 10 కేసులు

Also Read: Gold-Silver Price: రెండో రోజు తగ్గిన బంగారం ధరలు.. పసిడి బాటలోనే వెండి పయనం.. నేటి ధరలు ఇలా..

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Cyclone Fengal: ఫెంగల్ తుపాను ఎఫెక్ట్ - తిరుమలలో విరిగిపడిన కొండచరియలు, వర్షాలతో విమానాలు రద్దు
ఫెంగల్ తుపాను ఎఫెక్ట్ - తిరుమలలో విరిగిపడిన కొండచరియలు, వర్షాలతో విమానాలు రద్దు
Mulugu Encounter: ములుగు జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్‌, ఏడుగురు మావోయిస్టుల హతం
ములుగు జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్‌, ఏడుగురు మావోయిస్టుల హతం
Chevireddy Bhaskar Reddy: మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డిపై పోక్సో కేసులో బిగ్ ట్విస్ట్ - పోలీసులకు తాను ఎలాంటి ఫిర్యాదు చేయలేదన్న బాలిక తండ్రి
మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డిపై పోక్సో కేసులో బిగ్ ట్విస్ట్ - పోలీసులకు తాను ఎలాంటి ఫిర్యాదు చేయలేదన్న బాలిక తండ్రి
Bougainvillea OTT: థియేటర్లలోకి ‘పుష్ప 2’తో... ఓటీటీలోకి ‘బోగన్ విల్లా’తో... డిసెంబర్‌లో ఫహాద్ ఫాజిల్ డబుల్ ధమాకా
థియేటర్లలోకి ‘పుష్ప 2’తో... ఓటీటీలోకి ‘బోగన్ విల్లా’తో... డిసెంబర్‌లో ఫహాద్ ఫాజిల్ డబుల్ ధమాకా
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కేజ్రీవాల్‌పై రసాయన దాడి, గ్లాసుతో పోసిన దుండగుడుBobbili Guest House History Tour | బొబ్బిలి రాజుల గెస్ట్ హౌస్ ఎందుకంత ఫేమస్ | ABP DesamRishiteswari Case: Guntur Court Final Verdict | 9 ఏళ్ల తర్వాత కోర్టు తీర్పు ఏంటి? | ABP DesamPawan Kalyan Seize the Ship | డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ అంతర్జాతీయ నౌకను సీజ్ చేయగలరా? | ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Cyclone Fengal: ఫెంగల్ తుపాను ఎఫెక్ట్ - తిరుమలలో విరిగిపడిన కొండచరియలు, వర్షాలతో విమానాలు రద్దు
ఫెంగల్ తుపాను ఎఫెక్ట్ - తిరుమలలో విరిగిపడిన కొండచరియలు, వర్షాలతో విమానాలు రద్దు
Mulugu Encounter: ములుగు జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్‌, ఏడుగురు మావోయిస్టుల హతం
ములుగు జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్‌, ఏడుగురు మావోయిస్టుల హతం
Chevireddy Bhaskar Reddy: మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డిపై పోక్సో కేసులో బిగ్ ట్విస్ట్ - పోలీసులకు తాను ఎలాంటి ఫిర్యాదు చేయలేదన్న బాలిక తండ్రి
మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డిపై పోక్సో కేసులో బిగ్ ట్విస్ట్ - పోలీసులకు తాను ఎలాంటి ఫిర్యాదు చేయలేదన్న బాలిక తండ్రి
Bougainvillea OTT: థియేటర్లలోకి ‘పుష్ప 2’తో... ఓటీటీలోకి ‘బోగన్ విల్లా’తో... డిసెంబర్‌లో ఫహాద్ ఫాజిల్ డబుల్ ధమాకా
థియేటర్లలోకి ‘పుష్ప 2’తో... ఓటీటీలోకి ‘బోగన్ విల్లా’తో... డిసెంబర్‌లో ఫహాద్ ఫాజిల్ డబుల్ ధమాకా
Gautam Adani: ఎన్ని దాడులు జరిగితే అంత రాటుదేలతాం - ఆరోపణలపై తొలిసారి స్పందించిన అదానీ
ఎన్ని దాడులు జరిగితే అంత రాటుదేలతాం - ఆరోపణలపై తొలిసారి స్పందించిన అదానీ
Jigra OTT: యాక్షన్ అదరగొట్టిన ఆలియా భట్... బాలీవుడ్ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ - ఎప్పుడు, ఎందులోనో తెలుసా?
యాక్షన్ అదరగొట్టిన ఆలియా భట్... బాలీవుడ్ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ - ఎప్పుడు, ఎందులోనో తెలుసా?
Aravind Kejriwal: కాంగ్రెస్ తో దోస్తీకి స్వస్తి, ఢిల్లీలో ఒంటరిగా పోటీ చేయనున్న ఆప్- స్పష్టం చేసిన కేజ్రీవాల్
కాంగ్రెస్ తో దోస్తీకి స్వస్తి, ఢిల్లీలో ఒంటరిగా పోటీ చేయనున్న ఆప్- స్పష్టం చేసిన కేజ్రీవాల్
Viral Video: చెన్నై ఎయిర్‌పోర్టులో విమానానికి తప్పిన ముప్పు, ల్యాండింగ్ సమయంలో భయానక పరిస్థితులు
చెన్నై ఎయిర్‌పోర్టులో విమానానికి తప్పిన ముప్పు, ల్యాండింగ్ సమయంలో భయానక పరిస్థితులు
Embed widget